న్యూస్ రౌండప్ టాప్ 20

1.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,35, 532 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.రాయలసీమ ప్రజలకు వీర్రాజు క్షమాపణలు

కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన అనుచిత కామెంట్స్ వైరల్ అయిన నేపథ్యంలో రాయలసీమ ప్రజలకు వీర్రాజు క్షమాపణలు చెప్పారు.

3.తెలంగాణలో స్కూళ్లు రీ ఓపెన్

తెలంగాణ లో సోమవారం నుంచి స్కూళ్లు మళ్లీ తెరుచుకాబోతున్నాయి.

4.ఉద్యోగుల సమ్మె పై హైకోర్టులో పిల్

ఏపీలో ఉదోగులు చేపట్టనున్న సమ్మె రాజ్యాంగ విరుద్ధం అంటూ విశాఖకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.

5.గొల్లపూడి మారుతీరావు సతీమణి మృతి

దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివ కామసుందరి (81) మృతి చెందారు.

6.మేడారం జాతర పై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష

మేడారం జాతర పై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష చేపట్టింది.ఈ మేరకు మంత్రుల కమిటీ మేడారం సందరించారు.

7.శ్రీవారి సేవలో హీరో గోపీచంద్

తిరుమల శ్రీవారిని సినీ నటుడు గోపీచంద్ కుటుంబం  సమేతంగా దర్శించుకున్నారు.

8.తెలంగాణ లో ఫిబ్రవరి 1 నుంచి భూ విలువ పెంపు

తెలంగాణ లో ఫిబ్రవరి 1 నుంచి భూ విలువను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయనుంది.

9.టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి

హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటిని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు.

10.వైద్య ఆరోగ్య శాఖ పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి : హరీష్

వైద్య ఆరోగ్య శాఖ పై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

11.తిరుమల సమాచారం

తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 24,888 మంది భక్తులు దర్శించుకున్నారు.

12.ఆర్.ఆర్.బీ ఫలితాల పై ఫిర్యాదు కు వెబ్ సైట్

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాల వెల్లడించిన నేపథ్యంలో దీనిపై ఏమైనా సందేహాలు ఉంటే ఫిర్యాదు కు ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించారు.https ://iroams.com, /outreach వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.

13.పీహెచ్ డీ ధీసిస్ సమర్పణ కు గడువు మార్చి 31

పీహెచ్ డీ ధీసిస్ సమర్పణకు గడువు ను మార్చి 31 వరకు  విధించినట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.

14.నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవంత్ పర్యటన

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు.

 15.మంత్రి కొడాలి నాని కామెంట్స్

క్యాసినో వ్యవహారం పై ఏపీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేశారు.ఇప్పటికే ఈ వ్యవహారంపై అందరికీ ఫిర్యాదు చేశారని, ఇక అమెరికా అధ్యక్షుడికి కూడా ఫిర్యాదు చేస్తారేమో అని ఎద్దేవా చేశారు.

16.హిందూపురంను జిల్లా చేయాలి

హిందూపురం ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ భారీ ఎత్తున జనం రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

17.పావురాళ్ల రేసింగ్ పై ఆందోళన

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి వద్ద పావురాల రేసింగ్ జరిగింది.వందలాదిగా పావురాలు గ్రామంలో చెక్కర్లు కొట్టడం తో స్థానికులు ఆందోళన చెందారు.

18.వైద్య ఆరోగ్య సిబ్బంది నిరసన ర్యాలీ

కొత్త పీఆర్ సీ కి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది  విశాఖలో ర్యాలీ నిర్వహించారు.

19.గుజరాత్ లో కర్ఫ్యూ పొడిగింపు

గుజరాత్ లో నైట్ కర్ఫ్యూ ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,000

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49000

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube