న్యూస్ రౌండప్ టాప్ 20 

1.తీన్మార్ మల్లన్న కు 14 రోజుల రిమాండ్

Telugu Alapathy Raja, Ap Telangana, Pressurebay, Mallanna, Gold, Top, Ycp Achari

  తీన్మార్ మల్లన్న కు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
 

2.నాలుగు హైకోర్టులకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు

  దేశంలో నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తుల నియామకం జరిగింది.తెలంగాణ, కర్ణాటక, సిక్కిం గుజరాత్ లకు తాత్కాలిక న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు.
 

3.చార్మినార్ వద్ద బిజెపి సభ

Telugu Alapathy Raja, Ap Telangana, Pressurebay, Mallanna, Gold, Top, Ycp Achari

  చార్మినార్ వద్ద బిజెపి సభను ఏర్పాటు చేసింది.అయితే ఈ సభ చిత్రీకరణకు డ్రోన్ కెమెరా లకు అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

4.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కీలక నిర్ణయం

  టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు.ఈ కేసు ను మరింత వేగవంతం చేసే ఈ క్రమంలో ఇంటర్పోల్ సహాయం తీసుకోవాలని ఈడీ అధికారులు నిర్ణయించుకున్నారు.
 

5.కొత్త మెడికల్ కాలేజీల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

  తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం జాతీయ వైద్య మండలి శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది.
 

6.తెలంగాణలో పాఠశాలలో ప్రారంభానికి సర్వం సిద్ధం

Telugu Alapathy Raja, Ap Telangana, Pressurebay, Mallanna, Gold, Top, Ycp Achari

  సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణలో పాఠశాలల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
 

7.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతుంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 19,525 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
 

8.అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాలు

  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం లో డిగ్రీ , పీజీ కోర్సుల్లో చేరడానికి సెప్టెంబర్ 3 వరకు గడువును పొడిగించారు.
 

9.నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

Telugu Alapathy Raja, Ap Telangana, Pressurebay, Mallanna, Gold, Top, Ycp Achari

  ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో శనివారం ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
 

10.తెలంగాణలో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

11.సచివాలయ పదోన్నతి పై సమీక్ష

Telugu Alapathy Raja, Ap Telangana, Pressurebay, Mallanna, Gold, Top, Ycp Achari

  సచివాలయంలోని వివిధ శాఖల్లో 2014 జూన్ 2 తర్వాత కల్పించిన అన్ని పదోన్నతుల పై పూర్తిగా సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
 

12.రోడ్డుపై బైఠాయించిన వైసిపి కార్పొరేటర్

  గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల తీరుపై వైసిపి కార్పొరేటర్ ఆచారి నిరసన తెలియజేశారు.
 

13.మాజీ ఎమ్మెల్యే చింతమనేని పోలీసులకు మధ్య వాగ్వాదం

  పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.పెట్రోల్ ధరలను నిరసిస్తూ దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎడ్లబండిని నడిపారు.వీరిని పోలీసులు అడ్డుకోవడంతో చింతమనేని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
 

14.తెనాలిలో ఆలపాటి రాజా నిరసన దీక్ష

Telugu Alapathy Raja, Ap Telangana, Pressurebay, Mallanna, Gold, Top, Ycp Achari

  తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా నిరసన దీక్ష చేపట్టారు .పెరిగిన నిత్యావసర ధరలను వ్యతిరేకంగా ఆయన ఈ దీక్షకు దిగారు.
 

15.శ్రీకృష్ణ వేషధారణ పోటీలు

  కృష్ణాష్టమి ని పురస్కరించుకొని బ్రహ్మకుమారీల సేవ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 30న శ్రీకృష్ణుని వేష ధారణ పోటీలు నిర్వహిస్తున్నట్లు విజయనగరం కేంద్రం ఇంచార్జ్ శాంతి తెలిపారు.
 

16.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 46,759 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
 

17.ఐఎస్ – కె  పావురాల పై అమెరికా డ్రోన్ దాడులు

Telugu Alapathy Raja, Ap Telangana, Pressurebay, Mallanna, Gold, Top, Ycp Achari

  ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్ర ఘాతుకానికి  పాల్పడ్డ  ఐసిస్ మోకాళ్ళ పై ప్రతీకారం తీర్చుకుంటున్న అమెరికా అధ్యక్షుడు కొన్ని గంటల్లోనే ఆ దిశగా చర్యలు చేపట్టారు.ఆఫ్గాన్ లోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికా శనివారం ఉదయం దాడులు చేపట్టింది.ఈ దాడుల్లో కీలక సూత్రధారి మరణించినట్లు సమాచారం.
 

18.ఇంటి వద్దకే ఆర్టీసీ పార్సెల్

  ఆర్టీసీ పార్సిళ్లను ఇకపై ఇంటివద్దకే అందించే విధంగా మూడు ప్రధాన నగరాల్లో అమలు చేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
 

19.స్టేట్ మారినా రీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు

  వాహన రిజిస్ట్రేషన్ కు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తమ వ్యక్తిగత వాహనాలకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేకుండా , ‘బి హెచ్’ (భారత్ రిజిస్ట్రేషన్ ) విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది.
 

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Alapathy Raja, Ap Telangana, Pressurebay, Mallanna, Gold, Top, Ycp Achari

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,650   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,650

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube