న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏలూరు వింత వ్యాధితో మరో ఇద్దరు మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో మరో ఇద్దరు మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు ఈ సంఘటనలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.

 Telangana And Andhra Pradesh Today News Roundup, Telangana Political News, Break-TeluguStop.com

2.మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఠాకూర్

పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం భేటీ కాబోతున్నారు.

3.గవర్నర్ ను కలిసిన గోరేటి వెంకన్న

Telugu Andhra Pradesh, Cm Kcr Delhi, Covid Vaccine, Gold Rates, Goreti Venkanna,

తెలంగాణ గవర్నర్ తమిళ సై ను ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు.

4.భద్రాద్రి జిల్లాలో పులి సంచారం

భద్రాద్రి జిల్లాలోని మణుగూరు సింగరేణి ఓసి 2 అటవీ ప్రాంతంలో పులి సంచరించడం కలకలం రేపుతోంది.గని దగ్గర నీళ్లు తాగే ఎందుకు వచ్చినట్లు సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పేర్కొన్నారు.

5.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 721 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.నారాయణపేట జిల్లాలో భూకంపం

తెలంగాణలోని నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని జాజాపూర్ , సింగారం, ఉట్కుర్ మండల వ్యాప్తంగా  ఉదయం భూకంపం వచ్చింది.ఉదయం 9.40 నుంచి 9.50 గంటల మధ్యలో భూమి కంపించింది.

7.‘గుడికో గోమాత ‘ప్రారంభం

Telugu Andhra Pradesh, Cm Kcr Delhi, Covid Vaccine, Gold Rates, Goreti Venkanna,

తెలంగాణలో గురువారం గుడికో గోమాత కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించనుంది.

8.14 నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో ఈనెల 14వ తేదీ నుంచి యథాతథంగా రిజిస్ట్రేషన్ ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది.పాత సాఫ్ట్ వేర్ ద్వారానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.

9.రేపు ఢిల్లీకి కేసీఆర్

Telugu Andhra Pradesh, Cm Kcr Delhi, Covid Vaccine, Gold Rates, Goreti Venkanna,

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్ల బోతున్నారు.మూడు రోజులపాటు అక్కడే ఉండ బోతున్నట్లు తెలుస్తుంది.ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ని ఆయన కలిసే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

10.రేపు ప్రైవేటు ఆస్పత్రులు దేశ వ్యాప్త బంద్

ప్రైవేటు ఆసుపత్రులు ఈనెల 11వ తేదీన బంద్ పాటించి పోతున్నాయి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలు నిలిపి చేయబోతున్నారు.ఐఎమ్ ఏ పిలుపు మేరకు ఈ బంద్ పాటిస్తున్నారు.

11.ప్రత్యేక రైళ్ల వేళల్లో మార్పులు

రైల్వే శాఖ నడుపుతున్న కొన్ని ప్రత్యేక రైళ్లలో తేదీలు బయలుదేరే సమయం చేరుకునే సమయంలో మార్పులు చేర్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.ఆయా రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను కొనసాగించాలని రైల్వే శాఖ సూచించింది.

12.విషమంగా బెంగాల్ మాజీ సీఎం ఆరోగ్యం

Telugu Andhra Pradesh, Cm Kcr Delhi, Covid Vaccine, Gold Rates, Goreti Venkanna,

సిపిఎం సీనియర్ నాయకుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.ఆయనను కోల్కకత లోని ఉడ్ లాండ్ ఆసుపత్రికి తరలించారు.

13.మెంటల్ ఫిట్నెస్ కోసం స్పెషల్ యాప్

Telugu Andhra Pradesh, Cm Kcr Delhi, Covid Vaccine, Gold Rates, Goreti Venkanna,

క్రీడాకారులకు మానసిక ఒత్తిడిని తగ్గించే నిమిత్తం ” ధ్యాన ఫర్ స్పోర్ట్స్ ” యాప్ ను ప్రత్యేకంగా రూపొందించారు.దీంట్లో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మెంటల్ ఫిట్ నెస్ ట్రైనర్ గా మారి సూచనలు ఇవ్వబోతున్నారు.

14.కొత్త పార్లమెంటుకు పునాది రాయి

దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భూమి పూజ చేయబోతున్నారు.

15.’ జగనన్న జీవ క్రాంతి ‘

Telugu Andhra Pradesh, Cm Kcr Delhi, Covid Vaccine, Gold Rates, Goreti Venkanna,

ఏపీ సీఎం జగన్ గురువారం జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించబోతున్నారు.ఈ పథకంలో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న బీసీ,  ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో గొర్రెలు, మేకలు యూనిట్లను పంపిణీ చేస్తారు.

16.వైఫై బూత్ లు

దేశం లో పబ్లిక్ ఇంటర్నెట్ ను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం పబ్లిక్ డేటా ఆఫీస్ (పీ డి వో) ల ద్వారా పబ్లిక్ వైఫై నెట్వర్క్ లను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

17.తొలి ఎం ఆర్ ఎన్ ఏ వ్యాక్సిన్ పరీక్షలకు రెడీ

Covid-19 కట్టడి కోసం దేశీయంగా తొలిసారి మెసెంజర్ ఆర్ ఎన్ ఏ సాంకేతికత ఆధారంగా వ్యాక్సిన్ అభివృద్ధికి బీజం పడింది తొలి రెండు దశల క్లినికల్ పరీక్షల ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

18.15వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన

వ్యవసాయ సంస్కరణలు బిల్లుకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు నేటికి 15 రోజుకు చేరాయి.

19.రోజుకు 10 లక్షల కరోనా టీకాలు

Telugu Andhra Pradesh, Cm Kcr Delhi, Covid Vaccine, Gold Rates, Goreti Venkanna,

ఒకే రోజు పది లక్షల మందికి కరోనా వైరస్ టీకాను పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అపోలో హాస్పిటల్స్ ఎండి సునీత రెడ్డి తెలిపారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,900 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,070

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube