న్యూస్ రౌండప్ టాప్ 20

1.మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Telugu Amaravatimaha, Amma Vodi, Andhrapradesh, Ap Telangana, Cm Roshaiah, Kavit

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ రోజు హైదరాబాదులో మృతిచెందడంతో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది .ఇక ఈ నెల 4 5 6 తేదీల్లో సంతాప దినాలుగా పాటించాలని తెలంగాణ , ఏపీ  ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.ఏపీకి మళ్లీ భారీ వర్షాలు

ఏపీకి మూడు రోజులపాటు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

3.ఉత్తరాంధ్ర కు తప్పిన తుఫాన్ ముప్పు

జవాద్ తుఫాన్ ముప్పు ఆంధ్రప్రదేశ్ కు  చెప్పినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

4.రోశయ్య కుమారుడికి రాహుల్ గాంధీ ఫోన్

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం రోశయ్య మృతి పై ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ మేరకు ఓ సి కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు.

5.రోశయ్య మృతిపై ప్రధాని సంతాపం

Telugu Amaravatimaha, Amma Vodi, Andhrapradesh, Ap Telangana, Cm Roshaiah, Kavit

సీనియర్ రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.

6.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యటన

హైదరాబాద్ లో నేడు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పర్యటిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ వీడియో సెంటర్ సదస్సులో ఆయన పాల్గొంటున్నారు.

7.నేడు బీజేపీ కార్యవర్గ సమావేశం

నేడు విజయవాడలో బీజేపీ కార్యవర్గ సమావేశం భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

8.అమరావతి మహా పాదయాత్ర

Telugu Amaravatimaha, Amma Vodi, Andhrapradesh, Ap Telangana, Cm Roshaiah, Kavit

అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేడు నెల్లూరు జిల్లా సైదాపురం నుంచి ప్రారంభమైంది.ఈ యాత్ర నేటికి 34 రోజులు పూర్తి చేసుకుంది.

9.నేడు బిసి సీఐ సర్వసభ్య సమావేశం

నేడు బిసి సర్వసభ్య సమావేశం జరగనుంది.ఒమీక్రాన్ కేసుల దృష్ట్యా, భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన పై నేడు స్పష్టత రానుంది.

10.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.శుక్రవారం 23,220 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

11.ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు

ఉపకార వేతనాల దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది.ఈ నెల 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.

12.ధాన్యం కొనుగోళ్లపై ధర్మాగ్రహ దీక్ష

దాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పై నిరసన తెలియజేసేందుకు ఈనెల తొమ్మిదో తేదీన ధర్మాగ్రహ దీక్ష చేపట్టాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి.

13.మహిళలకు సేఫ్టీ జాకెట్ .ఆవిష్కరించిన కవిత

Telugu Amaravatimaha, Amma Vodi, Andhrapradesh, Ap Telangana, Cm Roshaiah, Kavit

మహిళల రక్షణ కోసం కొంతమంది యువకులు రూపొందించిన ‘ అభయ కోట్ ‘ ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.

14.రంగారెడ్డి జిల్లాలో వ్యక్తిపై చిరుత దాడి

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అనుమాన్ పల్లి అటవీ ప్రాంతంలో ఎల్లయ్య అనే వ్యక్తిపై చిరుతపులి దాడి చేసి గాయపరిచింది.

15.డిగ్రీ పరీక్షల్లో 21 మంది డిబార్

నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలో జరిగిన డిగ్రీ పరీక్షల్లో ఇరవై ఒక్క మంది డిబార్ అయినట్లు పరీక్షల నిర్వహణాధికారి సి ఎస్ సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు.

16.రఘురామకృష్ణరాజు పై రాజమండ్రి ఎంపీ విమర్శలు

Telugu Amaravatimaha, Amma Vodi, Andhrapradesh, Ap Telangana, Cm Roshaiah, Kavit

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ  తో కుమ్మక్కయ్యారని రాజమండ్రి ఎంపీ మార్గాన్ని  భరత్ విమర్శించారు.

17.బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ ప్రతిపాదన లేదు

బిఎస్ఎన్ఎల్ ను ప్రవేటీకరించే  ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర కమ్యూనికేషన్ ల శాఖ సహాయ మంత్రి దేవు సింగ్ చౌహాన్ వెల్లడించారు.

18.పోర్టులకు కేంద్ర సహాయం అందించ లేదు : కేంద్రం

పోర్టులకు కేంద్ర సహాయం అందించ లేదని వైసీపీ ఎంపీ లోక్ సభ లో అడిగిన ప్రశ్న కు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్భా నంద సోనోవాల్  తెలిపారు.

19.దేశమంతటా అమ్మ ఒడి

Telugu Amaravatimaha, Amma Vodi, Andhrapradesh, Ap Telangana, Cm Roshaiah, Kavit

ఏపీలో అమలు చేస్తున్న అమ్మ వడి పథకాన్ని దేశమంతట అమలు చేసే విధంగా బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు సవరణ 2020 పేరుతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,750

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,820

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube