న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఆంధ్ర ఆదర్శ రైతుకు కెసిఆర్ ఫోన్

ఆంధ్ర ఆదర్శ రైతు ప్రసాదరావుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు.కృష్ణాజిల్లా ఘంటసాల మండలం, ఘంటసాల పాలెం చెందిన ప్రసాదరావు ఫోన్ చేసి కేసిఆర్ వెద పద్ధతిలో సాగు అంశాలను అడిగి తెలుసుకున్నారు.

 Andhra And Telangana News,roundup, Headlines, Breaking News, Ap Breaking News, M-TeluguStop.com

2.తెలంగాణ లో కరోనా

తెలంగాణ లో కొత్తగా 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ ప్రభావం తో ముగ్గురు మృతి చెందారు.

3.కామారెడ్డి కి అత్యుత్తమ పురస్కారం

Telugu Ap, Krack, Maheshbabu-Latest News - Telugu

జాతీయ స్థాయిలో కామారెడ్డి కి అత్యుత్తమ పురస్కారం లభించింది.డిజిటల్ గవర్నమెంట్ లో ఫిబ్రవరి-2020 అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాలను ఎంపిక చేసింది.

4.కోదండరామ్ ముచ్చట్లు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఆదివారం ఉదయం కోదాడలో మార్నింగ్ వాకర్స్ తో కలిసి ఆయన ముచ్చటించారు.

5.గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల గడువు పెంపు

సాంఘిక గిరిజన బీసీ జనరల్ గురుకులాల్లో ఐదవ తరగతి ప్రవేశాల గడువు పొడగించారు.మొదటి విడత లో విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఆఖరి తేదీ శనివారం (19 డిసెంబర్ ) తో మూసింది.దీనిని ఈ నెల 28 వరకు పొడిగించినట్లు తెలంగాణ గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

6.బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజీనామా

Telugu Ap, Krack, Maheshbabu-Latest News - Telugu

మహబూబ్ నగర్ జిల్లా బిజెపి అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా చేశారు.పార్టీలో విభేదాలు కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

7.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 26,624 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.అమెరికాలో హైదరాబాద్ వాసి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు.హైదరాబాదులోని తప్పాచబుత్రాకి చెందిన మహ్మద్ మోయిజుద్దిన్ ( 35) షికాగో లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

9.రాజకీయాల్లోకి షకీలా

Telugu Ap, Krack, Maheshbabu-Latest News - Telugu

పలు భాషల్లో 200కు పైగా చిత్రాలలో నటించిన శృంగార తార షకీలా త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు.

10.మహేష్ హీరోయిన్ కి నెగిటివ్

మహేష్ తో నటించిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా ఆమె కు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ గా వచ్చినట్లు స్వయంగా ఆమె ప్రకటించారు.

11.200 కోట్ల డోసులు

Telugu Ap, Krack, Maheshbabu-Latest News - Telugu

కరోనా వ్యాక్సిన్ కోసం డబ్బు వెచ్చించలేని పేదలకు సహాయం చేసేందుకు అంతర్జాతీయ వాక్సిన్ భాగస్వామి కోవాక్స్ ముందుకొచ్చింది.అన్ని రకాల అనుమతులు పొందిన వ్యాక్సిన్ ను 2021లో దాదాపు 92 దేశాలకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.దీని కోసం 200 కోట్ల డోసులను సిద్ధం చేస్తోంది.

12.ఆరు నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్

భారత్ లో తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ రానున్న ఆరు నెలల్లో 30 కోట్ల మందికి ఇవ్వబోతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.

13.అయోధ్య లో మసీదు

Telugu Ap, Krack, Maheshbabu-Latest News - Telugu

వచ్చే ఏడాది అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్ట్ శనివారం విడుదల చేసింది.

14.ఆదిలాబాద్ ఎంఐఎం శాఖ రద్దు

హైదరాబాద్ లో కాల్పుల ఘటన కలకలం రేపుతున్న నేపథ్యంలో ఎంఐఎం ఆదిలాబాద్ శాఖ రద్దయింది.ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అహ్మద్ భాషా ఖాద్రీ ఈ విషయాన్ని ప్రకటించారు.

15.ఏపీ ప్రభుత్వానికి మహేష్ కృతజ్ఞతలు

Telugu Ap, Krack, Maheshbabu-Latest News - Telugu

కరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమపై వరాలు కురిపించిన ఏపీ సీఎం జగన్ కు టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

16.రైతులతో ప్రధాని భేటీ

Telugu Ap, Krack, Maheshbabu-Latest News - Telugu

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించుకుంది.ఈ మేరకు మాజీ ప్రధాని వాజ్ పేయ్ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోది రైతులతో ముచ్చటించబోతున్నారు.

17.నీరవ్ మోదీ సోదరుడిపై న్యూయార్క్ లో కేసు

భారత్ లో బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నిరవ్ మోదీ సోదరుడు నిహల్ పై  కేసు నమోదైంది.

18.జనవరి నుంచి పాఠశాలలు ప్రారంభం.

2021 జనవరి ఒకటో తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులతో పాటు, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

19.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,81024 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,060

20.సంక్రాంతి బరిలో ‘ క్రాక్ ‘

Telugu Ap, Krack, Maheshbabu-Latest News - Telugu

మాస్ మహారాజా రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం క్రాక్ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube