న్యూస్ రౌండప్ టాప్ 20 

1.కోవీషీల్డ్ వాయిల్స్ మిస్సింగ్ పై విచారణ

కొండాపూర్ జిల్లా హాస్పటల్ లో కోవీ షీల్డ్ వాయిల్స్ మిస్సింగ్ పై విచారణ కొనసాగుతోంది.రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారు.

 Ap And Telangana Headlines, News Roundup, Top20 News, Today Gold Rate, Black Fun-TeluguStop.com

2.ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా కిట్ల పంపిణీ

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆక్సిజన్ సిలిండర్లు కరోనా కిట్లను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పంపిణీ చేశారు.

3.మిలటరీ హాస్పటల్ కు అందిన రఘురామ బెయిల్ ఆర్డర్ కాపీలు

Telugu Ap Telangana, Black Fungus, Corona, Gold, Top-Latest News - Telugu

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిల్ ఆర్డర్ కాపీలు మిలిటరీ హాస్పిటల్ కు అందాయి.

4.టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ పరీక్షలు వాయిదా

టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ పరీక్ష తేదీని తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది.ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి శ్రీనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు.వాయిదా వేసిన పరీక్షలను జూలై 17, 18 24 ,25 వ తేదీన నిర్వహించనున్నారు.

5.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 20,937 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 3464 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

7.30 వరకు భద్రాద్రి రామయ్య దర్శనం నిలిపివేత

Telugu Ap Telangana, Black Fungus, Corona, Gold, Top-Latest News - Telugu

కరోనా వ్యాప్తికి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దర్శనాలను 30వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

8.24 నుంచి పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ

పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్ 2021 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది.

9.ఆనందయ్య అరెస్ట్ పై ఎస్పీ క్లారిటీ

Telugu Ap Telangana, Black Fungus, Corona, Gold, Top-Latest News - Telugu

కరోనా కు మందు ఇస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం కు చెందిన అనందయ్య అరెస్ట్ పై సోషల్ మీడియాలో వదంతులపై జిల్లా ఎస్పీ క్లారిటీ ఇచ్చారు ఆయనను అరెస్టు చేయలేదని, ఆయనకు భద్రత కల్పించాము అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.

10.కృష్ణపట్నం లో ముగిసిన ఐసీఎంఆర్ బృందం పర్యటన

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కరోనాకు మందు ఇస్తున్న నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లో ఐసీఎంఆర్ బృందం పర్యటించింది.

11.ఆనందయ్య ను కలిసిన మంత్రి పేర్ని నాని

కరోనా కు ఆయుర్వేద మందు ఇస్తున్న అనందయ్య ను మంత్రి పేర్ని నాని కలిశారు.ప్రస్తుతం ఆనందయ్య  పోలీసుల ఆధ్వర్యంలో ఓ ప్రవేట్ హోటల్ లో ఉన్నారు.

12.మరింత కటినంగా లాక్ డౌన్

Telugu Ap Telangana, Black Fungus, Corona, Gold, Top-Latest News - Telugu

తెలంగాణలో లాక్ డౌన్ మరింత కటినంగా అమలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.ఉదయం తరువాత అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు.

13.సోనియా డిమాండ్

బ్లాక్ ఫంగస్ ను అయుష్మన్ భారత్ లో చేర్చాలి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు.

14.ఏపీలో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

15.భారత్ లో కరోనా

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 2,57,299 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

16.ఒకేరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కు 32 కోట్లు

Telugu Ap Telangana, Black Fungus, Corona, Gold, Top-Latest News - Telugu

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఒకేరోజు 32 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందింది.

17.సెంట్రల్ జైల్ ఖైదీల ను పరామర్శించిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు వరంగల్ లోని సెంట్రల్ జైలు ను సందర్శించారు ఈ సందర్భంగా ఖైదీలను పలకరించి వారి యోగక్షేమాలను కనుక్కున్నారు.

18.బ్లాక్ ఫంగస్ కేసులు

Telugu Ap Telangana, Black Fungus, Corona, Gold, Top-Latest News - Telugu

ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రెండు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.

19.విశాఖ జైలు లో కరోనా

విశాఖపట్నం సెంట్రల్ జైల్ లో 57 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ గా వైద్యాధికారులు నిర్ధారించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,930

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,830

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube