న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.దుప్పి మాంసం అమ్మకం .అరెస్ట్

దుప్పి మాంసం అమ్మిన కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ డివిజన్ లోని అటవీ ప్రాంతంలో లో చోటు చేసుకుంది.చుక్కల దుప్పిని వేటాడి, మాంసం అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు అటవీ అధికారులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.జూలై 5 నుంచి ఎంసెట్

తెలంగాణలో ఎంసెట్ తో పాటు, ఈసెట్, పీజీఈ సెట్ తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.బిఈ, బీటెక్, బీ ఫార్మసీ లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ ను జులై 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని, ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు.

3.ఎంఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీకి తుది కౌన్సిలింగ్

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీసీ సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్ కోసం కాళోజీ హెల్త్ యునివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

4.నిజామాబాద్ జిల్లా లో చిరుత సంచారం

నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండలం గుత్ప శివారు లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.రామాలయం శివారు పొలాల్లో చిరుతను చూసినట్టు రైతులు చెబుతున్నారు.

5.తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.కేసీఆర్ పుట్టినరోజు యాగం

Telugu Ap Telangana, Cm Kcr, Gold, Top, Whitesecretary-Latest News - Telugu

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 17 వ తేదీన ‘ ఆది శ్రావణ యాగం ‘ నిర్వహించబోతున్నారు.

7.స్కిల్ కాంపిటీషన్ కు నెలాఖరు వరకు దరఖాస్తులు

వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన వారు స్కిల్స్ 2021 పోటీలకు ఈ నెలాఖరులోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్ కేవై నాయక్ కోరారు.

8.షర్మిలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం

Telugu Ap Telangana, Cm Kcr, Gold, Top, Whitesecretary-Latest News - Telugu

తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించబోతున్న వైఎస్ షర్మిలకు మద్దతు ఇవ్వాలని ఖమ్మం జిల్లా వైసీపీ నాయకులు తీర్మానించుకున్నారు.

9.వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు ఊరట

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఎన్నికలు అయ్యే వరకు బహిరంగంగా మాట్లాడకుండా నిషేదం విధిస్తూ, ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిరయంపై హై కోర్టుకు వెళ్ళిన జోగి రమేష్ కు అనుకూలంగా తీర్పు వెలువడింది.

10.తెలంగాణకు జీఎస్టీ పరిహారం

వస్తు సేవల పన్ను (జిఎస్టి ) పరిహారం కింద కేంద్ర ప్రభుత్వ తెలంగాణ కు 130 కోట్ల పరిహారం విడుదలయ్యింది.

11.టిడిపి ఎమ్మెల్యేలతో జేడి లక్ష్మినారాయణ భేటీ

Telugu Ap Telangana, Cm Kcr, Gold, Top, Whitesecretary-Latest News - Telugu

స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు.

12.సంగారెడ్డి ఎస్పీ పై డీజీపీ కి మంత్రి హరీష్ రావు ఫిర్యాదు

సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పనితీరు ఏమాత్రం బాగోలేదని బీజేపీకి మంత్రి హరీష్ రావు ఫిర్యాదు చేశారు.

13.కోవిడ్ వాక్సిన్  రెండో దశ

ఏపీలో రెండో దశ కోవిడ్ వాక్సిన్ ను ఈ రోజు నుంచి ప్రారంభించారు.

14.ఎన్నికలు ఆపాలంటూ నిరసన

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేటలో ఎన్నికలు ఆపాలంటూ గ్రామస్థులు నిరసనకు దిగారు.

15.నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చంద్రబాబు లేఖ

Telugu Ap Telangana, Cm Kcr, Gold, Top, Whitesecretary-Latest News - Telugu

చిత్తూరు జిల్లా కుప్పం మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ వైసీపీ ఎన్నికల అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

16.స్టాలిన్ పై పరువు నష్టం దావా

ఫస్ట్ అఖిల ఒంగోలులో తమిళనాడు మత్స్య శాఖ మంత్రి జయకుమార్ 30 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ పై పరువు నష్టం దావా వేసే పనిలో జయ కుమార్ ఉన్నారు.ఇప్పటికే ఈ వ్యవహారం పై గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేశారు.

17.వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ సస్పెన్షన్

Telugu Ap Telangana, Cm Kcr, Gold, Top, Whitesecretary-Latest News - Telugu

ఓ విలేకరిని బెదిరించిన వైట్ హౌస్ డిఫ్యూటీ ప్రెస్ సెక్రెటరీ టిజే డక్లో పై సస్పెన్షన్ వేటు పడింది.

18.జూన్ 27 న సివిల్స్ ప్రిలిమ్స్ : యూపీఎస్సీ

సివిల్ సర్వీసెస్ పిలిమినరి పరీక్షను ఈ ఏడాది జూన్ 27 న నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ ప్రకటించింది.

19.మేయర్ ఫ్లెక్సీ లు .లక్ష జరిమానా

జీహెచ్ ఎంసీ కొత్త మేయర్ విజయలక్ష్మికి అభినందనలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు కావడంతో జీహెచ్ ఎంసీ అధికారులు వాటిని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నేత అతీష్ అగర్వాల్ కు లక్ష జరిమానా విధించారు.

20.ఈ రోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Cm Kcr, Gold, Top, Whitesecretary-Latest News - Telugu

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,340

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,340

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube