న్యూస్ రౌండప్ .... టాప్20

1.ఏనుగుల దాడిలో వ్యక్తికి గాయాలు


 Akhil Priya Bharta On The Run,  African Gang Arrested By Rachakonda Police    Fe-TeluguStop.com

చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం బండ్ల దొడ్డి అటవీ ప్రాంతంలో ఏనుగులు ఆచారి అనే వ్యక్తి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

2.పరారీలో ని అఖిల ప్రియ భర్త


Telugu Africangang, Akhilpriya, Amravati Day, Leopard Kurnool, Mla Rajasinghe, B

తెలంగాణ లో కలకలం రేపిన కెసిఆర్ బంధువుల కిడ్నాప్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు బెంగళూరులో ఇంకా గాలిస్తూనే ఉన్నారు.

3.తెలంగాణలో నేడు వ్యాక్సిన్ డ్రై రన్


కోవిడ్  వక్సి  ముందస్తు సన్నాహాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా  1200 వైద్య కేంద్రాల్లో డ్రై రన్ నేడు ప్రారంభం అవుతుంది.

4.హైదరాబాద్ లో ఆఫ్రికన్ ముఠా అరెస్ట్


Telugu Africangang, Akhilpriya, Amravati Day, Leopard Kurnool, Mla Rajasinghe, B

ఆన్లైన్ పరిచయాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆఫ్రికన్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

5.మంత్రులు కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం


ఈనెల 11వ తేదీ ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించబోతున్నారు.

6.పండుగ ప్రత్యేక రైళ్లు .బెర్త్ కన్ఫామ్ కాకపోతే నో ఎంట్రీ


Telugu Africangang, Akhilpriya, Amravati Day, Leopard Kurnool, Mla Rajasinghe, B

సంక్రాంతి ని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.ఈ ప్రత్యేక రైళ్లు రిజర్వేషన్ తో  కూడినవి కావడంతో ప్రయాణికులను రైల్వే స్టేషన్లోకి అనుమతించడం లేదని రైల్వే అధికారులు తెలిపారు.

7.రేపు తూర్పుగోదావరిలో పవన్ పర్యటన


రేపు తూర్పు గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు.తొండంగి మండలంలో దివిస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులు, దళితులు, ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలిచేందుకు పవన్ పర్యటిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.

8.388 వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం


Telugu Africangang, Akhilpriya, Amravati Day, Leopard Kurnool, Mla Rajasinghe, B

ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి డిమాండ్ చేస్తూ రైతులు మహిళా రైతులు, రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు శుక్రవారం నాటికి 388 వ రోజుకు చేరుకున్నాయి.

9.పలాస లో టిడిపి నిరసన దీక్ష


స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న పై  అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు కు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో టిడిపి నిరసన దీక్ష మొదలు పెట్టింది.ఈ దీక్షలో టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

10.కర్నూలు జిల్లాలో చిరుత కలకలం


Telugu Africangang, Akhilpriya, Amravati Day, Leopard Kurnool, Mla Rajasinghe, B

కర్నూలు జిల్లా డోన్ మండలం మల్లంపల్లి కొండల చిరుత సంచారం కలకలం రేపుతోంది.ఓ దూడపై దాడిచేసి గాయపరిచడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.

11.ఏడు భాషల్లో రామ్ కొత్త సినిమా


టాలీవుడ్ యంగ్ హీరో రామ్ హీరోగా నటించిన  ‘ రెడ్ ‘ ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు ఈ చిత్రాన్ని నిర్మించిన స్రవంతి రవికిషోర్ తెలిపారు.

12.సీఎం హత్యకు బెదిరింపు లేఖ


Telugu Africangang, Akhilpriya, Amravati Day, Leopard Kurnool, Mla Rajasinghe, B

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు హత్య బెదిరింపు లేఖ సీఎం కు చేరింది.ఈ లేఖలో నవీన్ పట్నాయక్ హత్యకు వ్యూహరచన పూర్తయినట్లు పేర్కొన్నారు.దీనిపై పై హోంశాఖ అప్రమత్తమై  ఆయన భద్రతను మరింత పెంచింది.

13.భారత్ లో కరోనా


గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18, 139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.బ్రిటన్ కు విమాన సర్వీసులు ప్రారంభం


Telugu Africangang, Akhilpriya, Amravati Day, Leopard Kurnool, Mla Rajasinghe, B

బ్రిటిష్ ఎయిర్వేస్ సర్వీసులు శక్రవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నట్లు శంషాబాద్ విమానాశ్రయం వర్గాలు వెల్లడించాయి.కోవిడ్ రెండోరకం వైరస్తో బ్రిటన్ భారత్ మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయి జనవరి 7 వరకు కేంద్రం నిషేధం విధించింది.ఆ గడువు ముగియడంతో యధావిధిగా సర్వీసులు ప్రారంభం అయ్యాయి.

15.తెలంగాణలో కరోనా


గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

16.ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్


Telugu Africangang, Akhilpriya, Amravati Day, Leopard Kurnool, Mla Rajasinghe, B

యుగ తెలిసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చౌరస్తాలో శుక్రవారం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలిరావడంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఈ బంద్ లో పాల్గొనేందుకు వచ్చిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

17.తనకు తానే క్షమాభిక్ష పెట్టుకున్న  ట్రంప్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మరో 12 రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి తప్పుకోబోతున్న నేపథ్యంలో తాను చేసిన తప్పులు అన్నింటి నుంచి సెల్ఫ్ పార్డాన్ ( తనకు తాను క్షమాభిక్ష ) చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు న్యూ ఇయర్ టైమ్స్  పత్రిక వెల్లడించింది.

18.ఈనెల 17 నుంచి పోలియో చుక్కలు


Telugu Africangang, Akhilpriya, Amravati Day, Leopard Kurnool, Mla Rajasinghe, B

పోలియో నిర్మూలన కోసం ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు, ఇమ్యునైజేషన్ ను నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.

19.తెలంగాణ జాగృతి సంక్రాంతి పాట విడుదల


తెలంగాణ జాగృతి సంక్రాంతి పాటను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత శుక్రవారం విడుదల చేశారు.

20.ఈరోజు బంగారం ధరలు


Telugu Africangang, Akhilpriya, Amravati Day, Leopard Kurnool, Mla Rajasinghe, B

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,820

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,820

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube