న్యూస్ రౌండప్ టాప్ 20

1.హైదరాబాద్ కు చేరుకున్న స్పుత్నిక్ వాక్సిన్

Telugu Ap Telangana, Corona India, Covid Vaccine, Gold Rates, Pm Care Funds, See

రష్యా లో తయారవుతున్న కరోనా విరుగుడు స్పుత్నిక్  వ్యాక్సినేషన్ రెండో బ్యాచ్ లో లక్షా 50 వేల డో సులు హైదరాబాద్ కు చేరుకున్నాయి.

 Ap And Telangana Breaking News, Headlines, News Roundup, Today Headlines, Gold R-TeluguStop.com

2.ఉదయం 6:30 నుంచి 9:30 వరకు బస్ పాస్ కౌంటర్ లు

హైదరాబాద్ సిటీ లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గ్రేటర్ లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.ఉదయం 6:30 నుంచి 9:30 వరకు బస్ పాస్ కౌంటర్ లు పని చేస్తాయని ఆయన అన్నారు.

3.ఈటెల రాజేందర్ తో కొండా సురేఖ భేటీ

Telugu Ap Telangana, Corona India, Covid Vaccine, Gold Rates, Pm Care Funds, See

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కొండా సురేఖ ఆదివారం భేటీ అయ్యారు.

4.బిట్స్ పిలానీ దరఖాస్తు గడువు పొడగింపు

బిట్స్ పిలానీ ప్రవేశపరీక్ష బిట్ సాట్ 2021 దరఖాస్తుల స్వీకరణ గడువును జూన్ 30 వరకూ పొడిగించారు .

5.పీఈ సెట్ దరఖాస్తు గడువు పెంపు

వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాలకు టి ఎస్ పీఈ సెట్ 2021 దరఖాస్తు గడువును పొడిగించారు.ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా, ఈ నెల 22 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

6.రేపటి నుంచి ప్రత్యేక పాస్ పోర్ట్ కౌంటర్

Telugu Ap Telangana, Corona India, Covid Vaccine, Gold Rates, Pm Care Funds, See

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలను రద్దు చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించాలని నిర్ణయించింది.సికింద్రాబాద్ లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం లో ఈ కౌంటర్ సోమవారం నుంచి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పని చేస్తుందని తెలంగాణ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి బాలయ్య తెలిపారు.

7.తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 4,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.భారత్ లో కరోనా

Telugu Ap Telangana, Corona India, Covid Vaccine, Gold Rates, Pm Care Funds, See

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,11,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

9.ఏపీ లో కరోనా

గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 22,517 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

10.హుస్సేన్ సాగర్ లో కరోనా ఆనవాళ్లు

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో కరోనా పదార్థాల ఆనవాళ్లు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది .హైదరాబాద్ చెరువుల్లోని నీటిని నమూనాలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ , అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ లు సంయుక్తంగా పరీక్షలు నిర్వహించాయి.

11.వైద్య శాఖలో 7180 పోస్టుల భర్తీకి ఆమోదం

రాష్ట్రంలో కరవు తీవ్రతను నేపథ్యంలో ఆసుపత్రిలో సిబ్బంది కొరత అధిగమించేందుకు తాత్కాలిక  నియామకాలకు తెలంగాణ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది .ఈ మేరకు ఆయా విభాగాల్లో 7180 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

12.సింగిల్ డోస్ స్పుత్నిక్ కు వెనిజులా ఆమోదం

రష్యా లో తయారు చేసిన స్పుత్నిక్ వాక్సిన్ వినియోగానికి వెనిజులా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

13.28 న జీఎస్టీ మండలి సమావేశం

ఈ నెల 28 న జిఎస్టి మండలి సమావేశం జరగనుంది.

14.పీఎం కేర్స్ నిధులతో వ్యాక్సిన్ కొనాలంటూ పిటిషన్

Telugu Ap Telangana, Corona India, Covid Vaccine, Gold Rates, Pm Care Funds, See

పిఎం కేర్స్ నిధులను వ్యాక్సిన్ కొనుగోలుకు వినియోగించాలి అంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.న్యాయవాది విప్లవ శర్మ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

15.కరోనా తో  కాంగ్రెస్ ఎంపీ మృతి

కారోనాతో  మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

16.  కరోనా తో మాజీ మంత్రి మృతి

కరోనా తో మాజీ మంత్రి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గరుడమ్మగారి నాగిరెడ్డి (68 ) మృతి చెందారు.

17.పోలీస్ శాఖలో గర్భిణులకు వర్క్ ఫ్రం హోం

కరోనా నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖలు గర్భిణీలు ఇంటి నుంచే పనిచేసేలా అవకాశం కల్పించినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

18.తెలంగాణలో నేడు రేపు వర్షాలు

టౌటే తుఫాన్ ప్రభావం తో నేడు , రేపు తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

19.అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సీతక్క నిరసన

 కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కోరుతూ ,తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

20.ఈ రోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Corona India, Covid Vaccine, Gold Rates, Pm Care Funds, See

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,070

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర –  46,070.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube