న్యూస్ రౌండప్ టాప్ 20

1.పట్టాలెక్కిన తేజస్ ఎక్స్ ప్రెస్

తేజస్ ఎక్స్ ప్రెస్ మళ్లీ పట్టాలెక్కింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ నడుపుతున్న ఈ తేజాస్ రైలు 2019 అక్టోబర్ లో ప్రారంభమైంది.ఆ తరువాత కరోనా ప్రభావం తో ఆగిపోగా, తిరిగి ఈ రోజు ప్రారంభమైంది.
 

2.అమితాబ్ ఇంటికి బాంబ్ బెదిరింపు

Telugu Amithabachhan, Andrauniversity, Ap Telangana, Hema, Maa, Naresh, Gold, To

  ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసంతో పాటు ముంబైలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.అయితే అది నకిలీ బెదిరింపు కాల్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది.
 

3.‘ మా ‘ అధ్యక్షుడు నరేష్ పై హేమ విమర్శలు

Telugu Amithabachhan, Andrauniversity, Ap Telangana, Hema, Maa, Naresh, Gold, To

  ‘మా ‘ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నటి హేమ ‘ మా ‘ అధ్యక్షుడు నరేష్ పై సంచలన విమర్శలు చేశారు.ఈ ఏడాది మా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని, ఎన్నికలు లేకుండానే నరేష్ ను అధ్యక్షుడిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని హేమ వ్యాఖ్యానించారు.5 కోట్ల నిధులలో 3 కోట్లు మాత్రమే నరేష్ ఇప్పటి వరకు ఖర్చు చేశారని, మిగతా సొమ్ములు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. 

4.పొందూరు లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

Telugu Amithabachhan, Andrauniversity, Ap Telangana, Hema, Maa, Naresh, Gold, To

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శ్రీకాకుళం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా పొందూరు లో నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్ లో ఆమె పాల్గొంటారు. 

5.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 17,936 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
 

6.ఓవర్సీస్ విద్యానిధి కి దరఖాస్తు గడువు పెంపు

Telugu Amithabachhan, Andrauniversity, Ap Telangana, Hema, Maa, Naresh, Gold, To

  అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఆగస్టు 30వ తేదీ వరకు పొడిగించారు.
 

7.14న టీఎస్ ఆర్ జె సి ప్రవేశ పరీక్ష

  తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ని 35 జూనియర్ కాలేజీల్లో 2021 22 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు ఈ నెల 14న పరీక్ష నిర్వహించనున్నారు.
 

8.ఈ నెల 13 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో

  హైదరాబాద్ హైటెక్ ఎగ్జిబిషన్ ను క్రేడాయ్ హైదరాబాద్ ఎడిషన్ ప్రాపర్టీ షో నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి.  ఈ షో ను మూడు రోజులపాటు నిర్వహించనున్నారు.ఇది 13వ తేదీన ప్రారంభం కానుంది.
 

9.భేటీ బచావో నిధులు మళ్లించ లేదు

  బేటీ బచావో బేటీ పడావో నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇతర పథకాల కోసం మళ్లించలేదు అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
  10.రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్

Telugu Amithabachhan, Andrauniversity, Ap Telangana, Hema, Maa, Naresh, Gold, To

  రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టు లో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.ఆక్సిజన్ అందక 23 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.
 

11.599 వ రోజుకి అమరావతి ఉద్యమం

  నేటి తో అమరావతి ఉద్యమం 599 వ  రోజుకి చేరుకుంది.
 

12.జాన్సన్ అండ్ జాన్సన్ టికాకు కేంద్రం అనుమతి

Telugu Amithabachhan, Andrauniversity, Ap Telangana, Hema, Maa, Naresh, Gold, To

  కరోనాకు అత్యవసర వినియోగానికి జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసిన సింగల్ డోస్ కరోనా వ్యాక్సిన్ టీకాకు కేంద్రం ఆమోదం తెలిపింది.
 

13.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 38,628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

14.ఎస్సీ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

  సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, ఇంటర్, ఐఐటి, మెడికల్ అకాడమీ లో అడ్మిషన్ల కోసం జూలై 29 న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను శుక్రవారం మంత్రి పినిపే విశ్వరూప్ విడుదల చేశారు.
 

15.డెల్టా వేరియంట్ వైరస్

Telugu Amithabachhan, Andrauniversity, Ap Telangana, Hema, Maa, Naresh, Gold, To

  మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో కరుణ డెల్టా వైరస్ విజృంభిస్తోంది.నాసిక్ జిల్లా కేంద్రం ఆసుపత్రిలో 30 డెల్టా వేరియంట్ వైరస్ కేసులు వెలుగు చూశాయి.
 

16.వివేకా హత్య కేసు

Telugu Amithabachhan, Andrauniversity, Ap Telangana, Hema, Maa, Naresh, Gold, To

  మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయ్యి, కడప కేంద్ర కారాగారం లో రిమాండ్ లో ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను సిబిఐ అధికారులు పది రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.
 

17.విశాఖ బీచ్ రోడ్ లో కరోనా ఆంక్షలు

  కరోనా థర్డ్ హెచ్చరికల నేపథ్యంలో శని ఆదివారాలతో పాటు , ప్రభుత్వ సెలవు రోజుల్లో బీచ్ రోడ్డు లో ప్రవేశం నిషేధిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ నగర పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ప్రకటించారు.
 

18.ఇంద్రకీలాద్రి పై పవిత్రోత్సవాలు

Telugu Amithabachhan, Andrauniversity, Ap Telangana, Hema, Maa, Naresh, Gold, To

  ఈనెల 21 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి.మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
 

19.ఆంధ్ర యూనివర్సిటీ లో ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు

  ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ 31.08.2021.
 

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Amithabachhan, Andrauniversity, Ap Telangana, Hema, Maa, Naresh, Gold, To

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,700   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,700

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube