న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ లో కొత్తగా 7430 కరుణ పాజిటివ్ కేసులు నమోదు కాగా 56 మంది మృతి చెందారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

Telugu Ap Telangana, China, Corona India, Israelbans, Sonusood, Gold, Top-Latest

ప్రముఖ టెలివిజన్ యాంకర్ నటుడు ప్రదీప్ తండ్రి పాండురంగారావు అనారోగ్యంతో మృతి చెందారు.

3.ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది.

4.మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనాలు బంద్

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క ,సారలమ్మ దర్శనాలను శనివారం నుంచి నిలిపివేశారు.

5.జూ పార్కులు, అభయారణ్యాల మూసివేత

కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో జూ పార్కులు, అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు మూసివేస్తున్నట్లు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

6.భారత్ లో లాక్ డౌన్ పెట్టాల్సిందే : కొవిడ్ టాస్క్ ఫోర్స్

Telugu Ap Telangana, China, Corona India, Israelbans, Sonusood, Gold, Top-Latest

ఇండియాలో కరుణ చేయాలంటే లాక్ డౌన్ పెట్టాల్సిందే అని నేషనల్ కొవిడ్ 19 టాస్క్ఫోర్స్ లోని నిపుణులతో పాటు, ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు.

7.నాలుగో రోజుకు చేరుకున్న కే ఏ పాల్ దీక్ష

ఏపీ లో టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కె.ఎ.పాల్ చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది.

8.కరోనాతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మృతి

కరోనాతో మాజీ  ఎమ్మెల్సీ, టిడిపి  నాయకుడు బొడ్డు భాస్కరరామారావు విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

9.రానున్న రెండు రోజుల్లో కోస్తా రాయలసీమలో వర్షాలు

దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత పెరగడం , పలుచోట్ల ఉపరితల ఆవర్తనం ద్రోణులు ఏర్పడిన నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

10.ఒడిశా లో 15 రోజుల పాటు లాక్ డౌన్

కరోనా కట్టడికి ఒడిషా ప్రభుత్వం మే 5 నుంచి 15 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.

11.సోనుసూద్ ఆరోపణలపై చైనా స్పందన

Telugu Ap Telangana, China, Corona India, Israelbans, Sonusood, Gold, Top-Latest

భారత్ లో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు తాను వందలాది ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను భారత్ కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా, చైనా దానిని అడ్డుకుంటోందని సోనుసూద్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో భారత్ లోని చైనా రాయబారి సన్ విడాంగ్ స్పందించారు.ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయన సమాధానం ఇచ్చారు.

12.గాంధీ ఆసుపత్రికి 100 ఆక్సిజన్ సిలిండర్ లు

కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రికి 100 ఆక్సిజన్ సిలిండర్లు రానున్నాయి.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో  డిఆర్డీవో ఈ ఆక్సిజన్ సిలిండర్ లు సమకూర్చింది.

13.కోవిడ్ రోగుల కోసం వెయ్యి ఐరన్ మంచాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ను స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది.ఇక్కడ కోవిడ్ రోగులు తాకిడి పెరగడంతో దాదాపు వెయ్యి ఐరన్ మంచాలను స్టీల్ ప్లాంట్ సిబ్బంది తయారు చేశారు.

14.ప్రధాని అధ్యక్షతన కరోనా పై కీలక సమీక్ష

Telugu Ap Telangana, China, Corona India, Israelbans, Sonusood, Gold, Top-Latest

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ రోజు ఒక సమావేశం నిర్వహించనున్నారు.

15.భారత్ లో తగ్గిన కరోనా కేసులు

నిన్నటి తో పోలిస్తే భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,92,488 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

16.ఇజ్రాయిల్ సంచలన నిర్ణయం

Telugu Ap Telangana, China, Corona India, Israelbans, Sonusood, Gold, Top-Latest

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న  నేద్యంలో ఇజ్రాయిల్ సంచలన నిర్ణయం తీసుకుంది.భారత్ తో సహా ఏడు దేశాల రాకపోకల పై ఆంక్షలు విధించింది.

17.మూడు గెటప్స్ లో కళ్యాణ్ రామ్

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లో ఆయన మూడు పాత్రల్లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

18.బండి సంజయ్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

Telugu Ap Telangana, China, Corona India, Israelbans, Sonusood, Gold, Top-Latest

టిఆర్ఎస్ ప్రభుత్వం పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎక్కడ ఉన్నారు తాము ఎక్కడ ఉన్నామో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

19.బ్రిటన్ కు వెళ్లిపోయిన ‘ సీరం ‘ అధినేత

Coffee షీల్డ్ లేక ఉత్పత్తి సంస్థ సీరం  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అధర్ పునావాలా బ్రిటన్ కు వెళ్ళిపోయారు.భారత్ లో కొందరు కార్పొరేటర్లు, ముఖ్యమంత్రుల ఒత్తిళ్లను తట్టుకోలేక ఆయన లండన్ చేరుకున్నట్లు ది టైమ్స్ పత్రిక తెలిపింది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, China, Corona India, Israelbans, Sonusood, Gold, Top-Latest

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,160

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,160.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube