న్యూస్ రౌండప్ టాప్ 20

1.రేవంత్ ఓ లిల్లీపుట్: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Telugu Ap Telangana, Corona, Lokesh, Sonu Sood, Gold, Top-Latest News - Telugu

రాజకీయాల్లో రేవంత్ రెడ్డి లిల్లీపుట్ అని, కాంగ్రెస్ను బొంద పెట్టడానికి టిపిసిసి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు.
 

2.టిఆర్ఎస్ జిహెచ్ఎంసి రాంకీ సంస్థలకు ఎన్జీటీ నోటీస్ లు

  జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( ఎన్.జీ.టి ) విచారణ నిర్వహించింది.ఈ సందర్భంగా  టిఆర్ఎస్ జిహెచ్ఎంసి రాంకీ సంస్థలకు ఎన్జీటీ నోటీస్ లు జారీ చేసింది.
 

3.గణేష్ ఉత్సవాలు నిమజ్జనం పై హైకోర్టు ఆంక్షలు

  గణేష్ ఉత్సవాలు నిమజ్జనం పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆంక్షలు విధించింది.హుస్సేన్సాగర్లో ప్లాస్టర్-ఆఫ్-పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
 

4.తీన్మార్ మల్లన్న ను కస్టడీకి తీసుకున్న పోలీసులు

Telugu Ap Telangana, Corona, Lokesh, Sonu Sood, Gold, Top-Latest News - Telugu

  తీన్మార్ మల్లన్న ఆడియో చింతపండు నవీన్ ను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
 

5.ఈడీ విచారణకు హీరో రవితేజ

Telugu Ap Telangana, Corona, Lokesh, Sonu Sood, Gold, Top-Latest News - Telugu

  టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ,(ఈడి ) విచారణకు హీరో రవితేజ నేడు హాజరయ్యారు ఆయనతోపాటు ఆయన కార్ డ్రైవర్ శ్రీనివాస్ కూడా విచారణకు హాజరయ్యారు.
 

6.బైకుల పైనే తిరగండి: గ్రేటర్ మేయర్

  కార్లలో తిరిగితే ప్రజల ఇబ్బందులు తెలియడం లేదు.రోడ్లపై గుంతలు కనిపించడం లేదు.కార్ల లో కాకుండా ద్విచక్రవహనాలపై తిరగండి.గుంతలు తాగునీటి సమస్యలు గుర్తించి తక్షణం పరిష్కార చర్యలు చేపట్టండి అంటూ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.
 

7.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Corona, Lokesh, Sonu Sood, Gold, Top-Latest News - Telugu

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 22,949 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
 

8.హైదరాబాద్ నుంచి లండన్ నాన్ స్టాప్ సర్వీస్

  హైదరాబాద్ నుంచి లండన్ కు మొదటిసారి నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
   

9.డ్రోన్లతో వ్యాక్సిన్, ఔషధాల పంపిణీ

  ఆకాశమార్గాన ప్రజలకు ఔషధాల చేరవేసే విధానం నేటి నుంచి ప్రారంభం కానుంది.గ్రౌండ్ ను వినియోగించి కేకలు ఔషధాలను ప్రయోగాత్మకంగా పంపించే కార్యక్రమాన్ని వికారాబాద్ నుంచి ప్రారంభించనున్నారు.
 

10.వారం రోజుల్లో డైట్ సెట్ ఫలితాలు

డిప్లమో ఇన్ ఎలిమెంటరీ, డిప్లమో ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన డైట్సెట్ ఫలితాలను వారంరోజుల్లో ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు.
 

11.ఆర్టీసీ, రవాణా శాఖలో సంస్కరణలు

Telugu Ap Telangana, Corona, Lokesh, Sonu Sood, Gold, Top-Latest News - Telugu

  ఆర్టీసీ రవాణా శాఖ సంస్కరణలు చేపడతామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి అజయ్ తెలిపారు.
 

12.దళిత బంధు అమలు సాధ్యమేనా : రాహుల్

Telugu Ap Telangana, Corona, Lokesh, Sonu Sood, Gold, Top-Latest News - Telugu

  తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం అమలు సాధ్యమేనా అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను ఆరా తీశారు.
 

13.చిరుత మృతి

  గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు ఏళ్ళ వయసున్న చిరుతపులి చనిపోయిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని  మన్యంకొండ వద్ద చోటు చేసుకుంది.
   

14.పోలీసుల అదుపులో నారా లోకేష్

Telugu Ap Telangana, Corona, Lokesh, Sonu Sood, Gold, Top-Latest News - Telugu

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నరసరావుపేటకు చెందిన దంపతులు బైక్ పై వెళ్తున్న సమయంలో దుండగులు దాడి చేసి మహిళ పై సామూహిక అత్యాచారానికి దిగడంతో ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు లోకేష్ వెళ్తుండగా ఆ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుని లోకేష్ ను విజయవాడకు తరలించారు.
 

15.ఆసుపత్రి ని ప్రారంభించిన సోనుసూద్

Telugu Ap Telangana, Corona, Lokesh, Sonu Sood, Gold, Top-Latest News - Telugu

  విజయవాడ నగరంలో అంకుర ఆసుపత్రిని నటుడు సోనూసూద్ గురువారం ప్రారంభించారు.
 

16.కోడెల నివాసం వద్ద పోలీసుల ఆంక్షలు

  సత్తెనపల్లి లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నివాసం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.కోడెల ఇంటి సమీపంలో రోడ్లను మూసివేశారు.ఆయన కుమారుడు కోడెల శివరాం ను హౌస్ అరెస్ట్ చేశారు.
 

17.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 43,263 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

18.ఇకపై అరటాకు లోనే పార్సెళ్లు

Telugu Ap Telangana, Corona, Lokesh, Sonu Sood, Gold, Top-Latest News - Telugu

  చెన్నై నగరంలో ప్లాస్టిక్ నిషేధం అమలులో భాగంగా ఇకపై హోటళ్లు రెస్టారెంట్లలో అరిటాకులో పార్సిల్ కట్టాలని రెస్టారెంట్లకు కార్పొరేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
   

19.కేటీఆర్ కు చేదు అనుభవం

  వరద కష్టాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ప్రజలు ప్రశ్నించారు.వరద నీరు వెళ్ళిన తర్వాత వస్తే ఎలా అని నిలదీశారు .
   

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధరలు -46,000   22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధరలు -47,000  

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube