న్యూస్ రౌండప్ ... టాప్20

1.కిలో చికెన్ రూ.15


 Congratulations To Arjun Reddy Director,  Akhil Priya's Husband Absconding In Ki-TeluguStop.com

బర్డ్ ఫ్లూ కారణంగా వివిధ రాష్ట్రాల్లో లక్షలాదిమంది కోళ్లు బాతులు చనిపోతూ ఉండడంతో, వివిధ రాష్ట్రాల్లో ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉండటంతో పౌల్ట్రీ రంగం ఒక్కసారిగా కుదేలు అయింది.తాజాగా ఢిల్లీ మార్కెట్ లో బ్రాయిలర్ కోడి కిలో 15 పలుకుతోంది.దీంతో చికెన్ దుకాణదారులు గగ్గోలు పెడుతున్నారు.

2.’ అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ కు ప్రశంసలు


Telugu Akhilpriyas, Bjpmla, Arjun Reddy, Gold, Mlc-General-Telugu

అర్జున్ రెడ్డి సినిమా తో పాపులర్ అయిన ఆ చిత్ర దర్శకుడు సందీప్ వంగా కు బాలీవుడ్ లో క్రేజ్ పెరుగుతోంది.ఇప్పటికే అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో సందీప్ పాపులర్ అవ్వగా , తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ బీర్ తో యానిమల్ అనే సినిమాను తీస్తున్నాడు.దీనికి సంబంధించిన టైటిల్ వీడియో పై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.

3.తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కోహ్లీ ప్రమాణ స్వీకారం


తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కోహ్లీ బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు రాజ్ భవన్ లో చీఫ్ జస్టిస్ కోహ్లీతో గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారం చేయించారు.

4.కిడ్నాప్ కేసులో పరారీలో అఖిల ప్రియ భర్త


Telugu Akhilpriyas, Bjpmla, Arjun Reddy, Gold, Mlc-General-Telugu

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ ఇంకా పరారీలో నే ఉన్నారు.ఇప్పటికే అఖిలప్రియ అరెస్టు కాగా, తాజాగా ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణ నేడు జరగబోతోంది.

5.గవర్నర్ తో  టిడిపి నేతల బృందం


రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న దాడులు ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని ఏపీ టిడిపి నాయకులు గవర్నర్ ను కలిశారు.

6.రామతీర్థం లో మళ్లీ ఉద్రిక్తత


Telugu Akhilpriyas, Bjpmla, Arjun Reddy, Gold, Mlc-General-Telugu

విజయనగరం జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.రామతీర్థం కొండ పైకి ర్యాలీగా వెళ్లేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

7.387 వ రోజుకు చేరిన రాజధాని నిరసనలు


రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తూ రైతులు మహిళలు చేపట్టిన నిరసన 387 వ రోజుకు చేరుకున్నాయి.

8.ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 28 న


Telugu Akhilpriyas, Bjpmla, Arjun Reddy, Gold, Mlc-General-Telugu

టిడిపి మాజీ నాయకురాలు పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.ఎమ్మెల్సీ ఎన్నిక కు నోటిఫికేషన్ 11 న విడుదల చేసి, ఈ నెల 28 న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు చేయబోతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు.

9.ఉస్మానియాలో రేపు డ్రై రన్


ఉస్మానియా ఆస్పత్రిలో ఈనెల ఎనిమిదో తేదీన డ్రై నిర్వహించి, 13 ,14, 15 తేదీల్లో వాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

10.తెలంగాణలో ర్యాలీకి చంద్రబాబుకు ఆహ్వానం


Telugu Akhilpriyas, Bjpmla, Arjun Reddy, Gold, Mlc-General-Telugu

ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా ఈనెల 18న బేగంపేట రసూల్ పుర లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వరకు ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ నిర్వహించబోతున్నారు.టిడిపి అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది.

11.తెలంగాణలో కరోనా


గడిచిన 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

12.వరుణ్ తేజ్ కి కరోనా నెగిటివ్


Telugu Akhilpriyas, Bjpmla, Arjun Reddy, Gold, Mlc-General-Telugu

కొద్ది రోజుల క్రితం ప్రభావానికి గురైన టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు నుంచి బయటపడ్డారు.తాజాగా ఆయన చేయించిన టెస్ట్ లో కరోనా నెగటివ్ వచ్చింది.

13.అమిత్ షా చెన్నై పర్యటన రద్దు


కేంద్ర మంత్రి అమిత్ షా చెన్నై పర్యటన రద్దు అయింది ఈనెల 14వ తేదీన చెన్నై లో జరగనున్న ‘ తుగ్లక్ ‘ పత్రిక వార్షికోత్సవం లో పాల్గొనేందుకు ఆయన రావాల్సి ఉండగా ఆ పర్యటన రద్దయింది.

14.పోలీస్ కమిషనర్ కు ఎమ్మెల్యే వార్నింగ్


Telugu Akhilpriyas, Bjpmla, Arjun Reddy, Gold, Mlc-General-Telugu

సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.ఐదు రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే, తానే రంగంలోకి దిగుతాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

15.కరోనా తో 600 కు పైగా జర్నలిస్టు మృతి


గత ఏడాది మార్చి తర్వాత నుంచి 59 దేశాల్లో ఆరువందలకు పైగా జర్నలిస్టులు కరోనా కారణంగా మృతి చెందారని, స్విజ్జర్లాండ్ లోని మీడియా వాచ్ డాగ్ ప్రెస్ ఏంబ్లం క్యాంపెయిన్ వెల్లడించింది.

16.చైనా తీరుపై డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి


Telugu Akhilpriyas, Bjpmla, Arjun Reddy, Gold, Mlc-General-Telugu

మూలాలపై దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల బృందానికి అనుమతులు మంజూరు చేసే విషయంలో చైనా అధికారుల నాంచివేత ధోరణిపై డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి వ్యక్తం చేసింది.

17.ఆసుపత్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్


ఇటీవల గుండెపోటుకు గురైన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కోల్ కతా లోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రి నుంచి గురువారం ఉదయం డిశ్చార్జ్ చేశారు.

18.సోను సూద్ పై ఫిర్యాదు


Telugu Akhilpriyas, Bjpmla, Arjun Reddy, Gold, Mlc-General-Telugu

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ముంబైలోని తన ఇంటిని హోటల్ గా మార్చారు అంటూ , దీనికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

19.ట్రంప్ ‘ ట్విట్టర్ ‘ ఖాతా లాక్


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖాతాను ట్విట్టర్ లాక్ చేసింది.

20.ఈరోజు బంగారం ధరలు


Telugu Akhilpriyas, Bjpmla, Arjun Reddy, Gold, Mlc-General-Telugu

22 క్వారెట్ల10 గ్రాముల బంగారం ధర -50,590

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,590

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube