న్యూస్ రౌండప్ టాప్ -20

1.జానారెడ్డి సంచలన నిర్ణయం

Telugu Ap Telangana, Gold, Inter Exams, Top-Latest News - Telugu

ఇక పై ఏ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయబోనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

 Ap And Telangana Headlines, News Roundup, Top20news, Breaking News, Gold Rate, C-TeluguStop.com

2.ఓడినా తానే ముఖ్యమంత్రి

బెంగాల్ ఎన్నికల్లో తాను ఓటమి చెందినా, తమ పార్టీ గెలిచిన నేపథ్యంలో తానే ముఖ్యమంత్రి అంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

3.లాక్ డౌన్ పై కేంద్రానికి సుప్రీం సలహా

Telugu Ap Telangana, Gold, Inter Exams, Top-Latest News - Telugu

లాక్ డౌన్ విధింపు తగిన నిర్ణయం  తీసుకోవాలని  కేంద్రానికి సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది.

4.సీబీఐ కస్టడీ కి బొల్లినేని గాంధీ

మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని గాంధీ ని మూడు రోజుల కస్టడీకి సిబిఐ అధికారులు తీసుకున్నారు.

5.కొత్త పార్టీ ఏర్పాటుపై ఈటెల క్లారిటీ

తనకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తానని ఈటెల రాజేందర్ ప్రకటించారు.

6.కుంటల జలపాతానానికి పర్యాటకుల అనుమతి రద్దు

ప్రముఖ పర్యాటక కేంద్రం కుంటల జలపాతానికి పర్యాటకుల సందర్శన ను నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది.

7.మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కన్నుమూత

Telugu Ap Telangana, Gold, Inter Exams, Top-Latest News - Telugu

తెలంగాణలోని రామయం పేట మాజీ శాసన సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్ పీ చైర్మన్ రాజయ్య గారి ముత్యం రెడ్డి కన్నుమూశారు.

8.కోవాగ్జిన్ ఉత్పత్తికి విదేశీ భాగస్వామ్యం

వైద్యం తయారీ సంస్థ భారత్ బయోటెక్ వాక్సిన్ ఉత్పత్తిని మరింత విస్తరించనుంది.అమెరికాలో కోవాగ్జిన్ ఉత్పత్తి చేసేందుకు ఆక్యూ జెన్ అనే ఔషధ తయారీ సంస్థ తో ఒప్పందం చేసుకోనుంది.

9.భారత్ కు అమెరికా సహాయం

Telugu Ap Telangana, Gold, Inter Exams, Top-Latest News - Telugu

అమెరికా భారత్ కు ఒక లక్షా 25వేల ఇంజక్షన్లను పంపించింది.ఇంకా తగిన మెడికల్ సహాయం అందిస్తామని ఆదేశం ప్రకటించింది.

10.జగన్ ను కలిసిన ఎంపీ గురుమూర్తి

తిరుపతి వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి సోమవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ ను క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

11.పరీక్షలు వాయిదా సమిష్టి విజయం : లోకేష్

Telugu Ap Telangana, Gold, Inter Exams, Top-Latest News - Telugu

ఇంటర్ పరీక్షలు వాయిదా విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి విజయం , పోరాటానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

12.ఎస్ వి బి సి ట్రస్ట్ కి కోటి విరాళం

టీటీడీ ఆధ్వర్యంలో ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలోని ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా చెన్నైకు చెందిన జి స్క్వేర్ రియాల్ట్స్ సంస్థ  అందించింది.

13.ఏపీలో ఇళ్ల నుంచి కర్ఫ్యూ విధించే అవకాశం

ఏపీ సర్వే తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధించి ఆలోచన చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రకటించారు.

14.హోం క్వారంటెన్ లో ఉన్న వారు బయటికొస్తే జరిమానా

చెన్నై లో హోమ్ క్వారంటైన్ లో ఉన్న కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు బయట తిరిగితే రెండు వేల జరిమానా విధిస్తామని  చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ హెచ్చరించారు.

15.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,68,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

16.తెలంగాణలో కరోనా మరణాలు

గడచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనా కారణంగా 49 మంది మృతి చెందారు.

17.అన్ని భౌతిక సమావేశాలు రద్దు

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారత్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల చివరి వరకు తమ కార్యాలయాల్లో భౌతిక హాజరు తగ్గించింది.అంతేకాకుండా భౌతిక కాన్ఫరెన్స్ లు సమావేశాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

18.తెలంగాణలో కరోనా

Telugu Ap Telangana, Gold, Inter Exams, Top-Latest News - Telugu

తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 5,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.భారత్ కు వెళ్లొద్దు

భారత్ సహా  బ్రెజిల్ , ఇటలీ  దక్షిణాఫ్రికా , మెక్సికో టర్కీ, తదితర దేశాలకు  వెళ్ళొద్దని ఇజ్రాయిల్ దేశ పౌరులకు హెచ్చరికలు చేసింది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,360

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,360.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube