న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు

ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు చెప్పారు.

 Ap And Telangana News Headlines, News Roundup, Top20news, Headlines, Janasena Pa-TeluguStop.com

2.ఎంపీ రఘురామ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స

Telugu Ap Telangana, Janasenapawan, Supreme, Gold, Top-Political

ఎంపీ రఘురామకృష్ణంరాజు కు మిలటరీ ఆస్పత్రిలో ని అప్సర వార్డు లో చికిత్స పొందుతున్నారు.

3.తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.

4.’ గాంధీ ‘ జూనియర్ డాక్టర్ల సమ్మె

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే జూన్ 18 నుంచి సమ్మె ప్రారంభిస్తామని గాంధీ ఆసుపత్రి జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వనం మణికుమార్ హెచ్చరించారు.

5.మైనారిటీ గురుకుల ప్రవేశాల గడువు పెంపు

రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడగింపు చేసినట్టు ఆ సంస్థ కార్యదర్శి శఫియుల్లా తెలిపారు.ఈ నెల 31 వరకు దరఖాస్తు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

6.22న అల్పపీడనం ఏర్పడే అవకాశం

రాబోయే 24 గంటల్లో నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఈ ప్రభావంతో 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని 24వ తేదీ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

7.లడక్ లో భూకంపం

Telugu Ap Telangana, Janasenapawan, Supreme, Gold, Top-Political

కేంద్రపాలిత ప్రాంతం లడక్ లో భూకంపం సంభవించింది.శుక్రవారం ఉదయం 11.02 గంటలకు భూమి కంపించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజి ప్రకటించింది.

8.స్త్రీనిధి బ్యాంకు రుణాలకు ఆధార్ తప్పనిసరి

ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. స్త్రీ నిధి బ్యాంకు రుణాలకు ఆధార్ తప్పనిసరి చేశారు.

9.పది, ఇంటర్ పరీక్షల రద్దుకు లోకేష్ డిమాండ్

టిడిపి మాక్ అసెంబ్లీ లో పది ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు.

10.హైకోర్టు తీర్పుపై పవన్ కళ్యాణ్ స్పందన

Telugu Ap Telangana, Janasenapawan, Supreme, Gold, Top-Political

ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.

11.రెండో రోజు టిడిపి మాక్ అసెంబ్లీ ప్రారంభం

టిడిపి మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది.దీంట్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ్యులు కీలకంగా చర్చించనున్నారు.

12.కృష్ణపట్నం లో ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో ఆనందయ్య ఆధ్వర్యంలో అందిస్తున్న కరోనా ఆయుర్వేద మందు పంపిణీ తిరిగి పున ప్రారంభం అయ్యింది.

13.బ్రహ్మదేవుడు ఫలం పై ఎస్వీయూకి పేటెంట్

బ్రహ్మజెముడు తలంపై తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కి పేటెంట్ లభించింది.

14.సుప్రీంకోర్టులో రఘురామ తనయుడి  పిటిషన్ విచారణ

Telugu Ap Telangana, Janasenapawan, Supreme, Gold, Top-Political

తన తండ్రి అక్రమ అరెస్టు కస్టడీలో పోలీసులు పెట్టిన హింస పై ప్రత్యేక దర్యాప్తు బృందం తో విచారణ కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కుమారుడు భరత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీని పై నేడు విచారణ జరగనుంది.

15.జూన్ 1 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేత

మహారాష్ట్రలో కరోనా కేసులు  తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను క్రమంగా తొలగించే ఆలోచనలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు.

16.ఆస్పత్రి నుంచి విజయ్ కాంత్ డిశ్చార్జ్

Telugu Ap Telangana, Janasenapawan, Supreme, Gold, Top-Political

తీవ్ర అస్వస్థతకు గురైన డీఎంకే అధినేత విజయ్ కాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

17.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,59,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.కరోనా కట్టడిపై జగన్ సమీక్ష

Telugu Ap Telangana, Janasenapawan, Supreme, Gold, Top-Political

కరోనా నియంత్రణ, వాక్సినేషన్ పై ఏపీ సీఎం జగన్ శుక్రవారం తన క్యాంప్ ఆఫీసులో నిరసన దీక్ష చేపట్టారు.

19.అంటువ్యాధుల జాబితాలో బ్లాక్ ఫంగస్

బ్లాక్ ఫంగస్ జబ్బుని అంటు వ్యాధుల పరిధిలోకి చేర్చుతూ వైద్య  ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

20 ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Janasenapawan, Supreme, Gold, Top-Political

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,900

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,830.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube