న్యూస్ రౌండప్ టాప్ -  20

1.  దీక్ష విరమించిన షర్మిల

గత మూడు రోజులుగా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు తీరుతాయని ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని కోరుతూ వైయస్ షర్మిల చేపట్టిన నిరసన దీక్ష ను విరమించారు.

 P And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold R-TeluguStop.com

2.ట్రాన్స్ కో లో  అర్టిజన్లకు వైద్య సౌకర్యం

ట్రాన్స్కో లో పనిచేసే ఏ గ్రేడ్ 1, 2,3 ఆర్టిజన్ లతో పాటు , వారిపై ఆధారపడిన వారికి మెడికల్ రీయింబర్స్మెంట్ / క్రెడిట్ లెటర్ తో కూడిన వైద్య సౌకర్యం కల్పించాలని ట్రాన్స్ కో నిర్ణయించింది.

3.రోజుకు లక్షన్నర మంది కి వాక్సినేషన్

Telugu Corona India, Kamala Harris, Telangana, Gold, Top, Vivek-Latest News - Te

తెలంగాణలో రోజు లక్షలాది మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

4.హిందీ పండితుల టి ఆర్టి తుది జాబితా విడుదల

ఉపాధ్యాయ నియామక పరీక్ష 2017 నోటిఫికేషన్ కు సంబందించి హిందీ పండితుల తుది జాబితా సిద్ధం అయ్యింది.

5.నవోదయ పరీక్ష వాయిదా

నవోదయ విద్యాలయాల్లో 6 వ తరగతి లో చేరేందుకు నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్ష వాయిదా పడింది.

6.  జేఈఈ మెయిన్ పరీక్ష వాయిదా

Telugu Corona India, Kamala Harris, Telangana, Gold, Top, Vivek-Latest News - Te

దేశంలో కొవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది.  జేఈఈ మెయిన్ 2021 మూడో సెషన్ పరీక్షలు కూడా మరోసారి వాయిదా పడింది.

7.తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటల్లో కొత్తగా 5093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరీ దర్శనం రద్దు

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరి స్వామి దేవస్థానం లో భక్తుల ప్రవేశం నిలిపివేశారు.

9.క్షీణించిన మోత్కుపల్లి ఆరోగ్యం

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది ఇటీవల కరోనా పాజిటివ్ ప్రభావానికి గురైన సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్యం క్షీణించింది.

9.తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Telugu Corona India, Kamala Harris, Telangana, Gold, Top, Vivek-Latest News - Te

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.శనివారం శ్రీవారిని 30,0537 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

10.488 వ రోజుకి చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

విశాఖ ఉక్కు ప్రవేటికరణ కు వ్యతిరేకంగా , మూడు రాజధానుల కు వ్యతిరేకంగా రాజధాని రైతులు చేపట్టిన నిరసన దీక్షలు నేటికి 488వ రోజుకి చేరుకున్నాయి.

11.సీఎంవో అదనపు కార్యదర్శిగా ముత్యలరాజు

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ముత్యాల రాజుని సీఎంవో అదనపు కార్యదర్శిగా   నియమిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ కు రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ ఎండీ గా బాధ్యతలు అప్పగించారు.

12.కరోనా టీకా కారణంగానే వివేక్ మృతి

Telugu Corona India, Kamala Harris, Telangana, Gold, Top, Vivek-Latest News - Te

కరోనా టీకా కారణంగానే తమిళ హాస్య నటుడు వివేక్ మృతి చెందాడని, తమిళ నటుడు మన్ఫూర్ ఆలీఖాన్ మండిపడ్డారు.

13.భద్రాద్రి లో అన్ని పూజలు , సేవలు రద్దు

కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ నెల 19వ తేదీ నుంచి 30 వరకు అంతరాలయంలో జరిగే అన్ని పూజలు, సేవలను రద్దు చేస్తున్నట్టు రామాలయం ఈవో శివాజీ ప్రకటించారు.

14.కమలా హారీస్ ను చంపేస్తానని బెదిరించిన నర్స్ అరెస్ట్

Telugu Corona India, Kamala Harris, Telangana, Gold, Top, Vivek-Latest News - Te

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరిస్ ను చంపేస్తాను అని బెదిరించిన ఫ్లోరిడాకు చెందిన 39 ఏళ్ల నర్సుని పోలీసులు అరెస్ట్ చేశారు.

15.  భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

16.దేశంలో 92 రోజుల్లోనే 12 కోట్ల టీకాల పంపిణీ

కరోనా వైరస్ టీకా పంపిణీలో భారత్ మరో మైలు రాయిని చేరుకుంది.కేవలం 92 రోజుల్లో అత్యంత వేగంగా 12 కోట్ల వాక్సిన్ డోసుల పంపిణీ ని పూర్తి చేసుకుంది.

17.టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలి

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలి అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

18.ఖమ్మంలో బిజెపి జనసేన కలిసి పోటీ 

Telugu Corona India, Kamala Harris, Telangana, Gold, Top, Vivek-Latest News - Te

తెలంగాణ బిజెపి జనసేన మధ్య  పొత్తు కుదిరింది.ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.

19.ఒక్కరోజే కరోనాతో 1501 మంది మృతి 

కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది.నాలుగో రోజు దేశవ్యాప్తంగా 1501 మంది కరోనా తో మృతి చెందారు.

20.ఈ రోజు బంగారం ధరలు

Telugu Corona India, Kamala Harris, Telangana, Gold, Top, Vivek-Latest News - Te

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,010

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,010.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube