న్యూస్ రౌండప్ టాప్ 20

1.జగన్ కు రఘురామ నాలుగో లేఖ

Telugu Ap Telangana, Black Fungus, Chandrababu, Corona India, Sonusood, Telangan

వరుసగా ఏపీ సీఎం జగన్ కు లేఖలు రాస్తున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు.ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల హామీని నెరవేర్చలేదని,  ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ఉంటుందని ఎన్నికల మేనిఫెస్టోలో వైసిపి హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 Ap And Telangana Breaking News, Telangana Headlines, News Roundup, Top20news, Te-TeluguStop.com

2.అర్చకుల మౌన దీక్ష

ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ దేవాలయం అర్చకుల మౌన దీక్ష మూడో రోజుకు చేరుకుంది.ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం మేనేజ్మెంట్ బోర్డు ను రద్దు చేయాలని వీరంతా ఈ నిరసనకు దిగారు.

3.భారత్ లో కరోనా

Telugu Ap Telangana, Black Fungus, Chandrababu, Corona India, Sonusood, Telangan

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 80,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

4.త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ

త్వరలోనే 20వేల పోలీసు ఉద్యోగాల భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మహమూద్ అలీ తెలిపారు.

5.హీరో విశాల్ ఆర్.బి.చౌదరి కి సమన్లు

Telugu Ap Telangana, Black Fungus, Chandrababu, Corona India, Sonusood, Telangan

నటుడు విశాల్, నిర్మాత ఆర్.బి.చౌదరి లకు పోలీసులు శనివారం సమన్లు జారీ చేశారు.

6.రేపు ఢిల్లీకి ఈటెల రాజేందర్

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ రేపు బిజెపి పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.ఈ మేరకు ఆయన రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.

7.పీకే మా వ్యూహకర్త కాదు

ప్రశాంత్ కిషోర్ నో ncp వ్యూహకర్తగా నియమించుకోలేదు అని ఆ పార్టీ నేత మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు.

8.28న పి వి విగ్రహావిష్కరణ

నెక్లెస్ రోడ్ లో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నెల 28న జయంతిని పురస్కరించుకుని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

9.ఆర్టీసీలో మళ్లీ జేఏసీ

కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల లో మళ్లీ కదలిక మొదలైంది.8 యూనియన్లు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడ్డాయి.

10.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శనివారం శ్రీవారిని 16,568 మంది భక్తులు దర్శించుకున్నారు.

11.గబ్బిలాల్లో కొత్తరకం కరోనా వైరస్ లు

గబ్బిలాల్లో కరోనా వైరస్ కు సంబంధించిన ఓ కొత్త బ్యాచ్ చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

12.చంద్రబాబు పై సోనూసూద్ కామెంట్స్

Telugu Ap Telangana, Black Fungus, Chandrababu, Corona India, Sonusood, Telangan

టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రశంసలు కురిపించారు.హైదరాబాద్ అభివృద్దిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

13.బ్రహ్మంగారి మఠం లో పీఠాధిపతుల బృందం పర్యటన

నేడు బ్రహ్మంగారి మఠం పీఠాధిపతులు బృందం పర్యటించనుంది.

14.ఏపీ లో కరోనా

గడిచిన 24 గంటల్లో ఏపీ లో కొత్తగా 6,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15.భద్రతా మండలికి ఐదు దేశాల ఏకగ్రీవ ఎన్నిక

ఐక్యరాజ్యసమితికి అతి శక్తివంతమైన భద్రతా మండలికి బ్రెజిల్ ,యూఏఈ , అల్బేనియా, ఘనా ఘభాన్ దేశాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.

16.సోనూసూద్ కు చంద్రబాబు రిక్వెస్ట్

కరోనా కష్టకాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కోవిడ్ బాధితులకు కలసి సహాయం చేద్దాం అని నటుడు సోను సూద్ ను చంద్రబాబు కోరారు.

17.బ్లాక్ ఫంగస్ మందుల పై జిఎస్టి ఎత్తివేత

Telugu Ap Telangana, Black Fungus, Chandrababu, Corona India, Sonusood, Telangan

బ్లాక్ ఫంగస్ నివారణ కు ఉపయోగించే ఔషధాల పై జిఎస్టి ఎత్తి వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

18.హజ్ యాత్ర : 60 వేల మందికి అవకాశం

2021 సంవత్సరానికి హజ్ యాత్రకు సంబంధించి కేవలం 60 వేల మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.విదేశీయులకు అనుమతి లేదని, కేవలం సౌదీ అరేబియా వాసులకు మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది.

19.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Black Fungus, Chandrababu, Corona India, Sonusood, Telangan

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,740

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,890.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube