న్యూస్ రౌండప్ టాప్ 20

1.లోకేష్ పై విజయసాయి విమర్శలు

Telugu Pages, Chandrababu, Cm Kcr, Corona, Jai Bheem, Janasenapawan, Shilpa Shet

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు.” లోకేష్ పదజాలం చూస్తే రాజకీయాలకు అర్హుడా .ఈ సమాజంలో పుట్టాడా.అమెరికాలో ఎంబీఏ చదివాడా … ఇవన్నీ బోగస్ డిగ్రీలా … నీకేమైనా మతి భ్రమించింది “ అని అనుమానం కలుగుతోంది అంటూ వ్యాఖ్యానించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.భారత్ కు ఎస్ – 400 పంపిణీ ప్రారంభించిన రష్యా

భారత్ కు ఎస్ – 400 వాయు క్షిపణి పంపిణీ వ్యవస్థలను పంపిణీ చేయనున్నట్టు రష్యా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

3.మరో కేసులో శిల్ఫాశెట్టి దంపతులు

Telugu Pages, Chandrababu, Cm Kcr, Corona, Jai Bheem, Janasenapawan, Shilpa Shet

బాలీవుడ్ నటి శిల్ప శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరో కేసులో ఇరుక్కున్నారు.తమను వీరిద్దరూ మోసం చేసారు అంటూ కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసారు.

4.శ్రీవారి భక్తులకు శుభవార్త

కరోనా కారణంగా ఇప్పటివరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిచ్చామని ఇక పై ఈ మరింతమందికి అవకాశం దక్కేలా చెర్యలు తీసుకోబోతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

5.ఓటిటి లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

Telugu Pages, Chandrababu, Cm Kcr, Corona, Jai Bheem, Janasenapawan, Shilpa Shet

అక్కినేని అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ” సినిమా ఈ నెల 19 నుంచి ఓ టి టి లో రాబోతోంది.నెట్ ఫ్లిక్స్ , ఆహా ఓటీటి ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

6.రేపు నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన

రేపు నల్గొండ సూర్యాపేట జిల్లాలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు.

7.”18  పేజెస్” రిలీజ్ డేట్ ఖరారు

Telugu Pages, Chandrababu, Cm Kcr, Corona, Jai Bheem, Janasenapawan, Shilpa Shet

యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ” 18 పేజెస్ ” సినిమా తేదీ ఖరారైంది ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

8.ఆర్టీసీ ఎండి సజ్జనార్ కీలక నిర్ణయం

తెలంగాణ ఆర్టీసీ ఎండి విసర్జన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా  15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు బస్సుల్లో ఉచితంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

9.హాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘జై భీమ్ ‘

Telugu Pages, Chandrababu, Cm Kcr, Corona, Jai Bheem, Janasenapawan, Shilpa Shet

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘ జై భీమ్ ‘ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతోంది.తాజాగా ఐ ఎం డి బీలో టాప్ 250 సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుని హాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది.

10.మహా పాదయాత్ర పై వైసీపీ విమర్శలు

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను టిడిపి నేతలు పూర్తిగా తమ పాదయాత్రగా మార్చుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు విమర్శలు  చేశారు.

11.ఎన్టీఆర్ షో లో కోటి గెలుచుకున్న తెలంగాణ యువకుడు

Telugu Pages, Chandrababu, Cm Kcr, Corona, Jai Bheem, Janasenapawan, Shilpa Shet

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్ గా చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలానికి చెందిన  బి.రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్న ట్లుగా టీవి ప్రోమో ద్వారా తెలుస్తోంది.

12.శ్రీశైలం లో బోట్ సర్వీస్ నిలిపివేత

నాగార్జునసాగర్ శ్రీశైలం మధ్య నడిచే బోర్డు సర్వీసులను తెలంగాణ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.

13.విశాఖలో భూప్రకంపనలు

విశాఖ నగరంలో ఆదివారం తెల్లవారుజామున పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది.దీనికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు.

14.తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

Telugu Pages, Chandrababu, Cm Kcr, Corona, Jai Bheem, Janasenapawan, Shilpa Shet

బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం మరో అల్పపీడనం ఏర్పడడంతో దాని ప్రభావంతో ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

15.శంషాబాద్ లో ప్రయాణికులు ఆందోళన

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.ముంబై వయా హైదరాబాద్ మీదుగా జగదల్పూర్ వెళ్లాల్సిన ఇండియా విమానం సాంకేతిక లోపం ఏర్పడింది.

దీంతో మరో విమానాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేసినా.పట్టించుకోకపోవడంతో,  ఎయిర్ ఇండియా సిబ్బంది వైఖరిని నిరసిస్తూ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు బైఠాయించి నిరసన తెలియజేశారు.

16.తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ నేడు

Telugu Pages, Chandrababu, Cm Kcr, Corona, Jai Bheem, Janasenapawan, Shilpa Shet

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన తిరుపతిలో కాసేపట్లో సదరన్ జోనల్ కౌన్సిల్ ప్రారంభంకానుంది.

17.తిరుమల కు అరుదైన గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానం కి అరుదైన గుర్తింపు లభించింది.దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు ఇంగ్లాండ్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల సంస్థ టీటీడీ కి ఈ సర్టిఫికేట్ ఇచ్చింది.

18.ఈరోజు ఏపీలో 69 పంచాయతీల్లో ఎన్నికలు

ఏపీలో ఈరోజు 69 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా చాలా చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి.ఇప్పుడు వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి.

19.నిర్మల సీతారామన్ సమావేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Pages, Chandrababu, Cm Kcr, Corona, Jai Bheem, Janasenapawan, Shilpa Shet

22 క్యారెట్లా 10 గ్రాముల బంగారం ధర – 48,290

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,290

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube