న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణలో ఆంత్రాక్స్ కలకలం

Telugu Ap Telangana, Bonda Uma, Cm Jagan, Nampally, Pawan Kalyan, Rewanth, Sonia

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం, చాపండలో ఆంత్రాక్స్ కలకలం రేగింది.ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో నాలుగు గొర్రెలు మృతి చెందడంతో సమాచారం అందుకున్న అధికారులు దీనిపై పూర్తి విచారణ చేపట్టారు. 

2.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 27,544 మంది భక్తులు దర్శించుకున్నారు. 

3.భారత్ లో కరోనా

Telugu Ap Telangana, Bonda Uma, Cm Jagan, Nampally, Pawan Kalyan, Rewanth, Sonia

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,428 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

4.రేవంత్ రెడ్డి పై మూడు కేసుల కొట్టివేత

  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై మూడు వేరువేరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 

5.రేవంత్ ఆరోపణలు నిరాదారం

Telugu Ap Telangana, Bonda Uma, Cm Jagan, Nampally, Pawan Kalyan, Rewanth, Sonia

  డీజీపీ, మంత్రుల ఫోన్ టాపింగ్ తోపాటు, పోలీస్ శాఖలు గ్రూపిజం ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డిజిపి కార్యాలయం విడుదల చేసింది. 

6.కెటిఆర్ ఫ్రాన్స్ పర్యటన

  తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఐదు రోజుల పాటు ఫ్రాన్స్ పర్యటన నిమిత్తం వెళ్లనున్నారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

ఈనెల 29న ఫ్రాన్స్ సెనేట్ లో ఆంబిషన్ బిజినెస్ ఫార్మర్ సమావేశం జరిగనుంది.ఈ సమావేశం కేటీఆర్ పాల్గొంటారు. 

7.జమ్మికుంట సీఐ పై ఎన్నికల కమిషన్ చర్యలు

Telugu Ap Telangana, Bonda Uma, Cm Jagan, Nampally, Pawan Kalyan, Rewanth, Sonia

  కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రామచంద్ర రావు పై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది.   ఆయనపై అనేక ఫిర్యాదులు రావడంతో నే ఈ చర్యలు తీసుకున్నారు. 

8.ఆయుధాలను ప్రదర్శించిన పోలీసులు

  పోలీస్ అమరవీరుల సంస్మరణ జనం వారోత్సవాల సందర్భంగా విజయవాడలో ఓపెన్ హౌస్ పోలీస్ శాఖ లో ఉపయోగించే వివిధ ఆయుధాలను  ఏపీ పోలీసులు ప్రదర్శించారు. 

9.ఏపీ లో రేషన్ డీలర్ల ఆందోళన

Telugu Ap Telangana, Bonda Uma, Cm Jagan, Nampally, Pawan Kalyan, Rewanth, Sonia

  విజయవాడలో పౌరసరఫరాల శాఖ గోడౌన్ వద్ద రేషన్ డీలర్ల ఆందోళన చేపట్టారు.జీవో నెంబర్ 10 ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 

10.టిడిపి బోండా ఉమ పై కేసు నమోదు

  టిడిపి నేత బోండా ఉమా అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విజయవాడ మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. 

11.స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక సంఘాల ధర్నా

Telugu Ap Telangana, Bonda Uma, Cm Jagan, Nampally, Pawan Kalyan, Rewanth, Sonia

  విశాఖ స్టీల్ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 

12.వైఎస్సార్ రైతు భరోసా

  వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ రెండో విడత నిధులను ఏపీ సీఎం జగన్ ఈ రోజు విడుదల చేయనున్నారు. 

13.సిద్దిపేట కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలి : రేవంత్

Telugu Ap Telangana, Bonda Uma, Cm Jagan, Nampally, Pawan Kalyan, Rewanth, Sonia

  విత్తనాల షాపుల వాళ్లు వరి విత్తనం అమ్మితే సుప్రీంకోర్టు ఆర్డర్ తెచ్చుకున్న వదిలేది లేదని, సిద్దిపేట కలెక్టర్ బెదిరించడం ఏంటని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

14.పిసిసి అధ్యక్షులతో సోనియా భేటీ

Telugu Ap Telangana, Bonda Uma, Cm Jagan, Nampally, Pawan Kalyan, Rewanth, Sonia

  పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు,  రాష్ట్ర ఇన్చార్జ్ లతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. 

15.విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలు ప్రారంభం

  విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలు నేటి నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నారు. 

16.ఏపీలో రేషన్ షాపుల బంద్ నేటి నుంచి

  ఏపీ లో నేటి నుంచి రేషన్ దిగుమతి ని నిలిపివేస్తూ , షాపుల బంద్ నిర్వహిస్తున్నట్టు డీలర్ల సంఘం ప్రకటించింది. 

17.హుజూరాబాద్ ఎన్నికల పోలింగ్ సమయం పెంపు

Telugu Ap Telangana, Bonda Uma, Cm Jagan, Nampally, Pawan Kalyan, Rewanth, Sonia

  ఈ నెల 30 వ తేదీన హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.ఇక్కడ పోలింగ్ సమయాన్ని కూడా ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పెంచారు. 

18.టీటీడీ కళాశాలలో ఈ నెల 28న స్పాట్ అడ్మిషన్లు

  తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ని ఎస్వీ జూనియర్, పద్మావతి బాలికల జూనియర్ కళాశాలల్లో ఈ నెల 28న ఉదయం 9 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 

19.స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి జనసేన మద్దతు

Telugu Ap Telangana, Bonda Uma, Cm Jagan, Nampally, Pawan Kalyan, Rewanth, Sonia

  ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి జనసేన మద్దతు ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్మికులకు సంఘీభావం తెలపనున్నారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,770   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,770

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube