న్యూస్ రౌండప్ టాప్ 20

1 జగన్ కు ఈడీ సమన్లు

ఏపీ సీఎం జగన్ కు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

 Ap And Telangana Breaking News, Headlines, Today Top News, Telangana Breaking Ne-TeluguStop.com

2.కొనసాగుతున్న కిడ్నాప్ కేసు దర్యాప్తు

తెలంగాణ లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ వ్యవహారం పై దర్యాప్తు కొనసాగుతోంది.కెసిఆర్ బంధువుల కిడ్నాప్ వ్యవహారంలో ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ ను అరెస్ట్ చేయగా, ఆమె భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

3.గిరిజన యువతకు పోటీపరీక్షల ఉచిత శిక్షణ

తెలంగాణలో త్వరలో ఉద్యోగ ప్రకటనలు విడుదల కాబోతున్న నేపథ్యంలో, పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న గిరిజన యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

4.గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న కరాటే కళ్యాణి

Telugu Ap Telangana, Ayodhya, Cm Kcr Sheep, Jansenapawan, Karate Kalyani, Telang

గోవుల అక్రమ రవాణాను సినీనటి కరాటే కళ్యాణి అడ్డుకున్నారు.యాదాద్రి జిల్లా లోని బీబీనగర్ లో రెండు బొలెరో వాహనాల్లో తరలిస్తున్న 25 ఆవుల రవాణా ను కరాటే కళ్యాణి అడ్డుకున్నారు.ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు గోవధ నిషేధ చట్టం కింద నమోదు చేశారు.

5.వరంగల్ లో తరుణ్ చుగ్  బండి సంజయ్ పర్యటన

బిజెపి తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్,  అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

6.నిర్మల్ లో పెద్ద పులి సంచారం

నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్చందా మండలం బోరిగం  సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.

7.11, 12న హైకోర్టు కు సంక్రాంతి సెలవులు

తెలంగాణ హైకోర్టు కు జనవరి 11, 12 తేదీల్లో సంక్రాంతి సెలవులు ప్రకటించారు.

8.పోస్టల్ కార్యాలయాల్లో ఆధార్ సేవలు

Telugu Ap Telangana, Ayodhya, Cm Kcr Sheep, Jansenapawan, Karate Kalyani, Telang

పోస్టల్ కార్యాలయాల్లో ఆధార్ సేవలు మళ్లీ ప్రారంభించినట్లు హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం తెలిపింది.

9.ముక్కు టీకా ట్రైల్స్ కు భారత్ బయోటెక్ ధరఖాస్తు

ముక్కు ద్వారా అందించే కరోనా వ్యాక్సిన్‘  బిబివి 154 ‘ టీకా మొదటి దశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కు దరఖాస్తు సమర్పించినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. 

10.గొర్రెల పంపిణీ కి సీఎం కేసీఆర్ ఆదేశం

 

Telugu Ap Telangana, Ayodhya, Cm Kcr Sheep, Jansenapawan, Karate Kalyani, Telang

తెలంగాణ వ్యాప్తంగా గొర్రెల పంపిణీ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.కరోనా కారణం గా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. 

11.తెలంగాణలో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

12.లండన్ లో ప్రతి 30 మందిలో ఒకరికి కరోనా

  లండన్ లో ప్రతి 30 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు అక్కడి ప్రభుత్వ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 

13.గుజరాత్ మాజీ సీఎం కన్నుమూత 

   కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాధవ్ సోలంకి కన్నుమూశారు.

14.జనసేనాని దివిస్ పర్యటన

Telugu Ap Telangana, Ayodhya, Cm Kcr Sheep, Jansenapawan, Karate Kalyani, Telang

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం లో నేడు పర్యటించ బోతున్నారు.

15.బైడన్ ప్రమాణ స్వీకారానికి పిలిచినా వెళ్లను : ట్రంప్

Telugu Ap Telangana, Ayodhya, Cm Kcr Sheep, Jansenapawan, Karate Kalyani, Telang

అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి తనను పిలిచినా వెళ్ళను అని ట్విట్టర్ ద్వారా ట్రంప్ తెలియజేశారు .

16.మెదక్ జిల్లాలో ఐదు నెమళ్లు మృతి

  తెలంగాణలో బర్డ్ ఫ్లూ భయం పెరిగిపోతోంది.ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నాటు కోళ్లు పెద్ద ఎత్తున మృతి చెందగా, మెదక్ జిల్లాలో ఒకేసారి ఐదు నెమళ్లు మరణించడం కలకలం రేపుతోంది. 

17.క్రాక్ మార్నింగ్ షో రద్దు

   

Telugu Ap Telangana, Ayodhya, Cm Kcr Sheep, Jansenapawan, Karate Kalyani, Telang

టాలీవుడ్ హీరో రవితేజ శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ‘ క్రాక్ ‘ సినిమా ఎర్లీ మార్నింగ్ షోలతో పాటు మార్నింగ్ షో లు కూడా క్యాన్సిల్ అయ్యాయి.ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. 

18.ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సౌదీ రాజు 

  సౌదీ రాజు సల్మాన్ (85) కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు. 

19.మరోసారి తెరపైకి అయోధ్య కేసు

   

Telugu Ap Telangana, Ayodhya, Cm Kcr Sheep, Jansenapawan, Karate Kalyani, Telang

దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది.మసీదు కూల్చివేత స్థలంలో నూతన మందిరం రూపుదిద్దుకుంటున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు లో దాఖలైన పిటిషన్ బిజెపి సీనియర్ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Ayodhya, Cm Kcr Sheep, Jansenapawan, Karate Kalyani, Telang

22.క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,830

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర –  50,830

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube