న్యూస్ రౌండప్ టాప్ - 20

1.ఏడో విడత హరితహారం ప్రారంభం

తెలంగాణలో ఏడో విడత హరితహారం ప్రారంభమైంది.పెద్ద అంబర్ పేట్ దగ్గర ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

 Ap And Telangana Breaking News, Telangana Headlines, News Roundup, Top20news, Te-TeluguStop.com

2.డీజీపీ పై ఎమ్మెల్యే ఆగ్రహం

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గోరక్షకులను అరెస్టు చేయాలంటే ముందు తనను అరెస్టు చేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.

3.జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ

Telugu Ap Telangana, Bandisrinivasa, Corona India, Mamata Banerjee, Cards Proces

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సిబిఐ కోర్టులో నేడు విచారణ జరిగింది.జగన్ దాఖలు చేసిన కౌంటర్ పై ఇప్పటికే రీజాయిండర్లను ఎంపీ రఘురామ కృష్ణం రాజు తరపు న్యాయవాదులు దాతలు చేశారు.

4.మమతా బెనర్జీకి 5వేల జరిమానా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి హైకోర్టు 5 వేల జరిమానా విధించింది.నారద కుంభకోణం కేసులో సరైన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమైనందున ఈ జరిమానా విధించింది.

5.పేద ఎస్టీ విద్యార్థులకు ఉచిత కోచింగ్

పోటీపరీక్షలకు వెళ్లే పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నామని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ వి సర్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

6.ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ ఎంసీఏ కళాశాలలు ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ – 21 అర్హత పరీక్ష దరఖాస్తుల గడువును పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు.

7.మోడల్ స్కూల్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువు జూలై 7వ తేదీ వరకు పొడిగించారు.

8.హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా అశోక్ గౌడ్

హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో పొన్నం అశోక్ గౌడ్ ఘన విజయం సాధించారు.

9.టీఎంయూ గౌరవ అధ్యక్షురాలిగా కవిత

టీఎంయూ గౌరవ అధ్యక్షురాలిగా కవితను నియమిస్తూ తీర్మానం చేసినట్లు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి తెలిపారు.

10.అంబేద్కర్ విదేశీ విద్యా నిధికి 31 వరకు అవకాశం

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని పేద ఎస్టి విద్యార్థుల నుంచి అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.జులై 31 వరకు విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా తెలిపారు.

11.కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం

Telugu Ap Telangana, Bandisrinivasa, Corona India, Mamata Banerjee, Cards Proces

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

12.వైయస్సార్ బీమా పథకం ప్రారంభం

వైయస్సార్ బీమా పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

13.వివేకా హత్య కేసు

వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ గత 25 రోజులుగా కొనసాగుతూనే ఉంది.కడప సెంట్రల్ జైలు కేంద్రంగా ఈ విచారణ కొనసాగుతోంది.

14.రంగులపై జగన్ కు రఘురామ లేఖ

Telugu Ap Telangana, Bandisrinivasa, Corona India, Mamata Banerjee, Cards Proces

ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం పై ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.

15.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.బుధవారం తిరుమల శ్రీవారిని 15,488 మంది భక్తులు దర్శించుకున్నారు.

16.పోలవరం నిర్వాసితులకు 550 కోట్లు

Telugu Ap Telangana, Bandisrinivasa, Corona India, Mamata Banerjee, Cards Proces

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 41.15 కాంటూరు పరిధిలో ప్రతి నిర్వాసిత కుటుంబానికి 10 లక్షల చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.సహాయ పునరావాస కమిషనర్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు 550 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

17.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 48,786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.అంతర్జాతీయ విమానాల రద్దు మళ్లీ పొడిగింపు

కువైట్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును మరోసారి పొడగించారు.తాజాగా జులై 31 వరకు అంతర్జాతీయ ప్రయాణీకుల విమాన పొడగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.

19.ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు

ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Bandisrinivasa, Corona India, Mamata Banerjee, Cards Proces

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,000

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube