న్యూస్ రౌండప్ టాప్ 20 

1.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతుంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 14,229 మంది భక్తులు దర్శించుకున్నారు.

 Ap And Telangana Breaking News, Telangana Headlines, News Roundup, Top20news, Te-TeluguStop.com

2.లాసెట్ సెట్స్ షెడ్యూల్ విడుదల

ఏపీ లోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( సెట్స్ ) తేజలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

3.డీఎస్సీ-2008 క్వాలిఫై అభ్యర్థులకు కౌన్సిలింగ్

ఏపీలో గత 2008 లో నిర్వహించిన డీఎస్సీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

4.సర్వర్ సమస్యలకు చెక్

సబ్ రిజిస్టర్ కార్యాలయాలు తరచూ ఏర్పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది.ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ శాఖ సంబంధిత నిలిపివేసి డేటాబేస్ను మార్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

5.రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా తీరప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

6.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

7.ఐఏఎస్ శ్రీలక్ష్మి పై కఠిన చర్యలు వద్దు

ఓఎంసీ కేసులో దర్యాప్తు పూర్తయిందని రాతపూర్వకంగా సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేయాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అప్పటి వరకు ఈ కేసులో నిందితురాలైన ఏపీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పై కఠిన చర్యలు చేపట్టరాదని సీబీఐ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.

8.పీకే తో మమత భేటీ

Telugu Ap Telangana, Corona India, Mahesh Babu, Maniratnam, Sharmila, Telangana,

రాజకీయ విశ్లేషకుడ ప్రశాంత్ కిషోర్ తో మరోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదాపు మూడు గంటల పాటు అనేక రాజకీయ అంశాలపై వీరు ఇద్దరూ చర్చించుకున్నారు.

9.‘మందులోడా .ఓరి మాయలోడా ‘ పాట ఆవిష్కరించిన చిరు

సుధీర్ బాబు హీరోగా అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ శ్రీదేవి గోలి సోడా సెంటర్ ‘ సినిమా లోని ‘ మందులోడా … ఓరి మాయలోడా ‘ పాటను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

10.జగన్ షర్మిల మధ్య విద్వేషాలు లేవు

Telugu Ap Telangana, Corona India, Mahesh Babu, Maniratnam, Sharmila, Telangana,

ఏపీ సీఎం జగన్ ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య ఎటువంటి విద్వేషాలు,  మనస్పర్థలు లేవని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి క్లారిటీ ఇచ్చారు.

11.12 నుంచి శ్రీశైలం ఆర్జిత సేవలు పునః ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం నుండి యధావిధిగా ఆర్జిత సేవలను దేవస్థానం ప్రారంభించనుంది.

12.ఆర్థిక శాఖ బిల్లుల ఆడిట్ పై ఎంపీ రఘురామ లేఖ

Telugu Ap Telangana, Corona India, Mahesh Babu, Maniratnam, Sharmila, Telangana,

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు.ఆర్థికశాఖ బిల్లుల ఆడిట్ పై లేఖ రాశారు.

13.వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 3,977 పోస్టులను కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

14.భారత్ కు అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి

భారత్ కు అమెరికా రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్శెట్టి ని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ నామినేట్ చేశారు.

15.ధనుష్ దర్శకత్వంలో రజనీకాంత్

Telugu Ap Telangana, Corona India, Mahesh Babu, Maniratnam, Sharmila, Telangana,

ధనుష్ దర్శకత్వంలో రజనీకాంత్ తన మైల్ స్టోన్  మూవీ 170 చేయనున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

16.జిల్లాల పర్యటనకు బండి సంజయ్

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ పాద యాత్ర చేపట్టేందుకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

17.మహేష్ బాబుతో సినిమా .స్పందించిన మణిరత్నం

Telugu Ap Telangana, Corona India, Mahesh Babu, Maniratnam, Sharmila, Telangana,

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రిన్స్ మహేష్బాబు కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై మణిరత్నం స్పందించారు .మహేష్ కు తాను సినిమా కథ చెప్పడం నిజమేనని, కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

18.హైదరాబాద్ విశాఖ మార్గానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ విశాఖపట్నం మధ్య మరో రహదారి మార్గానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది.ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకూ నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

19.పారా కోర్సుల నోటిఫికేషన్ గడువు పెంపు

ఏపీలో పారామెడికల్ సీట్ల భర్తీకి బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు మరోసారి పొడిగించాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ ఆదేశించారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Corona India, Mahesh Babu, Maniratnam, Sharmila, Telangana,

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,800

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,900

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube