న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఎంపీ రఘురామ కు కొనసాగుతున్న వైద్య పరీక్షలు

మిలటరీ ఆసుపత్రిలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.డాక్టర్ సేన్ గుప్తా, డాక్టర్ ఫిలిప్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

 Ap And Telangana News Headlines, News Roundup, Top20news, Headlines,today Gold R-TeluguStop.com

2.కోవిడ్ ఆస్పత్రి నుంచి దూకి కరోనా రోగి మృతి

Telugu Ap Telangana, Corona India, Etela Rajendar, Trs Mla, Pallarajeswar, Gold,

కృష్ణా జిల్లా గన్నవరం మండలం లోని పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు కృష్ణాజిల్లా తెలప్రోలు శివారు కొత్తూరు కి చెందిన పాలిబోయిన రోశయ్య (50).

3.14 వ రోజుకు చేరుకున్న లాక్ డౌన్

కరోనా తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విధించే లాక్ డౌన్ నేటికి14 వ రోజుకు చేరుకుంది.

4.సిఎస్ ఐ ఆర్ ఆన్లైన్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించే నేపథ్యంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆన్ లైన్ పోటీలను నిర్వహిస్తున్నారు.పూర్తి వివరాలకు www.csir.rec.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

5.ఫైర్ సేఫ్టీ కోర్సులకు 19 వరకు దరఖాస్తులు

నేషనల్ ఫర్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ విమల రెడ్డి తెలిపారు.

6.ఈటెల కుమారుడు భూకబ్జా ఆరోపణలపై విచారణ

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి భూ కబ్జా ఆరోపణ లపై ఇంటిలిజెన్స్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు.

7.ఉప్పల్ ఎమ్మెల్యేపై కేసు

Telugu Ap Telangana, Corona India, Etela Rajendar, Trs Mla, Pallarajeswar, Gold,

వివాదాస్పద భూమి వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు ఉప్పల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కాప్రా ఇన్చార్జి తాసిల్దార్ గౌతమ్ కుమార్ పై జవహర్ నగర్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

8.ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు 31 వరకు

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ని ఈ నెల 31 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ తెలిపింది.

9.రైల్వేలో మెడికల్ ఉద్యోగాలు

Telugu Ap Telangana, Corona India, Etela Rajendar, Trs Mla, Pallarajeswar, Gold,

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిది లోని  మెడికల్ విభాగంలో తాత్కాలిక పద్దతిలో ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడింది.ఏడు క్యాటగిరిల్లో మొత్తం 80 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

10.బీసీ గురుకుల కళాశాలల్లో దరఖాస్తు గడువు పెంపు

బీసీ గురుకులాల్లోని జూనియర్ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం బాల బాలికలకు డిగ్రీ కళాశాలల్లో దరఖాస్తు గడువును జూన్ 16 వరకు  పొడగించారు.

11.కృష్ణ బోర్డు సమావేశం వాయిదా

మంగళవారం జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం వాయిదా పడింది. తుఫాను ప్రభావం కారణంగా తాము ఈ సమావేశంలో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు తెలిపింది.ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని వాయిదా వేశారు.

12.పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా

నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ గా రెండో సారి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

13.పంజాబ్ నటుడు దీప్ సిద్దు పై మరో కేసు

వివాదాస్పద పంజాబీ నటుడు దీప్ సిద్దు పై మరో కేసు నమోదైంది. Covid 19 మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు పరీద్ కొట్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

14.ఆర్ఎస్ఎస్ పెద్దలతో మోదీ, అమిత్ షా భేటీ

Telugu Ap Telangana, Corona India, Etela Rajendar, Trs Mla, Pallarajeswar, Gold,

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆర్ఎస్ఎస్ పెద్దలతో భేటీ అయ్యి ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.

15.కోవిడ్ నుంచి కోలుకున్న ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు.తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ గా వచ్చింది.

16.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,96,427 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

17.ఊపిరి ఉన్నంతవరకు రాజకీయాల్లోనే : కమల్

Telugu Ap Telangana, Corona India, Etela Rajendar, Trs Mla, Pallarajeswar, Gold,

తన ఊపిరి ఉన్నంతవరకు రాజకీయాల్లోనే ఉంటానని మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రకటించారు.

18.నకిలీ డిఎస్పీ అరెస్ట్

డిఎస్పి నంటూ  నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులు అరెస్టు చేశారు.ఏసీబీ, ఇంటెలిజెన్స్ డిఎస్పి నంటూ పరిచయం చేసుకుంటూ అనంతపురం జిల్లా నల్లమడ మండలం, వెలిమద్ది గ్రామానికి చెందిన రాచపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతూ ఉండడంతో పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీ కర్ణాటకలలో దాదాపు 70 కేసులు నమోదయ్యాయి.

19.మూడు కోట్ల కారు కొన్న రణవీర్ సింగ్

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ 3.43 కోట్ల విలువైన లంబోర్ఘిని యురస్ పెరల్ క్యాప్సిల్ ఎడిషన్ ను కొనుగోలు చేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Corona India, Etela Rajendar, Trs Mla, Pallarajeswar, Gold,

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45, 600

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,720.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube