న్యూస్ రౌండప్ ... టాప్ 20

1.వరద సహాయం నిలిపివేత పై కోర్టు తీర్పు

తెలంగాణలో వరద బాధితులకు తక్షణ సహాయం కింద అందిస్తున్న పదివేల ను జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో నిలిపివేయడం సరైనదేనని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.

 Telangana And Andhra Pradesh Today News Roundup, Vote For Note Case, Sourav Gang-TeluguStop.com

2.ఓటుకు నోటు కేసు


Telugu Bandi Sanjay, Congresssenior, Purijagannath, Souravganguly, Telanganaandh

అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.ఈ కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు ఉన్నారు.

3.ఎంపీ ధర్మపురి అరవింద్ పై పోలీసులకు ఫిర్యాదు


కెబిఆర్ పార్క్ సమీపంలో టిఆర్ఎస్ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఈనెల 23న ఉద్దేశపూర్వకంగా ఎంపీ అరవింద్ తొలగించారని టిఆర్ఎస్ కార్యదర్శి మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

4.తెరుచుకోనున్న పూరి ఆలయం


Telugu Bandi Sanjay, Congresssenior, Purijagannath, Souravganguly, Telanganaandh

ఒడిషాలోని ప్రముఖ పూరి జగన్నాథ క్షేత్రం డిసెంబర్ మూడో వారంలో తిరిగి తెరుచుకునేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.కరోనా ఎఫెక్ట్ తో గత ఏడు నెలలుగా పూరి ఆలయం లోకి భక్తులను అనుమతించడం లేదు.ఇకపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించబోతున్నారు.

5.హీరో మహేష్ బాబు రికార్డ్


తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో మహేష్ instagram  లో మరో రికార్డు సృష్టించారు .ఆయన ఫాలో అవుతున్న వారి సంఖ్య 6 మిలియన్లు దాటింది.ఇక ఆయన ట్విట్టర్ ఖాతాను 10.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

6.కత్తిపట్టిన డేవిడ్ వార్నర్


Telugu Bandi Sanjay, Congresssenior, Purijagannath, Souravganguly, Telanganaandh

ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.ముఖ్యంగా తెలుగు సినిమాలోని సన్నివేశాలను ఇమిటేట్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని ఎన్టీఆర్ కత్తిపట్టిన సన్నివేశాన్ని డేవిడ్ వార్నర్ అనుకరించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

7.43 చైనా యాప్ లను నిషేధించిన భారత్


సరిహద్దుల్లో చైనాతో వివాదం ఏర్పడిన నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో 43 మొబైల్ యాప్స్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

8.కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత


Telugu Bandi Sanjay, Congresssenior, Purijagannath, Souravganguly, Telanganaandh

కరోనా వైరస్ ప్రభావం కి గురై కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూసారు.గత నెలలో ఆయన కరోనా ప్రభావానికి గురయ్యారు.అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు.ఆయన మృతి చెందిన వార్తను ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

9.నేడు జగనన్న తోడు పథకం ప్రారంభం


ఏపీలో చిరు, వీధి వ్యాపారులు, హాకర్స్ కు బ్యాంకుల ద్వారా పదివేల వరకు సున్నా వడ్డీ రుణాలను అందించే జగనన్న తోడు పథకాన్ని ఈరోజు జగన్ ప్రారంభించబోతున్నారు.

10.ఆరుబయట బండి సంజయ్ నిద్ర


Telugu Bandi Sanjay, Congresssenior, Purijagannath, Souravganguly, Telanganaandh

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పగలంతా తిరుగుతున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బస్తీ నిద్ర లో భాగంగా నాగోల్ లోని శివాలయం ప్రాంతంలో ఆరుబయట నిద్రించారు.

11.గద్దర్ ను కలిసిన రేవంత్


ప్రజా గాయకుడు గద్దర్ ను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

12.చెన్నైలో భారీ వర్షం .విమానాలు రద్దు


Telugu Bandi Sanjay, Congresssenior, Purijagannath, Souravganguly, Telanganaandh

నివర్ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో విమానాల రాకపోకలను నిలిపివేశారు.

13.ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే


అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నూతన చైర్మన్ గా న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్ క్లే ఎన్నికయ్యారు.

14.భారత్ లో కరోనా కేసులు


Telugu Bandi Sanjay, Congresssenior, Purijagannath, Souravganguly, Telanganaandh

భారత్ లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.ఇప్పటికీ మొత్తం కేసుల సంఖ్య 92 లక్షలు దాటినట్లు గా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

15.  ఆఫ్ఘనిస్తాన్ లో పేలుళ్ళు


ఆఫ్ఘనిస్తాన్ లోని బమియన్  పట్టణం బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి.ఈ పేలుళ్లలో 17 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు.

16.గంగూలి కి  22 సార్లు కరోనా టెస్ట్ లు


Telugu Bandi Sanjay, Congresssenior, Purijagannath, Souravganguly, Telanganaandh

కరుణ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తన విధులు నిర్వర్తిస్తూనే ఈ నాలుగున్నర నెలల కాలంలో 22 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను అని బీసిసిఐ అధ్యక్షుడు సౌర గంగులి ప్రకటించారు.

17.ఘనంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుమార్తె వివాహం


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమార్తె శ్రీనిధి-  ప్రణవ్ ల వివాహం బుధవారం ఘనంగా జరిగింది.

18.ఎంపీ ఇంటి పై బాంబు దాడి


Telugu Bandi Sanjay, Congresssenior, Purijagannath, Souravganguly, Telanganaandh

తమిళనాడు అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయ్ కుమార్ ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు.అయితే అది  పేలకపోవడంతో  పెను ప్రమాదం తప్పింది.

19.అయోధ్య ఎయిర్ పోర్ట్ పేరు మార్పు


అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదనను యూపీఏ ప్రభుత్వం ఆమోదించింది.ఈమేరకు మంత్రివర్గం దీనిని తీర్మానించింది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Bandi Sanjay, Congresssenior, Purijagannath, Souravganguly, Telanganaandh

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45, 600.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,750.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube