న్యూస్ రౌండప్ టాప్ 20

1.భారత్ లో 5 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

Telugu Ap Telangana, Bandi Prakash, Chandrababu, Jedivv, Omicron, Shivaram, Tela

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమి క్రాన్ వైరస్ ప్రభావం ఇప్పుడు భారత్ లోనూ మొదలయ్యింది.ఇప్పటి వరకు ఐదు కేసులు అధికారికంగా నిర్ధారణ అయ్యాయి.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.మహా పాదయాత్రకు జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం

అమరావతి ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్రకు సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ సంఘీభావం ప్రకటించారు.

3.కేజీబీవీ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ

కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభమైంది.కేజీబీవీల్లో మొత్తం 958 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.

4.రోశయ్య అంతిమయాత్ర ప్రారంభం

Telugu Ap Telangana, Bandi Prakash, Chandrababu, Jedivv, Omicron, Shivaram, Tela

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అంతిమయాత్ర గాంధీ భవన్ నుంచి ప్రారంభమైంది.

5.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8895 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.ఒమిక్రాన్ వైరస్

Telugu Ap Telangana, Bandi Prakash, Chandrababu, Jedivv, Omicron, Shivaram, Tela

విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వారు తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని నిబంధన విధించారు.

7.తప్పిన తుఫాను ముప్పు

జవాద్ తుఫాన్ ముప్పు ఏపీకి తప్పింది.కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చినట్లే వచ్చి దిశ మార్చుకున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.

8.అమరావతి మహాపాదయాత్ర

Telugu Ap Telangana, Bandi Prakash, Chandrababu, Jedivv, Omicron, Shivaram, Tela

రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అని కోరుతూ అమరావతి ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేటికి 35వ రోజుకు చేరుకుంది.

9.11 న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 11న జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎంవి రమేష్ తెలిపారు.

10.బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్

బీఎస్సీ నర్సింగ్, పీబీబీ ఎస్సీ నర్సింగ్ , బీపీటి, బీఎస్సీ , ఎం ఎల్ టి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది.

11.బండ ప్రకాష్ రాజీనామా ఆమోదం

Telugu Ap Telangana, Bandi Prakash, Chandrababu, Jedivv, Omicron, Shivaram, Tela

రాజ్యసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాష్ రాజీనామా దానిని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమోదించారు.

12.సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం నేడు

రాయలసీమ నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ఈ రోజు విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు.

13.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Bandi Prakash, Chandrababu, Jedivv, Omicron, Shivaram, Tela

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 27,291 మంది భక్తులు దర్శించుకున్నారు.

14.జగన్ పై ఏపీ బీజేపీ విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ అధ్యక్షుడు  సోము వీర్రాజు సంచలన విమర్శలు చేశారు గతంలో చంద్రబాబు స్టిక్కర్ బాబు గా మారాడు.ఇప్పుడు జగన్ డబల్ స్టిక్కర్ సీఎం గా మారాడు అంటూ వీర్రాజు విమర్శించారు.

15.విశాఖలో కుంగిన భూమి

Telugu Ap Telangana, Bandi Prakash, Chandrababu, Jedivv, Omicron, Shivaram, Tela

విశాఖ లో ని ఆర్కే బీచ్ దగ్గర సముద్రం ఉన్నట్టుండి ముందుకు వచ్చింది.సముద్రం ముందుకు రావడంతో భూమి కోతకు గురైంది.చిల్డ్రన్ పార్క్ లో అడుగు మేర భూమి కుంగిపోయింది.

16.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

17.తెలంగాణలో కరోనా

Telugu Ap Telangana, Bandi Prakash, Chandrababu, Jedivv, Omicron, Shivaram, Tela

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.పెద్ద పులి సంచారం

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అటవీ గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

19.ప్రముఖ కన్నడ నటుడు శివరాం మృతి

Telugu Ap Telangana, Bandi Prakash, Chandrababu, Jedivv, Omicron, Shivaram, Tela

కన్నడ సినిమా నటుడు శివరాం శనివారం రాత్రి బెంగుళూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46, 510

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,510

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube