న్యూస్ రౌండప్ టాప్ 20 

1.ఇటీవల అరెస్ట్ ఆయిన టీడీపీ మాజీ మంత్రి

Telugu Ap Telangana, Corona, Delta, Etela Rajendar, Gandhi, Joel Shindani, Gold,

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కు బెయిల్ మంజూరైంది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.ఏపీ ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

  ప్రభుత్వ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా బయటకు లీక్ చేస్తున్నారని కారణాలతో పనిచేస్తున్న ముగ్గురు అధికారుల ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 

3.తెలంగాణ లో ప్రారంభమైన ఎంసెట్

Telugu Ap Telangana, Corona, Delta, Etela Rajendar, Gandhi, Joel Shindani, Gold,

  తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.మొదటి సెషన్ లో 28 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.
 

4.సి పి ఐ పోడు యాత్ర

  పోడు సాగు దారులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి సీపీఐ పోడు యాత్ర చేపట్టనుంది.
 

5.మెడికల్ ఆక్సిజన్, రెమ్డేసివర్ పై జిఎస్టి తగ్గింపు

  కరుణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని రకాల మందులు పరికరాలపై వస్తు సేవల పన్ను ( జిఎస్టి ) ని తగ్గించింది.జీఎస్టీ మండలి చేసిన సిఫారసుల మేరకు ఈ పన్ను ను 2.5 శాతంగా నిర్ధారించింది.
 

6.నిలకడగానే ఈటెల రాజేందర్ ఆరోగ్యం

Telugu Ap Telangana, Corona, Delta, Etela Rajendar, Gandhi, Joel Shindani, Gold,

  ఇటీవల పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురై హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటెల రాజేందర్ నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
 

7.గాంధీలో ఒపీ సేవలు ప్రారంభం

  గాంధీ ఆసుపత్రిలో మంగళవారం నుంచి మళ్లీ నాన్ కోవిడ్ సేవలు మొదలయ్యాయి.
 

8.డెల్టా వైరస్

  తమిళనాడు లో డెల్టా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.ఇప్పటి వరకు రాష్ట్రంలో 32 కేసులు నమోదు కాగా, 10 డెల్టా ప్లస్ సోకినట్టు అధికారులు తెలిపారు.
 

9.ఏపీ కి చేరుకున్న 2.04 లక్షల కొవిడ్ టీకా డొసులు

Telugu Ap Telangana, Corona, Delta, Etela Rajendar, Gandhi, Joel Shindani, Gold,

  ఏపీకి మరో 2.04 కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి.గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కొవిషీల్డ్ టీకా డోసులను రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వాక్సిన్ ను అధికారులు తరలించారు.
 

10.గురుకుల డిగ్రీ విద్యార్థులకు కరోనా

  తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని జ్యోతి బాపులే బీసీ సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ సోకింది.
 

11.సెప్టెంబర్ 15 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ

  ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ను ఏపీ లో సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు మంగళవారం తెలిపింది.
 

12.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Corona, Delta, Etela Rajendar, Gandhi, Joel Shindani, Gold,

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కొనసాగుతోంది మంగళవారం తిరుమల శ్రీవారిని 20,421 మంది భక్తులు దర్శించుకున్నారు.
 

13.25న పద్మావతి వర్సిటీ 18వ స్నాతకోత్సవం

  తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 18 స్నాతకోత్సవానికి ఈ నెల 25న నిర్వహించనున్నారు.
 

14.పెరిగిన ఎండ తీవ్రత

  నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.ఈ కారణంగా ఎండ తీవ్రత పెరిగింది.మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5 డిగ్రీలు అధికంగా నమోదయింది.విశాఖ విమానాశ్రయంలో 37.6 డిగ్రీలుగా నమోదైంది.
 

15.తెలంగాణలో పంపిణీ కాళీ ఆహార ధాన్యాలు

  ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేటాయించిన ఆహారధాన్యాలను తెలంగాణ పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు.
 

16.వైఎస్ వివేకా హత్య కేసు

Telugu Ap Telangana, Corona, Delta, Etela Rajendar, Gandhi, Joel Shindani, Gold,

  మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ 59వ రోజు కొనసాగింది.సిబిఐ అధికారులు కీలక అనుమానితుడు సుశీల్ కుమార్ యాదవ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
 

17.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 42,625 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

18.కర్ణాటక లో 2 లక్షల మంది విదేశీయులు

  కర్ణాటకలో అధికారికంగా నో అక్రమంగా నూ దాదాపు రెండు లక్షల మంది విదేశీయులు ఉన్నట్లు పోలీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 

19.ఆఫ్రికన్ మృతి కేసులో సిఐడి దర్యాప్తు ప్రారంభం

  కర్ణాటకలోని హెబ్బాళ్ నియోజకవర్గంలోని జేసీ నగర్ పోలీసుల కస్టడీలో కాంగో దేశ నివాసి జోయల్ షిందాని (27) మృతిచెందిన ఘటన పై సిఐడి దర్యాప్తు ప్రారంభమైంది.
 

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Corona, Delta, Etela Rajendar, Gandhi, Joel Shindani, Gold,

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,950   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,950.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube