న్యూస్ రౌండ్ టాప్ 20

1.ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు

Telugu Ap Telangana, Corona India, Telangana, Telugu, Todays Gold, Top-Latest Ne

రెండు తెలుగు రాష్ట్రాలు రాగల మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

 Ap And Telangana Breaking News, Telangana Headlines, News Roundup, Top20news, Te-TeluguStop.com

2.తెలంగాణలో నాలుగు లక్షల కొత్త రేషన్ కార్డులు

తెలంగాణ లో కొత్తగా నాలుగున్నర లక్షల మందికి రేషన్ కార్డులు అందనున్నాయి ఈ మేరకు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

3.ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు

Telugu Ap Telangana, Corona India, Telangana, Telugu, Todays Gold, Top-Latest Ne

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేసేందుకు నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.పరీక్షలు రద్దు ఫలితాలు విధానంపై ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

4.బీజేపీకి రాజీనామా చేయడం లేదు

బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి టిఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు.తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆమె ప్రకటించారు.

5.హుజురాబాద్ లో రెండో రోజు ఈటెల పర్యటన

Telugu Ap Telangana, Corona India, Telangana, Telugu, Todays Gold, Top-Latest Ne

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రెండోరోజు హుజూరాబాద్ నియోజకవర్గం లో పర్యటించనున్నారు.

6.నేడు యూనివర్సిటీల వీసీల తో గవర్నర్ భేటీ

యూనివర్సిటీల వీసీల తో తెలంగాణ గవర్నర్ తమిళ సై ఈ రోజు సమావేశం కానున్నారు.వీసీల తో గవర్నర్ తమిళ సై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

7.15 నుంచి విద్యార్థులకు బస్ పాస్ లు

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్టూడెంట్ బస్సులను జారీ చేసేందుకు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.జూన్ 10 నుంచి ఆన్లైన్ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, జూన్ 15 నుంచి విద్యార్థులకు బస్ పాసులు జారీ చేస్తామని గ్రేటర్ ఆర్టిసి ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

8.రేపటి నుంచి రోజంతా మెట్రో

డౌన్ గడువును పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మెట్రో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది.ఈ మేరకు ఈ నెల 10 నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రారంభం అయ్యే మెట్రో రైలు సేవలు సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా తిరగనున్నాయి.

9.భారత్ బయోటెక్ కు 110 కోట్లు

కెనడాలో కు కోవాగ్జీన్ హక్కులు పొందిన ఆక్యుజెన్ తొలి విడతలో భారత్ బయోటెక్ కు 1.5 కోట్ల డాలర్లు ( 110) కోట్లు చెల్లించింది.

10.భారత్ బయోటెక్ క్యాంపస్ కు సిఐఎస్ఎఫ్ కమెండోల భద్రత

Telugu Ap Telangana, Corona India, Telangana, Telugu, Todays Gold, Top-Latest Ne

కేంద్ర బలగాలు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ క్యాంపస్ కు సెక్యూరిటీ ఇవ్వనున్నాయి.సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోలు హైదరాబాద్ క్యాంపస్ ను పరిరక్షిస్తాయని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.

11.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

12.సంగమేశ్వర లిఫ్ట్ ప్రాజెక్టు సర్వేకు శ్రీకారం

సంగారెడ్డి జహీరాబాద్ ఆందోలు నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

13.ఏపీ సిఎస్ కు చంద్రబాబు లేఖ

Telugu Ap Telangana, Corona India, Telangana, Telugu, Todays Gold, Top-Latest Ne

విశాఖ లోని వివిధ మేధో మరియు శారీరక సామర్ధ్యం గల పిల్లల పాఠశాల హిడెన్ స్ప్రావుట్స్ ను కూల్చివేయడం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు.

14.గ్రూప్ 1 అభ్యర్థుల ఆరోగ్య పరీక్షకు మెడికల్ బోర్డు

గ్రూప్ ఫోన్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది.

15.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.మంగళవారం11302 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

16.ఏపీలో నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

ఏపీలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు.ఇప్పటికే ప్రభుత్వం తో జూనియర్ డాక్టర్లు రెండుసార్లు చర్చలు విఫలం అయ్యాయి.

17.రేపు తిరుమలకు సీజేఐ రాక

Telugu Ap Telangana, Corona India, Telangana, Telugu, Todays Gold, Top-Latest Ne

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ శ్రీవారి దర్శనం నిమిత్తం గురువారం తిరుమలకి రానున్నారు.

18.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.ఏనుగులకు కరోనా పరీక్షలు

తమిళనాడు లోని నీలగిరి జిల్లా మధు మలై  పులుల అభయారణ్యం సమీపంలోని తెప్ప కాడు శిబిరంలోని ఏనుగులకు కరోనా వైద్య పరీక్షలు మంగళవారం ఉదయం నుండి ప్రారంభమయ్యాయి.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Corona India, Telangana, Telugu, Todays Gold, Top-Latest Ne

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,690

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,690

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube