న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఓట్ల గల్లంతుపై విచారణ : చీఫ్ ఎలక్షన్ కమిషన్

ఓట్ల గల్లంతుపై విచారణ జరుపుతామని చీఫ్ ఎలక్షన్ కమిషన్ శశాంక్ గోయల్ తెలిపారు.

 Andhra And Telangana News, Breaking Headlines, Top20 News, Telangana Headlines,-TeluguStop.com

2.బిజెపి అవమానించింది :పవన్

Telugu Coco Cola, Corona, Myanmar, Telangana, Gold, Top-Latest News - Telugu

తెలంగాణ బిజెపి జనసేన అవమానించిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అందుకే తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న పి వి కుమార్తెకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

3.వీల్ చైర్ లో ప్రచారానికి మమత

నందిగ్రామ్ సంఘటన తరువాత మొదటిసారి ఎన్నికల ప్రచారానికి మమత రానున్నారు.ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీల్ చైర్ లోనే మమత ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

4.విజయవాడ కేశినేని శ్వేత విజయం

విజయవాడలో టిడీపి మేయర్ అభ్యర్ధిగా 11వ డివిజన్ నుంచి పోటీ చేసిన కేశినేని శ్వేత విజయం సాధించారు.

5.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 228 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 25,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

7.పోలీస్ స్టేషన్ ముందు భట్టి విక్రమార్క ఆందోళన

Telugu Coco Cola, Corona, Myanmar, Telangana, Gold, Top-Latest News - Telugu

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆందోళన చేపట్టారు.కాంగ్రెస్ కార్యకర్తల అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన ఈ ఆందోళన చేపట్టారు.

8.ఏప్రిల్ 1 న గో గర్జన

గో హత్యలు ఆపాలని, అక్రమ కబేళాలు మూసివేయాలని , గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ ఏప్రిల్ 1న యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో మహాగర్జన గో సమ్మెలను నిర్వహించనున్నట్లు తెలిసి ఫౌండేషన్ చైర్మన్ , టీటీడీ బోర్డు మెంబర్ కొలిశెట్టి శివ కుమార్ తెలిపారు.

9.అమర్నాథ్ యాత్ర తేదీ ఖరారు అమర్నాథ్ యాత్ర తేదీలు ఖరారయ్యాయి.ఈనెల 28 నుంచి 56 రోజుల పాటు ఈ యాత్రలు సాగుతాయి.

10.18 న మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక

తిరుపతి మేయర్, డిఫ్యూటీ ఎంపికకు సంబంధించి ఎన్నిక ఈ నెల 18 న జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ గిరిష వెల్లడించారు.

11.తమిళనాడులో కరోనా

తమిళనాడులో శనివారం 695 కరోనా కేసులు బయట పడ్డాయి.దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

12.సైనిక్ స్కూల్స్ 6,9 తరగతుల ప్రవేశ ఫలితాల విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ 6 , 9 తరగతుల ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.

13.పేపర్ బాటిళ్ల లో కోకో కోలా

ఈ వేసవి నుంచి కూల్ డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్ లో కాకుండా పేపర్ బాటిళ్లలో విక్రయించేందుకు కోకోకోలా సంస్థ సిద్ధమవుతోంది.

14.మయన్మార్ లో ఆగని విధ్వంసం

Telugu Coco Cola, Corona, Myanmar, Telangana, Gold, Top-Latest News - Telugu

మైన్మార్ లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది.తాజాగా సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు వ్యక్తులు మరణించారు.

15.ఆర్మీ నియామకాల కేసు సిబిఐకి

ఆర్మీ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు వెలుగుచూడటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు.ఆర్మీ ఎంపిక కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు తేలడం తో ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

16.కరోనా ఎఫెక్ట్ : అంగన్వాడీ కేంద్రాల మూసివేత

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.దీనిలో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలను మూసి వేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

17.మిథిలి రాజ్ కు మరో అరుదైన ఘనత

భారత్ మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనతను సాధించారు.ఇటీవల వన్డేల్లో ఏడు వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్ ఉమెన్ గా ఆమె నిలిచారు.

18.ఆశిష్ విద్యార్థికి కరోనా

Telugu Coco Cola, Corona, Myanmar, Telangana, Gold, Top-Latest News - Telugu

ప్రముఖ బహుభాషా నటుడు ఆశిష్ విద్యార్థి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

19.పరీక్షలు లేకుండా విద్యార్థులకు ప్రమోషన్

ఒడిశాలో ఒకటవ తరగతి నుంచి 8 వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులను ఈ ఏడాది కూడా పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.

20.ఈ రోజు బంగారం ధరలు

Telugu Coco Cola, Corona, Myanmar, Telangana, Gold, Top-Latest News - Telugu

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43, 870

24.క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,870

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube