న్యూస్ రౌండప్ -- టాప్ 20

1.రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

బీజేపీ నాయకులను తయారు చేసుకో లేక కాంగ్రెస్ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కాళ్లపై పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు.

 Ap And Telangana News Roundup Top-20, Breaking Headlines, Top News, Revanth Redd-TeluguStop.com

2.గుంత లేని రోడ్డు చూపిస్తే లక్ష రూపాయలు

రోడ్లపై గుంతలు చూపిస్తే వెయ్యి ఇస్తామని గతంలో టిఆర్ఎస్ ఛాలెంజ్ చేసిందని, ఇప్పుడు గుంత లేని రోడ్డు చూపిస్తే , తాను లక్ష రూపాయలు ఇస్తానని టిఆర్ఎస్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

3.టిఆర్ఎస్ తో పొత్తు లేదు

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

టిఆర్ఎస్ పార్టీ తో ఎంఐఎం పార్టీకి ఎటువంటి పొత్తు లేదని, ఆ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ క్లారిటీ ఇచ్చారు.

4.కరోనా భయంతో ఎక్కువ కొనేస్తున్న అమెరికన్లు

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

కరోనా వైరస్ మళ్లీ అమెరికాలో విజృంభిస్తున్న తరుణంలో, పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అనే భయంతో, నిత్యవసర సరుకులు అవసరానికి మించి ఎక్కువగా అమెరికన్లు కొనుగోలు చేస్తున్నారట.

5.ఎక్కడైనా ఆడేందుకు సిద్దం

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

జట్టు అవసరాలను బట్టి ఎక్కడైనా ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, టీమిండియా బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ప్రకటించారు.ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

6.తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 41, 646 మందికి కరోనా పరీక్షలు నిర్ధారించగా 873 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 2,63,526 కి చేరింది.

7.బీజేపీ మేయర్ కావాలా ? ఎంఐఎం మేయర్ కావాలా ?

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై చార్జిషీట్ విడుదల చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, బీజేపీ మేయర్ కావాలా ? ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.

8.భారత్ లో కరోనా

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

భారత్ లో నమోదవుతున్న కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టు గా కనిపిస్తున్నాయి.గురువారం 45, 882, శుక్రవారం 46,232, శనివారం 45,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మొత్తం ఇప్పటి వరకు 90, 95,  807 కు కేసులు చేరాయి.

9.సల్మాన్ ఖాన్ కు కరోనా టెస్ట్

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం లో కరోనా కలకలం రేగింది.డ్రైవర్ తో పాటు, మరో ఇద్దరు సిబ్బందికి కరోనా సోకడంతో సల్మాన్ ఖాన్ కు సైతం పరీక్షలు నిర్వహించారు.అయితే ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చిందట.

10.విషమంగా మాజీ సీఎం ఆరోగ్యం

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ సీఎం తరుణ్ గొగయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో, ఆయనను గువాహటి వైద్య కళాశాలలో చేర్పించారు.ఇప్పటికీ ఆయన పరిస్థితి విషమంగానే ఉండడంతో వెంటిలేటర్స్ పై చికిత్స అందిస్తున్నారు.

11.ఉచితంగా Netflix సర్వీస్

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

డిసెంబర్ 5 6 తేదీల్లో ప్రతి ఒక్కరికి Netflix సర్వీసు ఉచితంగా అందించబోతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.ప్రమోషనల్ ఆఫర్ గా ఉచితంగా రెండు రోజులు సేవలు అందిస్తామని ఆ సంస్థ వెల్లడించింది.

12.పాపం ట్రంప్

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రచార బృందానికి చుక్కెదురైంది.నిబంధనలకు అనుగుణంగా లేని వాళ్లను తిరస్కరించాలని కోరుతూ పెన్సిల్వేనియా కోర్టులో వేసిన దావాను ఆ జిల్లా కోర్టు కొట్టి వేసింది.

13.పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్లో మార్పులు

ఏపీలో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ నెల 23 నుంచి 6 ,7 ,8 తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా, ఎనిమిదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

14.48 గంటల్లో  వాయుగుండం

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారి ఈ నెల 27 నాటికి మరింత బలపడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.

15.పేద నిరుద్యోగులకు మినీ ట్రక్కులు

బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నిరుద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించే నిమిత్తం 60 శాతం సబ్సిడీతో 9,260 వాహనాలను ఆంధ్ర చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.ఒక్కో వాహనం ఖరీదు 5,81,190 గా మొత్తం పేర్కొంది.

16.ప్రముఖ నటి కన్నుమూత

బాలీవుడ్ కు చెందిన ప్రముఖ టెలివిజన్ నటి లీనా ఆచార్య (30) కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు.

17.కేసీఆర్ ను కలిసిన సినీ ప్రముఖులు

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించేందుకు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, సి.కళ్యాణ్ తదితరులు కేసీఆర్ ను కలిసి  సమస్యలను ప్రస్తావించి, వాటిపై హామీ పొందారట.

18.పెళ్లి చేసుకున్న సనా ఖాన్

లుగు హిందీ తమిళ సినిమాల్లో నటించిన  ప్రముఖ నటి సనా ఖాన్ పెళ్లి చేసుకుని ధర్మ సర్ ప్రైజ్ చేశారు.

19.కౌ క్యాబినెట్ మొదటి సమావేశం

మధ్యప్రదేశ్ లో గో సంరక్షణ కోసం కౌ కేబినెట్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.గో వదలను నిలువరించేందుకు కౌ క్యాబినెట్ మొదటి సమావేశం నిర్వహించారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Andhra, Gold Rates, International, Revanth Reddy, Telangana, Top-Latest N

పది గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర – 51,390, పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర -47,110.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube