న్యూస్ రౌండప్ టాప్ 20

1.హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ రేపే

Telugu Ap Telangana, Bjpmla, Mota, Gold, Top-Latest News - Telugu

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ శనివారం జరుగనుంది.పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

2.నదుల అనుసంధానంపై ఈ రోజు సమావేశం

  గోదావరి కావేరీ నదుల అనుసంధానం పై ఈరోజు హైదరాబాద్ లో సమావేశం జరగనుంది.జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండో సంప్రదింపుల కమిటీ సమావేశంలో 8 రాష్ట్రల అధికారులు పాల్గొనబోతున్నారు. 

3.ఘనంగా 34 పాసింగ్ అవుట్ పెరేడ్

Telugu Ap Telangana, Bjpmla, Mota, Gold, Top-Latest News - Telugu

  హైదరాబాద్ లోని హకీంపేట్ లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ లో ఘనంగా 34 పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది. 

4.దుబ్బాక ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

  దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ను గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

5.ఆదివారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

Telugu Ap Telangana, Bjpmla, Mota, Gold, Top-Latest News - Telugu

  తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ను ఈనెల 31 న ఆదివారం కూడా నిర్వహిస్తున్నట్లు  డీఐఈ వో వడ్డెన్న తెలిపారు. 

6.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 27, 216 మంది భక్తులు దర్శించుకున్నారు. 

7.షర్మిల పాదయాత్ర

Telugu Ap Telangana, Bjpmla, Mota, Gold, Top-Latest News - Telugu

  షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పదో రోజుకి చేరుకుంది. 

8.ఏపీ హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్

  ఏపీ హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.రాజధాని రైతులు మహా పాదయాత్ర కు అనుమతి కోరుతూ న్యాయవాది వి.వి.లక్ష్మీనారాయణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

9.ప్రశాంత్ కిషోర్ పై మాజీ ఎంపీ విమర్శలు

Telugu Ap Telangana, Bjpmla, Mota, Gold, Top-Latest News - Telugu

  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డబ్బు మనిషిని, ఆయనకు కాంగ్రెస్ గురించి ఏమి తెలుసని కేంద్ర మాజీ మంత్రి సీడబ్ల్యూసీ సభ్యుడు చింతామోహన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. 

10.కుప్పంలో ఫ్లెక్సీల వివాదం

  చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం ఏర్పడింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

లక్ష్మీపురం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు టిడిపి బ్యానర్లు చింపేశార .టిడిపి అధినేత చంద్రబాబు బస చేయనున్న ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద టిడిపి శ్రేణులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు చింపేసినట్టుగా టిడిపి ఆందోళన నిర్వహించింది. 

11.విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీకి జనసేన మద్దతు

Telugu Ap Telangana, Bjpmla, Mota, Gold, Top-Latest News - Telugu

  స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ కి జనసేన మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ తెలిపారు. 

12.4న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

  తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 4వ విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. 

13.అమర్ రాజా పై మధ్యంతర ఉత్తర్వులు పొడగింపు

Telugu Ap Telangana, Bjpmla, Mota, Gold, Top-Latest News - Telugu

  అమర రాజా బ్యాటరీస్ మూసివేతకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వుల అమలు నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. 

14.ఏపీ తెలంగాణలో డెల్టా ప్లస్

  తెలంగాణలోని హైదరాబాద్ లో రెండు , ఏపీలో ఏడుగురు లో డెల్టా వేరియంట్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. 

15.ఆర్.బి.ఐ గవర్నర్ గా మరో మూడేళ్లు శక్తికాంత్ దాస్

Telugu Ap Telangana, Bjpmla, Mota, Gold, Top-Latest News - Telugu

  భారతీయ రిజర్వు బ్యాంక్ ( ఆర్బీఐ ) గవర్నర్ శక్తికాంత్ దాస్ మరో మూడేళ్లు పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు .ఈ మేరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటి నిర్ణయం తీసుకుంది. 

16.ఫేస్ బుక్ మాతృ సంస్థ కొత్త పేరు ‘ మోటా ‘

  ‘ ఫేస్ బుక్ ‘ కంపెనీ పేరు మారింది.ఇకపై దాన్ని ‘ మోటా ‘ గా పిలవనున్నారు. 

17.టీడీపీ గుర్తింపు రద్దు చేయండి

Telugu Ap Telangana, Bjpmla, Mota, Gold, Top-Latest News - Telugu

  తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను వైసిపి పార్లమెంటరీ బృందం కోరింది. 

18.ఆ పాదయాత్ర కు అనుమతి లేదు

   ‘ న్యాయస్థానం నుంచి దేవస్థానానికి ‘ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు , విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని , ఈ పాదయాత్రకు అందుకే అనుమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 

19.రేపు వర్షాలు

Telugu Ap Telangana, Bjpmla, Mota, Gold, Top-Latest News - Telugu

  తెలంగాణలో శనివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,040   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,040. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube