న్యూస్ రౌండప్ టాప్ - 20

1.కాంగ్రెస్ కు  మాజీ ఎమ్మెల్యే రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పంపారు.

 Ap And Telangana Breaking News, Andhra Headlines, Telangana News, Top20 News,kar-TeluguStop.com

2.షీ టాక్సీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

Telugu Amitab Bachchan, Andhra, Ap Telangana, Gold Rates, Kareena Kapoor, Telang

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలు క్యాబ్ డ్రైవర్లు గా ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు.ఆసక్తి కలిగిన మహిళలకు సబ్సిడీతో కారును అందించడంతోపాటు , క్యాబ్ డ్రైవర్ గా శిక్షణ ఇవ్వనున్నారు.దీనిపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, హైదరాబాద్ కలెక్టరేట్ లోని మహిళా శిశు సంక్షేమ కార్యాలయం లో కాని, cpdo కార్యాలయంలో కాని, దరఖాస్తు ఫారం పొంది, ఈ నెల 28లోగా మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో అందించాలని, దరఖాస్తు చేసుకునేవారు 18 ఏళ్లు పైబడి, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని నిబంధన విధించారు.

3.బీజేపీ ఛలో మంథని కార్యక్రమం

న్యాయవాద దంపతుల హత్య ను బిజెపి లీగల్ సెల్ సీరియస్ గా తీసుకుని ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టింది.వామన్ రావు దంపతుల హత్య పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, రంగారెడ్డి జిల్లా కోర్టులో నుండి ఛలో మంథని కార్యక్రమం ప్రారంభమైంది.

4.రేపు మేయర్, డిప్యూటీ మేయర్ ల బాధ్యతలు స్వీకరణ

మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి  జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ లో సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక పూజలు చేస్తారని , అనంతరం బాధ్యతల స్వీకరణ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

5.భారత్ లో కరోనా

Telugu Amitab Bachchan, Andhra, Ap Telangana, Gold Rates, Kareena Kapoor, Telang

భారత్ లో లో కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసుల్లో రోజురోజుకు పెరుగుదల కనిపిస్తోంది.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,264 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

6.తెలంగాణ లో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

7.రైల్వే స్టేషన్ల లో కరెంట్ బుకింగ్ పునరుద్ధరణ

Telugu Amitab Bachchan, Andhra, Ap Telangana, Gold Rates, Kareena Kapoor, Telang

కువైట్ తరువాత ఆన్లైన్ కే పరిమితమైన రైల్వే రిజర్వేషన్ ఇప్పుడు స్టేషన్లలో ఆఫ్ లైన్ లోనూ కొనసాగుతోంది.

8.ఏపీ రహదారులకు 4459 కోట్లు

ఏపీలో హైవేల నిర్మాణం, మరమ్మతులు, ఆధునీకరణకు 2021- 22 బడ్జెట్ లో రూ 4459.52 కోట్లు కేటాయించినట్లు కేంద్ర జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది.

9.23 న బీఎస్సీ సీట్లకు చివరి కౌన్సిలింగ్

ఏపీలో బీఎస్సీ ( హాన్సర్ ) లో ప్రవేశానికి చివరి విడత కౌన్సిలింగ్ ఈ నెల 23 న జరగనుందని అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్ గిరిధర కృష్ణ తెలిపారు.

10.నేటితో ముగియనున్న శారదాపీఠం వార్షికోత్సవాలు

విశాఖ నగరంలో జరుగుతున్న శారదాపీఠం వార్షికోత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి.

11.అమరావతి ఆందోళనలు

Telugu Amitab Bachchan, Andhra, Ap Telangana, Gold Rates, Kareena Kapoor, Telang

 ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అని డిమాండ్ చేస్తూ రైతులు మహిళలు రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు 432 వ రోజుకి చేరుకున్నాయి.

12.ఏప్రిల్ 10 న హై కోర్టు లో లోక్ అదాలత్

రాజీకి వీలున్న సివిల్, క్రిమినల్, మోటార్ వాహన అప్పిల్లు, చెక్కుల కేసులు, వివాహ సంబంధ అప్పిళ్లను పరిష్కరించేందుకు ఏప్రిల్ 10 న ఏపీ హై కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించనున్నారు.

13.విదేశీయుల రాకపై కువైట్ నిషేధం

Telugu Amitab Bachchan, Andhra, Ap Telangana, Gold Rates, Kareena Kapoor, Telang

విదేశీయుల రాకపై కువైట్ మరోమారు నిషేధం పొడిగించింది.ఇతర దేశాల్లో ఉంటున్న కువైట్ పౌరులు రావచ్చని, కానీ విదేశీ పౌరులు తమ దేశానికి రావడానికి వీలు లేదని ప్రకటించింది.

14.జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరి నదుల అనుసంధానం

మూడు రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజలకు ఎంతో యోగపడే గోదావరి కావేరి నదుల అనుసంధానం ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రధాని నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేశారు.

15.మగ బిడ్డకు జన్మనిచ్చిన కరీనాకపూర్

Telugu Amitab Bachchan, Andhra, Ap Telangana, Gold Rates, Kareena Kapoor, Telang

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఆదివారం ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చింది.

16.ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటాం టీఆర్ఎస్  ఎమ్మెల్యే

ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తెలంగాణకు చెందిన ఒక క్రీడాకారుడిని ఎంపిక చేయకపోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామంటూ ఆయన హెచ్చరించారు.

17.బర్డ్ ఫ్లూ కొత్త స్ట్రైయిన్

కరోనా వైరస్ తో ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికి పోతూ ఉండగా, తాజాగా రష్యాలో ఓ కొత్తరకం వైరస్ బయటపడింది.రష్యా లోని ఓ పౌల్ట్రీ కోళ్ల లో కొత్తరకం H5N8 స్ట్రెయిన్ వైరస్ బయటపడింది.

18.అమితాబ్ నివాసానికి భద్రత పెంపు

Telugu Amitab Bachchan, Andhra, Ap Telangana, Gold Rates, Kareena Kapoor, Telang

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ నివాసం  ‘జలా ‘ వద్ద పోలీసులు భద్రత పెంచారు.చమురు ధరల పెరుగుదల పై స్పందించడం లేదు అంటూ కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే అమితాబ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అమితాబ్ నివాసం వద్ద భద్రత పెంచారు.

19.మయన్మార్ సైనిక ఖాతాను నిషేధించిన ఫేస్బుక్

మయన్మార్ లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై సామాజిక మాద్యమం ఫేస్బుక్ తీవ్రంగా స్పందించింది.ఈ మేరకు ఆ దేశ మిలటరీ కి సంబంధించిన అధికారిక పేజీని ఫేస్బుక్ తొలగించింది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Amitab Bachchan, Andhra, Ap Telangana, Gold Rates, Kareena Kapoor, Telang

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 43,260

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,190

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube