న్యూస్ రౌండప్ టాప్ 20

1.భద్రాచలం జైలుకి వనమా రాఘవ

Telugu Ap Tickets, Assam, Chandrababu, Cm Jagan, Cm Kcr, Corona, Mla Jagga Reddy

ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ కు 14 రోజుల రిమాండ్ విధించారు.మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వనమా రాఘవ ను భద్రాచలం సబ్ జైలుకి తరలించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.హైదరాబాద్ కు కేరళ సీఎం

సిపిఎం సెంట్రల్ కమిటీ సమావేశాలు కొనసాగుతున్న ఈ ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ సీపీఎం అపాయింట్ మెంట్ కోరారు.

3.అస్సాంలో  కోవిడ్ ఆంక్షలు తీవ్రతరం

Telugu Ap Tickets, Assam, Chandrababu, Cm Jagan, Cm Kcr, Corona, Mla Jagga Reddy

రోజు రోజు కి పెరుగుతున్న కరోనా కేసుల  ప్రభావంతో ప్రభుత్వ స్కూల్స్ మూసి వేయాలని నిర్ణయించింది.జనవరి 30 వరకు స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ అంశాలను తీవ్రతరం చేశారు.

4.ఈ రోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

ఈ రోజు యూపీ పంజాబ్ గోవా మణిపూర్ ఉత్తరాఖండ్ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది.

5.కాంగ్రెస్ శిక్షణ శిబిరాలు వాయిదా

కాంగ్రెస్ శిక్షణ శిబిరాలు వాయిదా పడ్డాయి.కోవిడ్ వైరస్ ప్రభావం కారణంగానే వీటిని వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

6.త్వరలో 27 బస్తీ దావఖానాలు

హైదరాబాద్ మహా నగరంలో త్వరలోనే 27 బస్తీ దావఖానాలు ఏర్పాటు కాబోతున్నాయి.జీహెచ్ ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ వీటిని సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేస్తున్నాయి.

7.జగ్గారెడ్డి దీక్షకు అనుమతి నిరాకరణ

Telugu Ap Tickets, Assam, Chandrababu, Cm Jagan, Cm Kcr, Corona, Mla Jagga Reddy

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు తెలంగాణలో చేపట్టదలచిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

8.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 29,652 మంది భక్తులు దర్శించుకున్నారు.

9.సంక్రాంతికి స్పెషల్ బస్సులు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు.

10.సభలు సమావేశాల పై నిషేధం విధించాలి.

పార్టీలు, మతం కులం తో సంబంధం లేకుండా అన్ని సభలు, సమావేశాలు పై నిషేధం విధించాలని , కోవిడ్ టెస్ట్ లు భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

11.వరంగల్ లో ఇంటి వద్దకే డీజిల్

Telugu Ap Tickets, Assam, Chandrababu, Cm Jagan, Cm Kcr, Corona, Mla Jagga Reddy

డీజిల్ డోర్ డెలివరీ సదుపాయం వరంగల్ లో ప్రారంభమైంది.భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తో కలిసి రామ్ మూవింగ్ టెక్నాలజీస్ ఈ సదుపాయంను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

12.29 వరకు ‘ పది ‘ పరీక్షల ఫీజుల స్వీకరణ

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రకటించారు.ఈ నెల 29 వరకు పరీక్షల ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

13.నేటి నుంచి ఎడ్ సెట్ తుది దశ కౌన్సిలింగ్

నేటి నుంచి ఎడ్ సెట్ తుది దశ కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించాలని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్ బాబు నిర్ణయించారు.

14.డీజీపీ కి చంద్రబాబు లేఖ

ఏపీ బీజేపీ చీఫ్ గౌతం  సవాంగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.టీడీపీ నేత పులి మారియ దాస్ అలియాస్ చిన్నా కు వైసీపీ గూండాల నుంచి రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.

15.చిత్తూరు జిల్లాలో మూడో రోజు చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడో రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

16.జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం వాయిదా

రేపు జరగాల్సిన జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం వాయిదా పడింది.

17.పార్టీ నాయకులకు చంద్రబాబు వార్నింగ్

Telugu Ap Tickets, Assam, Chandrababu, Cm Jagan, Cm Kcr, Corona, Mla Jagga Reddy

చిత్తూరు జిల్లా టీడీపీ  నాయకులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.‘ మిమ్మల్ని నమ్ముకుని నా పరువు పోగొట్టుకున్నా, నేను వచ్చినప్పుడు నాయకులు షో చేస్తున్నారే తప్పా ప్రజల్లో ఉండడం లేదటూ’ బాబు మండిపడ్డారు.

18.10న ఆర్జీవి తో మంత్రి పేర్ని నాని చర్చలు

Telugu Ap Tickets, Assam, Chandrababu, Cm Jagan, Cm Kcr, Corona, Mla Jagga Reddy

సినిమా టిక్కెట్ల రేట్ల వ్యవహారంపై చర్చించేందుకు ఈ నెల 10 న మంత్రి పేర్ని నాని తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ కానున్నారు.

19.హెల్త్ కార్డుల పై సీఎస్ అధ్యక్షతన కమిటీ

హెల్త్ కార్డుల జారీ పై సీఎస్ అధ్యక్షతన ఓ కమిటీని నియమించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Tickets, Assam, Chandrababu, Cm Jagan, Cm Kcr, Corona, Mla Jagga Reddy

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,500

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,500

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube