న్యూస్ రౌండప్ టాప్ - 20

1.ఉచిత విద్యుత్ కోసం పేర్లు ఇవ్వండి

Telugu Corona, Telangana, Pv Sindhu, Rotavac, Srikakulam, Telugu, Todays Gold, T

సెలున్స్, లాండ్రీల షాప్ ల వారు ఉచిత విద్యుత్ కోసం తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు.

 Ap And Telangana Breaking News, Telangana Headlines, News Roundup, Top20news, Te-TeluguStop.com

2.రేపు దోస్త్ తొలి దశ సీట్ల కేటాయింపు

దోస్త్ మొదటి దశ సీట్ల కేటాయింపు ఆగస్టు 4న జరగనుంది.దీనికి సంబంధించిన ప్రక్రియను దాదాపు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

3.విద్యుత్ బిల్లు పెడితే సమ్మె చేస్తాం

విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెడితే దేశవ్యాప్తంగా మెరుపు సమ్మెకు దిగుతామని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ కేంద్రాన్ని హెచ్చరించింది.

4.బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర ఈనెల 24 కు వాయిదా పడింది.

5.ఈటెల రాజేందర్ కు మోకాలు ఆపరేషన్

ఇటీవల పాదయాత్ర నిర్వహిస్తూ అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ మోకాలి నొప్పితో బాధపడుతుండటంతో ఆయనకు సోమవారం ఆర్తో స్కోపీ శస్త్ర చికిత్స నిర్వహించారు.

6.జూనియర్ కాలేజీలో లెక్చరర్ పోస్టులకు నేడు దరఖాస్తులు

తెలంగాణలో మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీ లో అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈమేరకు అవుట్ సోర్సింగ్ మ్యాన్పవర్ ఏజెన్సీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

7.వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ డబ్ల్యూ ఎస్ కోటా

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్థిక బలహీన వర్గాల కోటాను ఈ ఏడాది సైతం అమలు చేస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు.అర్హులైన విద్యార్థులు ప్రవేశాల కోసం వివరాలు అందించాలని సూచించారు.

8.పీవీ సింధుకు నగదు ప్రోత్సాహం

Telugu Corona, Telangana, Pv Sindhu, Rotavac, Srikakulam, Telugu, Todays Gold, T

టోక్యో ఒలంపిక్స్ బ్యాట్మెంటన్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన ఏపీకి చెందిన పీవీ సింధుకు నగదు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.

9.దళిత బంధు కు యాప్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న దళిత బంధు పథకం కోసం వెబ్ పోర్టల్, యాప్ ను రూపొందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

10.విద్యుత్ సంస్థల పై విచారణ వాయిదా

పవన సౌర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన అఖిల పై విచారణను ఏపీ హైకోర్టు ఆగస్టు 9కి వాయిదా వేసింది.

11.ఆనందయ్య ముందుకు’ ఆయుష్ ‘అంగీకారం

Telugu Corona, Telangana, Pv Sindhu, Rotavac, Srikakulam, Telugu, Todays Gold, T

ఆనంద తయారు చేసిన మందును కరోనా చికిత్సలు ఉపయోగించేందుకు రాష్ట్ర ఆయుష్ శాఖ అంగీకారం తెలిపిందని ఆనందయ్య తరపు న్యాయవాది అశ్విని కుమార్ తెలిపారు.

12.పోలీసుల కస్టడీలో ఆఫ్రికన్ మృతి

డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన ఆఫ్రికన్ పౌరుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు.దీంతో పెద్ద సంఖ్యలో ఆఫ్రికన్ పౌరులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు అయితే మృతుడి వివరాలు పోలీసులు వెల్లడించలేదు.

13.శ్రీకాకుళం నెల్లూరు కార్పొరేషన్లకు ఎన్నికలు

ఏపీలో ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన శ్రీకాకుళం, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లతోపాటు పదకొండు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇబ్బందులు లేవని అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో సాంకేతికంగా ఇబ్బందులు లేని చోట ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు.

14.తమిళనాడు కేరళ ప్రయాణికులకు ఆర్ టిపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి

కరోనా మూడో దశ ప్రారంభం అయిన నేపథ్యంలో తమిళనాడు కేరళ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ప్రయాణీకులు తప్పనిసరిగా ఆర్ టి పి సి ఆర్ పరీక్షల రిపోర్ట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని విజయవాడ డి ఆర్ ఎం తెలిపారు.

15.భారత్ బయోటెక్ టికాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం

Telugu Corona, Telangana, Pv Sindhu, Rotavac, Srikakulam, Telugu, Todays Gold, T

ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తయారుచేసిన రోటా వాక్ – 5 డి కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది.

16.ఢిల్లీకి కి ఏపీ బిజేపి అధ్యక్షుడు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సందర్భంగా అనేకమంది కేంద్రమంత్రులను ఆయన కలిసి, ఏపీ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం.

17.సలార్ స్పెషల్ సాంగ్ లో కత్రినా

Telugu Corona, Telangana, Pv Sindhu, Rotavac, Srikakulam, Telugu, Todays Gold, T

ప్రభాస్, దర్శకుడు నీల్ శ్యామ్ దర్శకత్వంలో రాబోతున్న ‘ సలార్ ‘ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రీనా కైఫ్ నటించబోతున్నారు.

18.తెలంగాణలో ఎంసెట్

తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.

19.వైష్ణవ్ తేజ్ క్రిష్ సినిమాకు అమెజాన్ ఆఫర్

మెగా హీరో వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది.దీంతో ఈ సినిమాను డిజిటల్ రిలీజ్ చేయడం పై ఆలోచనలో ఉన్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Corona, Telangana, Pv Sindhu, Rotavac, Srikakulam, Telugu, Todays Gold, T

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,380

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,380

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube