న్యూస్ రౌండప్ టాప్ 20

1.నేడు హెచ్ ఆర్ ఏ పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

నేడు ఉద్యోగుల హెచ్ ఆర్ ఏ పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వబోతోంది.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.కోవిడ్ పై నేడు ప్రధాని సమీక్ష

నేడు

కోవిడ్

పరిస్థితులు వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించనున్నారు.ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

3.నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది .ఈ నేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు అభర్థులను కమిటీ ఖరారు చేయబోతోంది.

4.చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడి.ఉద్యోగి మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి లో ట్రాకర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న చిన్నబ్బ అనే ఉద్యోగిని ఏనుగులు దాడి చేసి చంపాయి.

5.ఏపీలో కరోనా

ఏపీలో కరోనా కేసులు తీవ్రమయ్యాయి.గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 3,205 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.తిరుమల సమాచారం

తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 25, 542 మంది భక్తులు దర్శించుకున్నారు.

7.ఢిల్లీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 27,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

9.ఇస్రో చైర్మన్ గా సోమనాథ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) చైర్మన్ గా సీనియర్ శాస్త్రవేత్త , రాకెట్ ఇంజనీరింగ్ నిపుణుడు ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు.

10.జగన్ తో భేటీ అయిన చిరంజీవి

ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి ఈరోజు భేటీ అయ్యారు.సినిమా టికెట్ల వివాదం పై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

11.మండలి ప్రొటెం చైర్మన్ గా జాఫ్రీ

తెలంగాణ శాసనమండలి ప్రోటెం చైర్మన్ గా ఎం ఐ ఎం ఎమ్మెల్సి జాఫ్రీ ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

12.కేసిఆర్ పై షర్మిల విమర్శలు

ఉచిత ఎరువులు ఇస్తానన్న నీ మాట ఉత్తీదయిపోయింది అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్సార్ టిపీ అధినేత్రి షర్మిల విమర్శించారు.

13.ఎమ్మెల్యే వనమా దిష్టిబొమ్మ దహనం

పాత పాల్వంచ రామకృష్ణ ఆత్మహత్య కేసులో వనమా రాఘవ పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దిష్టి బొమ్మ ను  దహనం చేశారు.

14.భారత్ లో ఒమి క్రాన్

భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488 కి చేరింది.

15.కేసిఆర్ పై బండి సంజయ్ లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.ఈ సందర్భంగా అనేక ప్రజా సమస్యలను ఆ లేఖలో పేర్కొన్నారు.

16.హీరో సిద్ధార్థ పై కేసు నమోదు

బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ను ఉద్దేశిస్తూ హీరో సిద్ధార్థ చేసిన కామెంట్స్ పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

17.హక్కుల కోసం న్యాయ పోరాటం చేయాలి

హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోరాటం చేయాలని సీపీఎం పోరాటం చేయాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు సూచించారు.

18.కర్ణాటక కాంగ్రెస్ పాదయాత్ర నిలిపివేత

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపుతో కర్ణాటక కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర నిలిచిపోయింది.

19.పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం

పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం పలుకుతూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,100

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,100

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube