న్యూస్ రౌండ్ టాప్ 20

1.మంత్రులు కార్పొరేటర్ లతో కేటీఆర్ సమీక్ష

Telugu Ap Telangana, Corona India, Gold Rates, Jagan, Ktr Ministers, Pcc, Highli

కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

 Top News Roundup, Today Highlights, Ap And Telangana News, Gold Rates, Jagan, Kt-TeluguStop.com

2.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణలో మొత్తం 622 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కరోనా ప్రభావం తో ఇద్దరు మృతి చెందారు.

3.‘అమరావతి రాజధాని విషాదం

‘అమరావతి రాజధాని విషాదం ‘ పేరుతో డాక్యుమెంటరీని పరకాల ప్రభాకర్ ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు.

4.  అమరావతి రాజధాని రైతుల నిరసనలు

అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఆదివారం నాటికి అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 355 రోజుకు చేరింది.

5.టిడిపి సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా పంతగాని

తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అంత గాని నరసింహ ప్రసాద్ ని నియమించినట్లు టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు ప్రకటించారు.

6.మార్చి 31 వరకు పాఠశాలల బంద్

Telugu Ap Telangana, Corona India, Gold Rates, Jagan, Ktr Ministers, Pcc, Highli

కరోనా వైరస్ ప్రభావం తో మార్చి 31 వరకు ఒకటి నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలు మూసివేయనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.

7.మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరగగా, ఐదుగురు మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు.వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

8.జగన్ కు జై కొట్టిన ఆర్ నారాయణ మూర్తి

ఏపీ సీఎం జగన్ మంచి పనులు చేస్తున్నారని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు.తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా జగన్ కు మద్దతు పలుకుతున్నాను అని ప్రకటించారు.

9.అంబేద్కర్ కు జగన్ నివాళి

Telugu Ap Telangana, Corona India, Gold Rates, Jagan, Ktr Ministers, Pcc, Highli

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఆదివారం సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయం లో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

10.నక్సల్స్ పేరుతో గుంటూరులో దోపిడి

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుర్తు కొండ అడ్డ రోడ్ లో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ పై నక్సల్స్ పేరుతో ముగ్గురు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు.

నక్సల్స్ డ్రెస్ లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి 35,000 దోచుకుపోయారు.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

11.భారత్ లో కరోనా

Telugu Ap Telangana, Corona India, Gold Rates, Jagan, Ktr Ministers, Pcc, Highli

గడచిన 24 గంటలు దేశంలో కొత్తగా 36,011 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

12.రైతుల ఆందోళన కు ఐరాస మద్దతు

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు ఐక్యరాజ్యసమితి మద్దతు తెలిపింది.శాంతియుతంగా ప్రదర్శన చేసే హక్కు రైతులకు ఉందని, వారి ఆందోళన కు అడ్డుతగలడం సరి కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి జూరిక్ పేర్కొన్నారు.

13.భారత్ బంద్ కు టిఆర్ఎస్ మద్దతు

Telugu Ap Telangana, Corona India, Gold Rates, Jagan, Ktr Ministers, Pcc, Highli

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

14.బ్రిటన్ రాణికి కోవిడ్ వాక్సిన్

బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కొన్ని రోజుల్లో వైజర్ అభివృద్ధి చేసిన కరోనా టీకా తీసుకోబోతున్నట్లు సమాచారం.

15.కాంగ్రెస్ కు విజయశాంతి రాజీనామా ?

Telugu Ap Telangana, Corona India, Gold Rates, Jagan, Ktr Ministers, Pcc, Highli

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఆమె రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరుతున్నట్లు సమాచారం.

16.పిసిసి అధ్యక్ష పదవి

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిని ఎవరితో భర్తీ చేయాలనే విషయంలో అధిష్టానం గందరగోళానికి గురవుతున్నట్టు సమాచారం.

17.సిద్దిపేటకు కెసిఆర్

ఈ నెల పదో తేదీ సిద్దిపేట నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిమిత్తం తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.

18.600 మెగాపిక్సల్ కెమెరాతో సాంసంగ్

టెక్ దిగ్గజం సామ్సంగ్ 600 మెగా పిక్సెల్ కెమెరా అభివృద్ధి చేసినట్లు టిప్ స్టర్ ఐస్ యూనివర్స్ పేర్కొంది.

19.కరోనా టీకా కు అనుమతి కోరుతూ

Telugu Ap Telangana, Corona India, Gold Rates, Jagan, Ktr Ministers, Pcc, Highli

Covid-19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ‘ భారత ఔషధ నియంత్రణ జనరల్ ‘ ను అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ కోరింది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Corona India, Gold Rates, Jagan, Ktr Ministers, Pcc, Highli

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,910 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,070

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube