న్యూస్ రౌండప్ ... టాప్20

1.నిర్మల్ జిల్లాలో వింత వ్యాధితో కోళ్లు మృతి


బాసర మండలంలోని కిర్గుల్ గ్రామంలో వింత వ్యాధితో కోళ్లు మృతి పెద్ద ఎత్తున చనిపోతున్నాయి.బర్డ్ ఫ్లూ కారణం అయి ఉండొచ్చు అనే అనుమానం లో గ్రామస్థులు ఉన్నారు.

 Snake Hustle At East Godavari District Collector's Office,   Vaccine For Free, W-TeluguStop.com

2.కలెక్టర్ ఆఫీస్ వద్ద పాము కలకలం


Telugu Apngos, Chinesejawan, Gold, Manchu Manoj, Snakehustle, Vaccine, Bengalmam

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాము హల్చల్ చేసింది.దీంతో పాములు పట్టుకునే వారికి సిబ్బంది సమాచారం ఇచ్చారు.సుమారు ఆరు అడుగుల పాము ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

3.ట్విట్టర్ లో మోదీ టాప్


ట్విట్టర్ లో ప్రధాని నరేంద్ర మోది టాప్ అని తేలింది.ప్రస్తుతానికి ట్విట్టర్ లో మోదీని  64.7 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.

4.అందరికీ ఉచితంగా వ్యాక్సిన్


Telugu Apngos, Chinesejawan, Gold, Manchu Manoj, Snakehustle, Vaccine, Bengalmam

కరోనా వ్యాక్సిన్ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం కీలక  ప్రకటన చేశారు.రాష్ట్రంలోని ప్రజలు అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు.

5.మోదీ వీడియో కాన్ఫరెన్స్


ఈ నెల 16 నుంచి కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించబోతున్నారు.

6.రజనీ అభిమానుల ఆందోళన


Telugu Apngos, Chinesejawan, Gold, Manchu Manoj, Snakehustle, Vaccine, Bengalmam

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షను ఆయన అభిమానులు విడిచి పెట్టడం లేదు.పార్టీ పెట్టాల్సిందే అంటూ చెన్నైలో ఫ్యాన్స్ క్లబ్ కు చెందిన వేలాది మంది నిరసన ప్రదర్శన కు దిగారు.

7.ఇంగ్లాండ్ మహారాణి రాజుకు కరోనా టీకా


బ్రిటన్ రాణి ఎలిజబెత్ , రాజు ఫిలిప్ కు కరోనా టీకా వేసినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది.

8.ఎన్నికలను బహిష్కరిస్తాం ఏపీ ఎన్జీవో సంఘం


Telugu Apngos, Chinesejawan, Gold, Manchu Manoj, Snakehustle, Vaccine, Bengalmam

స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని రెండు నెలలుగా ఎన్నికల కమిషన్ ను కోరుతున్నా పట్టించుకోవడంలేదని, ప్రస్తుత పరిస్థితుల లో ఎన్నికల్లో ఉద్యోగులు పాల్గొనడం సాధ్యం కాదని , తాము బహిష్కరిస్తామని ఏపీ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.

9.అన్నవరం ఆలయ సిబ్బందికి జరిమానా


తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానం లో 60 మంది ఉద్యోగులకు ఆలయ ఈవో త్రినాథ్ ఒక్కొక్కరికి ఐదు వందలు చొప్పున జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు.హుండీ లెక్కింపునకు ఉద్యోగులంతా హాజరు కావాలని ఆయన ఆదేశించారు.కానీ సిబ్బంది హాజరు కాకపోవడంతో ఈ జరిమానా విధించారు.

10.తొలి వాక్సిన్ నేనే వేయించుకుంటా


Telugu Apngos, Chinesejawan, Gold, Manchu Manoj, Snakehustle, Vaccine, Bengalmam

తెలంగాణాలో తొలి కరోనా టీకా నేనే వేయించుకుంటాను అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ప్రకటించారు.

11 .ప్రధాని కి రఘురామకృష్ణం రాజు లేఖ


దేశంలో కరోనా వాక్సిన్ పంపిణి ప్రక్రియ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు లేక రాసారు.ఇది చాలా సంతోషించదగిన విషయం అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

12 .కేటీఆర్ ను కల్సిన మంచు మనోజ్


Telugu Apngos, Chinesejawan, Gold, Manchu Manoj, Snakehustle, Vaccine, Bengalmam

తెలంగాణ మంత్రి కేటీఆర్ ను యంగ్ హీరో మంచు మనోజ్ కలిశారు.ఈ సందర్భంగా త్వరలోనే తాను ప్రారంభించబోయే ఓ ప్రాజెక్ట్ ను గురించి కేటీఆర్ కు చెప్పగా ఆయన అభినందించారు.

13 .బ్రిటన్ లో కఠిన లాక్ డౌన్


కొత్త కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ లో కఠిన లాక్ డౌన్ నిబంధనలు విధించారు.గత కొద్ది రోజుల నుంచి మరిన్ని కఠిన లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

14 .భారత్ సరిహద్దుల్లోకి చైనా జవాన్


Telugu Apngos, Chinesejawan, Gold, Manchu Manoj, Snakehustle, Vaccine, Bengalmam

తూర్పు లడక్ లోని పాంగాంగ్‌ సో వద్ద చైనా సైనికుడు వాస్తవాధీన రేఖ ను అతిక్రమించి భారత భూ భాగంలోకి ప్రవేశించడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

15 .పాకిస్థాన్ లో అంధకారం


పాకిస్థాన్ అంధకారంలో చిక్కుకుంది.పవర్ గ్రిడ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దేశం మొత్తం చిమ్మ చీకటి నెలకొంది.శనివారం రాత్రి 11 .41 నిముషాలకు దక్షిణ పాకిస్థాన్ లోని గ్రిడ్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణం గా ఈ పరిస్థితి నెలకొన్నట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది.

16 .18 లక్షల సిగరెట్ల ప్యాకెట్ల స్వాధీనం


Telugu Apngos, Chinesejawan, Gold, Manchu Manoj, Snakehustle, Vaccine, Bengalmam

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ ముంబై జోనల్ యూనిట్ ముంబైలో ఓ సిగరెట్ల స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేసింది.డీఆర్ ఐ అధికారులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి వచ్చిన కంటైనర్ లో అక్రమంగా దిగుమతి అయిన 18 లక్షల గుడాంగ్ గరం సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

17 .శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహిళా అదృశ్యం


హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఏపీ లోని ప్రకాశం జిల్లా కు చెందిన శోభారాణి అనే మహిళా అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.

18 .తెలంగాణాలో కరోనా


Telugu Apngos, Chinesejawan, Gold, Manchu Manoj, Snakehustle, Vaccine, Bengalmam

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 351 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19 .భారత్ లో కరోనా


దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 18 ,645 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

20 .ఈ రోజు బంగారం ధరలు


Telugu Apngos, Chinesejawan, Gold, Manchu Manoj, Snakehustle, Vaccine, Bengalmam

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,470

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,470.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube