న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఇందిరా గాంధీ ఫోటో షేర్ చేసిన పవన్

Telugu Ap Telangana, Ysvivekananda, Talsanisrinivas, Pawan, Krishnaiah, Tdp Shar

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఏ విధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగియడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఇందిరాగాంధీ ఫోటో తో ఉన్న న్యూస్ క్లిప్పింగ్ ను షేర్ చేశారు. 

2.అభిమానులకు రేవంత్ విజ్ఞప్తి

  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిమానులకు విజ్ఞప్తి చేశారు.ఈ నెల 8వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఎవరూ తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు రావద్దని తాను తిరుమల పర్యటనకు వెళుతున్న సందర్భంగా ఎవరికీ అందుబాటులో ఉండను అని ప్రకటించారు. 

3.యాదాద్రికి భారీగా భక్తులు

Telugu Ap Telangana, Ysvivekananda, Talsanisrinivas, Pawan, Krishnaiah, Tdp Shar

  కార్తీక మాసం ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రి లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. 

4.తమిళనాడులో భారీ వర్షాలు

నిన్నటి నుంచి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రధాన నగరాలు జలమయమయ్యాయి.చెన్నై లోని వందలాది కాలనీలు నీటమునిగాయి. 

5.నీటి లో తడుస్తూ స్టాలిన్ పర్యటన

Telugu Ap Telangana, Ysvivekananda, Talsanisrinivas, Pawan, Krishnaiah, Tdp Shar

  తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తడంతో నీటమునిగిన ప్రాంతాలను తమిళనాడు సీఎం స్టాలిన్ నీటి లో తడుస్తూ సందర్శించారు.ఈ సందర్భంగా వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 

6.వైఎస్ వివేకా హత్య కేసు

  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ కీలక ప్రకటన చేసింది.ఈ కేసులో నిందితుడు గజ్జల ఉమా శంకర్ రెడ్డి పాత్ర ఉందని, దీనికి తగిన ఆధారాలు ఉన్నాయని ప్రకటించింది. 

7.ఏపీకి భారీ వర్ష సూచన

Telugu Ap Telangana, Ysvivekananda, Talsanisrinivas, Pawan, Krishnaiah, Tdp Shar

   ఈనెల తొమ్మిదో తేదీన అల్పపీడనం  ఏర్పడుతుందని దాని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

8.మంత్రి తలసాని కుమార్ రెడ్డి పై కేసు నమోదు

  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ పై హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

9.భారత్ లో కరోనా

Telugu Ap Telangana, Ysvivekananda, Talsanisrinivas, Pawan, Krishnaiah, Tdp Shar

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,853 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

10.ఏపీలో ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

  ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో ప్రక్రియ ముగిసింది.ఇప్పటి వరకు నామినేషన్ల  పత్రాలను పరిశీలించిన అధికారులు సరైన ఫార్మేట్ లో లేని దరఖాస్తులను తిరస్కరించారు. 

11.కర్నూలు ఎయిర్ పోర్ట్ నిర్వహణపై సమీక్ష

Telugu Ap Telangana, Ysvivekananda, Talsanisrinivas, Pawan, Krishnaiah, Tdp Shar

  ఏపీ లోని కర్నూలు ఎయిర్ పోర్ట్ నిర్వహణ పై అధికారులు సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో ఎయిర్ పోర్ట్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్  మేనేజ్మెంట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. 

12.తెలంగాణలో పెరిగిన చలి గాలులు

  ఈశాన్య రాష్ట్రాల నుంచి చలిగాలులు వీస్తుండడంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో చలిగాలి ప్రభావం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

13.ఆర్.కృష్ణయ్య కు బెదిరింపు కాల్స్

Telugu Ap Telangana, Ysvivekananda, Talsanisrinivas, Pawan, Krishnaiah, Tdp Shar

  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బెదిరింపు కాల్స్ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వస్తున్నాయి.దీనిపై ఆయన తెలంగాణ డిజిపికి ఫిర్యాదు చేశారు. 

14.డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాలు సీజ్ చేయొద్దు : హైదరాబాద్ పోలీస్ కమిషనర్

  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాలను సీజ్ చేయవద్దు అంటూ  హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇకపై పోలీసులు ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వాహనాలను సీజ్ చేయవద్దని హైదరాబాద్ నగర కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కోరారు. 

15.ఢిల్లీ లో బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ

Telugu Ap Telangana, Ysvivekananda, Talsanisrinivas, Pawan, Krishnaiah, Tdp Shar

  ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నేడు జరుగుతోంది.ఈ భేటీలో త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. 

16.షర్మిల పాదయాత్ర

  వైయస్సార్ టిడిపి అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన  ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 19వ రోజుకు చేరుకుంది. 

17.ఈ నెల 15 నుంచి భవాని మండల దీక్షలు

Telugu Ap Telangana, Ysvivekananda, Talsanisrinivas, Pawan, Krishnaiah, Tdp Shar

  ఈ నెల 15 నుంచి భవానీల మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. 

18.మహా పాదయాత్రకు పోలీసుల ఆంక్షలు

  అమరావతి ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీసులు మహా పాదయాత్ర చేస్తున్న రైతుల వద్దకు వచ్చి 20 నిబంధనలు చదివి వినిపించారు. 

19.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Ysvivekananda, Talsanisrinivas, Pawan, Krishnaiah, Tdp Shar

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 35, 293 మంది భక్తులు దర్శించుకున్నారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,110   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,210

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube