న్యూస్ రౌండప్ ... టాప్20

1.అడ్డొస్తే తొక్కేస్తా : రాజా సింగ్


 Raised Cheetah Offspring,   Sonu Sood's Response On Setting Up The Statue,   A N-TeluguStop.com

ధర్మం కోసం గో రక్షణ కోసం తనకు అడ్డు వస్తే పార్టీ అయినా, పదవినైనా కాలితో తొక్కేస్తానాని గోషామహల్ బిజెపి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2.పెరిగిన చిరుతల సంతతి


Telugu Loan Apps, Corona, Modimerit, Cheetah, Sonusoods-General-Telugu

దేశవ్యాప్తంగా నాలుగేళ్లలో చిరుత పులుల సంఖ్య నాలుగు వేలకు పెరిగింది.ఈ మేరకు ‘ భారత్ లో చిరుతల నివేదిక -2018 ‘ ను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు.

3.యశోద ఆస్పత్రిలో ఐటీ తనిఖీలు


హైదరాబాదులోని యశోదా ఆస్పత్రిలో ఐటి అధికారులు తనిఖీలు చేశారు.సీనియర్ డాక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.డాక్టర్ల ఐటీ చెల్లింపుల వ్యవహారంలో అక్రమాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేసినట్లు చెబుతున్నారు.

4.విగ్రహం ఏర్పాటుపై సోనూ సూద్ స్పందన


Telugu Loan Apps, Corona, Modimerit, Cheetah, Sonusoods-General-Telugu

సిద్దిపేట జిల్లాలో ని చెలిమి తండాకు చెందిన రాజేష్ రాథోడ్ అనే వ్యక్తి సోను సూద్ అభిమానంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.తన స్థాయికి మించిన గౌరవం ఇదని, త్వరలోనే ఆ ఆలయానికి వెళ్లాలని ఉంది అంటూ గ్రామస్తులకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు .

5.అమెరికాలో హైదరాబాదీ పై కాల్పులు


అమెరికాలోని షికాగో నగరంలో దోపిడి దొంగలు జరిపిన కాల్పుల్లో పాతబస్తీ సంతోష్ నగర్ మొయినాబాగ్ కు చెందిన మహ్మద్ మజీబుద్దిన్ ( 43) గాయపడ్డారు.

6.భారత్ లోనూ కొత్తరకం కరోనా


Telugu Loan Apps, Corona, Modimerit, Cheetah, Sonusoods-General-Telugu

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భయం ఇంకా పోకముందే, కొత్తరకం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూసింది.ముఖ్యంగా బ్రిటన్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ,బెల్జియం, ఇటలీ వంటి దేశాల్లో వెలుగు చూశాయి.తాజాగా లండన్ నుంచి భారత్ కు వచ్చిన కొంతమంది లో  కొత్తరకం వైరస్ లక్షణాలు బయటపడినట్లు తెలుస్తోంది.

7.జగన్ కడప టూర్


ఈ నెల 23, 24, 25 తేదీలలో ఏపీ సీఎం జగన్ వైయస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తారు.ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

8.మోదీకి అమెరికా లిజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు


Telugu Loan Apps, Corona, Modimerit, Cheetah, Sonusoods-General-Telugu

అమెరికా లిస్ట్ ఆఫ్ మెరిట్ అవార్డు భారత ప్రధాని నరేంద్ర మోదీ కి వచ్చింది.ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి కృషి చేసినందుకుగాను మోదీకి అవార్డు ను ప్రకటించారు.

9.కోవిడ్  వాక్సిన్ తీసుకున్న బైడన్


అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ గతంలో చెప్పినట్లుగా ప్రజల మధ్య ఫైజర్ బయో ఎన్ టెక్ కోవిడ్ వాక్సిన్ ఫస్ట్ దోస్త్ తీసుకున్నారు .

10.సురేష్ రైనా అరెస్ట్


Telugu Loan Apps, Corona, Modimerit, Cheetah, Sonusoods-General-Telugu

టీమిండియా మాజీ క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా సోమవారం రాత్రి ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.కోవిడ్ నియమాలు పాటించకుండా ముంబై విమానాశ్రయం సమీపంలోని ఓ పబ్ నిర్వహిస్తున్నారు అనే సమాచారం తో పోలీసులు దాడులు నిర్వహించగా,  బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు సురేష్ రైనా  కూడా ఆ పబ్ లో ఉండడంతో ఆయనను అరెస్టు చేశారు.

11.భారత్ లో కరోనా


గడిచిన 24 గంటలలో భారత్ లో కొత్తగా 19,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

12.తెలంగాణలో కరోనా


Telugu Loan Apps, Corona, Modimerit, Cheetah, Sonusoods-General-Telugu

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 617 క రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.ఐసెట్ కౌన్సిలింగ్


ఎంబీఏ ఎంసీఏ కాలేజీలో ప్రవేశాలలో ప్రవేశాలకు సంబంధించి  టి ఎస్ ఐసెట్ తుది విడత కౌన్సిలింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైంది.ఈ నెల 22న స్లాట్ బుకింగ్, 23 న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ,22 నుంచి 24 వరకు ఆప్షన్ ల ఎంపిక ఉంటుందని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.

14.రుణ యాప్ లపై ఫిర్యాదులు


Telugu Loan Apps, Corona, Modimerit, Cheetah, Sonusoods-General-Telugu

హైదరాబాద్ లో ఆన్ లైన్ ‘ కాల్ మనీ ‘ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.బాధితులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లకు చేరుకుని పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఇస్తున్నారు.నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.

15.రకుల్ కి కరోనా


టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ కరోనా పాజిటివ్ కి గురయ్యారు.ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

16.యూకే ప్రయాణికుల్లో కరోనా


Telugu Loan Apps, Corona, Modimerit, Cheetah, Sonusoods-General-Telugu

బ్రిటన్ నుంచి భారత్ కు వస్తున్న ప్రయాణికుల్లో కొత్తరకం కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది.

17.సిస్టర్ అభయ కేసు


కేరళలో 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ (21) హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.సిస్టర్ అభయను ఫాదర్ థామస్ కొట్టూర్ , నన్ సెఫి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో వారిని దోషులుగా ప్రకటించింది.

18.ఆన్లైన్ కాల్ మనీ కేసులో 10 మంది అరెస్ట్


Telugu Loan Apps, Corona, Modimerit, Cheetah, Sonusoods-General-Telugu

ఆన్లైన్ కాల్ మనీ కేసు విచారణ స్పీడ్ అందుకుంది అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తూ వస్తున్న గ్యాంగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.బెంగళూరు ,ఢిల్లీ , గుర్గావ్ లో సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

19.చిక్కుల్లో ఇన్స్టాగ్రామ్


ఇన్ స్టా గ్రాం చిక్కుల్లో పడింది ఒక బగ్ కారణంగా ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచేటప్పుడు యూజర్స్ అందించే వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వివరాలు బహిర్గతం అయ్యాయని ఓ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు తెలిపాడు.

20.ఈరోజు బంగారం ధరలు


Telugu Loan Apps, Corona, Modimerit, Cheetah, Sonusoods-General-Telugu

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,260

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,260

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube