న్యూస్ రౌండప్ టాప్ 20

1.విద్యార్థులతో షర్మిల భేటీ

కొత్త పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల ఈరోజు లోటస్ పాండ్ లో విద్యార్థులతో భేటీ అయ్యారు.మీ అక్కగా ఈ సమాజాన్ని బాగుచేసేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ షర్మిల విద్యార్థులతో వ్యాఖ్యానించారు.

 Ap And Telangana Breaking News, Top20 News, Headlines, Today Gold Rate, Ap Coron-TeluguStop.com

2.స్టాఫ్ నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు

స్టాఫ్ నర్స్ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థుల వెబ్ ఆప్షన్స్ బుధవారం నుంచి అనుమతి ఇచ్చామని టిఎస్ పిఎస్సీ ప్రకటించింది.

3.ఎమ్మెల్సీ ఎన్నికల పై కేటీఆర్ ఫోకస్

Telugu Ap Telangana, Mlc, Gold, Top-Latest News - Telugu

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు పై మంత్రి కేటీఆర్ పూర్తిగా దృష్టి సారించారు.ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో పరిధిలోని మంత్రులు,  ఎంపీలు, ఎమ్మెల్యేలతో నేడు కేటీఆర్ ప్రత్యేక సమావేశం కానున్నారు.

4.పాడి పశువులపై చిరుత దాడి

మహబూబ్నగర్ జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టిస్తోంది.దేవరకద్ర మండల పరిధిలోని , హజీలపురం గ్రామంలో ఓ రైతుకు చెందిన రెండు  పశువుల పై చిరుత దాడికి పాల్పడింది.

5.వరంగల్ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన

పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

6.నేటి నుంచి మేడారం మిని జాతర

ములుగు జిల్లాలోని మేడారం లో తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారమ్మల మినీ జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

7.అయోధ్య మందిరానికి 150 కోట్ల విరాళం

Telugu Ap Telangana, Mlc, Gold, Top-Latest News - Telugu

అయోధ్య రామమందిర నిర్మాణానికి తెలంగాణకు చెందిన 50 లక్షల మంది 150 కోట్ల విరాళం ఇచ్చినట్టు తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ దేవేందర్ జీ వెల్లడించారు.

8.వైసీపీ లోకి హిందూపురం మాజీ ఎమ్మెల్యే

హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత రంగనాయకులు నిన్న రాత్రి వైసీపీ ఎమ్యెల్సి మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో వైసీపీ లో చేరారు.

9.మంత్రి ఎర్రబెల్లి తో ఎమ్మెల్సీ కవిత భేటీ

Telugu Ap Telangana, Mlc, Gold, Top-Latest News - Telugu

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో ఎమ్మెల్సి కవిత, మరికొంత మంది ఎమ్మె ల్సి లు భేటీ అయ్యారు.

10.బీజేపీ కీలక సమావేశం

తెలంగాణ బీజేపీ శాఖ ఈ రోజు నాలుగు గంటలకు కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.ఈ సమావేశానికి బిజెపి ఇంచార్జి తరుణ్ తుగ్ హాజరుకానున్నారు.

11.ఎమ్మెల్యే దంపతులకు కరోనా పాజిటివ్

తెలంగాణలోని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య వరంగల్ రూరల్ పరిషత్తు చైర్మన్ గండ్ర జ్యోతికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

12.జనసేన పిటిషన్ పై విచారణ వాయిదా

Telugu Ap Telangana, Mlc, Gold, Top-Latest News - Telugu

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ జనసేన వేసిన పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

13.ప్రపంచ వ్యాప్తంగా కరోనా

గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3,71,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.పదిమంది వాలంటీర్ల తొలగింపు

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం దేవునికొండ, మోదేపల్లి లో పదిమంది వాలంటీర్లు తొలగింపు

15.ఏపీలో కరోనా

Telugu Ap Telangana, Mlc, Gold, Top-Latest News - Telugu

గడిచిన 24 గంటల్లో ఏపీలో మొత్తం 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

16.పుర పోరుకు 9307 పోలింగ్ కేంద్రాలు

12 పురపాలక సంస్థలకు వచ్చే నెల 10 న ఎన్నికల కోసం మొత్తం 9307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

17.దుర్గ గుడిలో 15 మంది ఉద్యోగులపై వేటు

బెజవాడ కనకదుర్గ ఆలయంలో 15 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.

18 టిఆర్ఎస్ నేత గోవర్థన్ ఇంట్లో ఐటీ సోదాలు

టిఆర్ఎస్ సీనియర్ నేత గోవర్ధన్ రెడ్డి నివాసం లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.సంగారెడ్డి జిల్లా గుమ్మడిధల మండల కేంద్రంలో ని ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు.

19.కరోనా ఉదృతం .9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న 9 రాష్ట్రాలకు కేంద్ర ప్రత్యేక బృందాలు తరలి వెళ్లాయి.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Mlc, Gold, Top-Latest News - Telugu

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,770

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,770

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube