న్యూస్ రౌండప్...టాప్ 20

1.జగన్ పై పాయల్ కామెంట్స్


 Missed Accident To Himachal Pradesh Governor,  Hero Vishal Contests Assembly Ele-TeluguStop.com

జగన్ డైనమిక్ సీఎం అంటూ ఆర్ఎక్స్100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కామెంట్ చేశారు.

2.హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కు తప్పిన ప్రమాదం


Telugu Gajwelzone, Gold, Vishal Assembly, Himachalpradesh, Ranacomrade, Tigerani

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గర హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ దత్తాత్రేయ పెద్ద ప్రమాదం తప్పింది.హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్తుండగా చౌటుప్పల్ మండలం సైదాపురం సమీపంలో ఆయన కారు అదుపుతప్పి రోడ్డు  కిందకు దూసుకెళ్లింది.ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

3.ఫైజర్ వ్యాక్సిన్ కు కేంద్రం నో


కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అమెరికాలో వినియోగించబోతున్న ఫైజర్ వాక్సిన్ ను భారత్ లో వినియోగించేందుకు కేంద్రం నో చెబుతోంది.దీనికి కారణం ఆ వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉండటమే కారణమట.

4.అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విశాల్ పోటీ


Telugu Gajwelzone, Gold, Vishal Assembly, Himachalpradesh, Ranacomrade, Tigerani

తమిళ్ సినీ హీరో విశాల్ వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు బయటపెట్టారు.

5.పోలీస్ పోస్టుల భర్తీ పై కేసీఆర్ ప్రకటన


తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నిటిని భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు .దాదాపు 20,000 పోస్టులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.

6.జనం పైకి దూసుకెళ్లిన నూతన వాహనం


Telugu Gajwelzone, Gold, Vishal Assembly, Himachalpradesh, Ranacomrade, Tigerani

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో జనాలు పైకి 104 వాహనం దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఆగ్రహంతో గ్రామస్తులు 104 వాహనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.

7.కరోనా వ్యాక్సిన్ పంపిణీపై శిక్షణ


తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమయ్యింది.

ఈ మేరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు.వాక్సిన్ పంపిణీ పై నేడు రేపు అధికారులకు శిక్షణ ఇవ్వబోతున్నారు.

8.అనిశెట్టి పల్లి లో పెద్దపులి కలకలం


Telugu Gajwelzone, Gold, Vishal Assembly, Himachalpradesh, Ranacomrade, Tigerani

తెలంగాణలోని భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టి పల్లి లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.

9.తెలంగాణలో కరోనా


గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 384 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ ప్రభావంతో ముగ్గురు మృతి చెందారు.

10.కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి


Telugu Gajwelzone, Gold, Vishal Assembly, Himachalpradesh, Ranacomrade, Tigerani

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరు గ్రామంలో కల్తీ కల్లు తాగిన కారణంగా జడ్చర్ల మున్సిపాలిటీ లోని పాత బజారు కు చెందిన వెంకటేష్ (30), నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన కాసిం (35) మృతి చెందారు.

11.గ్రూప్ 1 సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్


తెలంగాణ రాష్ట్ర గ్రూపు 1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.

12.పార్టీ మార్పుపై జానారెడ్డి స్పందన


Telugu Gajwelzone, Gold, Vishal Assembly, Himachalpradesh, Ranacomrade, Tigerani

తాను బిజెపిలో చేరబోతున్నట్టు మీడియాలో అదే పని గా వస్తున్న హడావుడి పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు.తాను పార్టీ మారడం లేదని కాంగ్రెస్ లోనే ఉంటానని ఆయన ప్రకటించారు.

13.బిల్ గేట్స్ హెచ్చరిక


రానున్న 4- 6 నెలల్లో కరోనా వైరస్ మరింతగా విజృంభించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ సహ స్థాపకులు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.

14.చెక్కు చెల్లింపులకు కొత్త రూల్స్


Telugu Gajwelzone, Gold, Vishal Assembly, Himachalpradesh, Ranacomrade, Tigerani

జనవరి 1 నుంచి చెక్కుల చెల్లింపులకు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నారు.50,000 లకు మంచి చేసే చెక్ చెల్లింపులపై కొత్త

నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి

15.తొలి దశలో కోటి మందికి కరోనా వాక్సిన్


కేంద్రం నుంచి రాష్ట్రానికి కరోనా వాక్సిన్ అందుబాటులోకి రాగానే నెలలో కోటిమందికి వాక్సిన్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

17.నయీం కేసు పై గవర్నర్ కు లేఖ


గ్యాంగ్ స్టార్ నయీమ్ కేసుపై తెలంగాణ  గవర్నర్ తమిళ సై కు సుపరిపాలన వేదిక లేఖ రాసింది.ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఆ లేఖలో కోరింది.

18.కామ్రేడ్ రవన్న గా రానా ?


Telugu Gajwelzone, Gold, Vishal Assembly, Himachalpradesh, Ranacomrade, Tigerani

సురేష్ ప్రొడక్షన్స్ లో వస్తున్న విరాట పర్వం సినిమాలో రానా పాత్రను తెలుపుతూ ఒక వీడియో గ్లిమ్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది.సినిమాలో కామ్రేడ్ రవన్నగా రానా నటిస్తున్నారు.

19.రైతుల దీక్ష పై అమిత్ షా – తోమర్ భేటీ


ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం మరింత ఉధృతం అయిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా , కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ భేటీ అయ్యారు.

20.ఈ రోజు బంగారం ధరలు


Telugu Gajwelzone, Gold, Vishal Assembly, Himachalpradesh, Ranacomrade, Tigerani

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,800

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -49,950

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube