న్యూస్ రౌండప్ టాప్ - 20

1.మే 1 నుంచి ఇంటర్ పరీక్షలు

తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మే ఒకటో తేదీ నుంచి, ద్వితీయ  సంవత్సరం పరీక్షలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి.

 News Roundup Top20, Top 20 News, News Highlights, Ap And Telangana Breaking News-TeluguStop.com

2.ఫిబ్రవరి 1 నుంచి మెడికల్ కాలేజీలు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో ప్రభుత్వ , ప్రైవేటు వైద్య కళాశాలలను తిరిగి ప్రారంభిస్తున్నామని కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తెలిపింది.

3.తెలంగాణలో కరోనా

Telugu Ap Telangana, Highlights, Top, Rayalseema, Revanth Reddy, Gold India, Ysj

తెలంగాణ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

4.పిఆర్సి పై ఉద్యోగ సంఘాలతో చర్చలు

పిఆర్సి పై ఉద్యోగ సంఘాలతో మూడోరోజు తెలంగాణ సీఎస్ నేడు చర్చలు జరపనున్నారు.

5.మళ్లీ వచ్చిన పులి

మహారాష్ట్ర కు వెళ్ళి పోయింది అనుకుంటున్న ఏ 2 పులి తిరిగి మళ్ళీ వచ్చింది.కొమరం భీం జిల్లా పెంచికల్ పేట మండలం కమ్మర్ గాం అటవీ ప్రాంతంలో ఏ 2 పులి సంచారం కలకలం రేపుతోంది.

6.సినీనటి ఆమని కి అస్వస్థత

Telugu Ap Telangana, Highlights, Top, Rayalseema, Revanth Reddy, Gold India, Ysj

సీనియర్ సినీ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆమని అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు.

7.గ్రేటర్ కు మాత్రమే నీళ్లు ఉచితం

 తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసించే కుటుంబాలకు వర్తించనుంది.

8.రాయలసీమలో నిమ్మగడ్డ పర్యటన

Telugu Ap Telangana, Highlights, Top, Rayalseema, Revanth Reddy, Gold India, Ysj

నేటి నుంచి రెండు రోజుల పాటు రాయలసీమలోని మూడు జిల్లాల్లో ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటించనున్నారు.

9.ఏపీలో కరోనా

గడిచిన 24 గంటలు ఏపీ వ్యాప్తంగా 117 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

10.అన్నా హజారే నిరాహార దీక్ష

Telugu Ap Telangana, Highlights, Top, Rayalseema, Revanth Reddy, Gold India, Ysj

రైతు డిమాండ్లపై తాను చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడం లేదంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రం వైఖరికి నిరసనగా రేపటి నుంచి  నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

11.ఎంపీల్లో ఒక్కరికీ కరోనా లేదు

శుక్రవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఎంపీల్లో ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని తాజాగా జరిగిన పరీక్షల్లో తేలింది.

12.బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

తెలంగాణలో బిజెపి నేడు రాష్ట్రవ్యాప్త నిరసన కు పిలుపునిచ్చింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలవాలని నిర్ణయించింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ పీఆర్సీని అమలు చేయాలని కోరుతూ ఈ ఆందోళనలు చేపట్టనుంది.

13.భారత్ లో కరోనా

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 18,855 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్ విడుదల

Telugu Ap Telangana, Highlights, Top, Rayalseema, Revanth Reddy, Gold India, Ysj

మంచు మోహన్ బాబు నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

15.ఎమ్మెల్యే రోజా ను కలిసిన నటుడు అర్జున్

Telugu Ap Telangana, Highlights, Top, Rayalseema, Revanth Reddy, Gold India, Ysj

 సినీ నటుడు అర్జున్ కుటుంబసమేతంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆమె నివాసంలో కలిశారు.

16.తొలి దశ ఎన్నికలకు నామినేషన్ లు ప్రారంభం

ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది మూడు రోజులపాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.

17.అమెజాన్ పై ఆరోపణలు… ఈడి దర్యాప్తు

ఈ కామస్ దిగ్గజం అమెజాన్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దర్యాప్తు ప్రారంభించింది.విదేశీ మారక చట్టం, దేశ నియమాలను ఉల్లంఘించిన ఆరోపణలపై ఈడి రంగంలోకి దిగింది.

18.కుల ధ్రువీకరణ పత్రాలపై జగన్ ఫోటో వద్దు

Telugu Ap Telangana, Highlights, Top, Rayalseema, Revanth Reddy, Gold India, Ysj

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ వో సీల జారీ అంశంపై సీయెస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.ధ్రువీకరణ పత్రాలు సీఎం జగన్ ఫోటో తొలగించాలని , ఈ మేరకు తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.

19.రేవంత్  పిటిషన్ డిస్మిస్

Telugu Ap Telangana, Highlights, Top, Rayalseema, Revanth Reddy, Gold India, Ysj

నోటు కేసు ఏసిపి పరిధిలోకి రాదు అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను  ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,790

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,790

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube