న్యూస్ రౌండప్ టాప్ 20

1.అనాధల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం

Telugu Actress Sharada, Ap Telangana, Cm Kejriwal, Corona, Revanth Reddy, Rrr, T

తెలంగాణలో అనాధలు అనాధాశ్రమాలు పోవడంవల్ల అనాధలైన వారి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఈ మేరకు సీఎం కేసీఆర్ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వమే తల్లిదండ్రులు గా మారి అనాధల సంరక్షణ , సంక్షేమం , భవిష్యత్ బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

 Ap And Telangana Breaking News, Telangana Headlines, News Roundup, Top20news, Te-TeluguStop.com

2.గిఫ్ట్ ఏ స్మైల్ : త్రిచక్ర వాహనాలు పంపిణీ చేసిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా,  అనేకమందికి మంత్రులు , ఎంపీలు ఎమ్మెల్సీలు,  ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రకటించిన దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ లో కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కొంతమందికి ద్విచక్ర వాహనాలను అందించారు.

3.నెహ్రూ పేరుతో చిల్డ్రన్స్ డే జరపొద్దు

కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ విజ్ఞప్తి చేశారు.నవంబర్ 14న జవహర్లాల్ నెహ్రూ పేరుతో చిల్డ్రన్స్ డే జరుపు వద్దని ఆయన కోరారు.

4.నిరాశ్రయులకు కొత్త పథకం ప్రారంభించిన కేజ్రీవాల్

Telugu Actress Sharada, Ap Telangana, Cm Kejriwal, Corona, Revanth Reddy, Rrr, T

దేశ రాజధాని ఢిల్లీలో నిరాశ్రయులకు కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు.ఇల్లు లేని నిరుపేదల కోసం నడుపుతున్న నైట్ షెల్టర్ లలో తలదాచుకునే వారి కోసం ఆహార పథకాన్ని ఆయన ప్రారంభించారు.

5.విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు నోటీసుల

జగన్ అక్రమాస్తుల కేసులో ఏ 2 గా ఉన్న వైసీపీ ఎంపీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది.జగన్ , విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయమూర్తి సాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.

6.అమరావతి లో మూడు రాజధానుల కు అనుకూలంగా శిబిరం

అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఆదివారానికి 600 రోజుకు చేరిన సందర్భంగా ‘ న్యాయస్థానం నుంచి దేవస్థానం ‘ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు అయితే ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ మూడు రాజధానులకు అనుకూలంగా కొత్త ఏర్పాటయింది.

7.విశాఖలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన నిర్మల సీతారామన్

Telugu Actress Sharada, Ap Telangana, Cm Kejriwal, Corona, Revanth Reddy, Rrr, T

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రెండోరోజు ఆదివారం ఉదయం విశాఖ లోని చిన వాల్తేర్ లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు.

8.రేపు రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ స్కీమ్ సొమ్ము

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పి ఎం కిసాన్) స్కీమ్ 9 వ విడత సొమ్మును రైతు ఖాతాలకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు విడుదల చేస్తారు.

9 టిటిడి చైర్మన్ గా మరోసారి వై వి సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వై వి సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు.ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

10.జడ్జీల పై అనుచిత పోస్టులు : ఐదుగురు అరెస్ట్

 ఏపీ హైకోర్టు జడ్జి ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సిబిఐ ఆదివారం అరెస్టు చేసింది.

11.దండోరా మోగించబోతున్నాం

Telugu Actress Sharada, Ap Telangana, Cm Kejriwal, Corona, Revanth Reddy, Rrr, T

ఇంద్రవెల్లి గడ్డమీద దండు కట్టి దళిత, గిరిజన దండోరా ముగించబోతున్నాము అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

12.ప్రధానికి మమత లేఖ

విద్యుత్ సవరణ బిల్లు 2020 పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తీరును వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు.

‘ తాడేపల్లి ‘ అత్యాచారం కేసులో నిందితుల అరెస్ట్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం లో యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు కృష్ణ కిషోర్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

14.జమ్ము కాశ్మీర్ లో 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

ఉగ్రవాద నిధులు కేసుకు సంబంధించి జమ్మూకాశ్మీర్లోని అనంత నాథ్ జిల్లాలోని 45 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ ) సోదాలు చేపట్టింది.

17.నేను బాగానే ఉన్నాను : శారద

Telugu Actress Sharada, Ap Telangana, Cm Kejriwal, Corona, Revanth Reddy, Rrr, T

నటి శారద అనారోగ్యానికి గురయ్యారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం పై ఆమె స్పందించారు తాను ఆరోగ్యంగానే ఉన్నాను అని , నాపై వస్తున్న తప్పుడు వార్తలు అవాస్తవమని ఆమె తెలిపారు.

18.జారిపడ్డ మందకృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కు స్వల్ప గాయాలయ్యాయి.ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఉన్న ఆయన హోటల్ గదిలోని బాత్ రూమ్ లో జారి పడటంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి.వెంటనే ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

19.ఎన్టీఆర్ కు గాయం : క్లారిటీ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం

Telugu Actress Sharada, Ap Telangana, Cm Kejriwal, Corona, Revanth Reddy, Rrr, T

ఆర్ ఆర్ ఆర్ షూటింగులు ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి అని వస్తున్న ప్రచారంపై ఆ చిత్ర యూనిట్ స్పందించింది.ఇది కేవలం మేకప్ అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Actress Sharada, Ap Telangana, Cm Kejriwal, Corona, Revanth Reddy, Rrr, T

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,690

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,690

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube