న్యూస్ రౌండప్ టాప్ 20

1.పాలిటెక్నిక్ కాలేజీలో కొండచిలువ

వరంగల్ జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలో కొండచిలువ కనిపించడం కలకలం రేపింది. 

2.రేవంత్ పై జగ్గారెడ్డి విమర్శలు.ఆరా తీసిన ఠాకూర్

  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన విమర్శలపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ఆరా తీశారు. 

3.కేటీఆర్ పై ఈటెల రాజేందర్ విమర్శలు

Telugu Ap Telangana, Jagan, Srivenkateswara, Telanagana, Gold, Top-Telugu Politi

  తెలంగాణ నీ అబ్బ  జాగీరు కాదు కేసీఆర్ అంటూ హుజురాబాద్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. 

4.మూతపడనున్న కొత్తపేట ఫ్రూట్ మార్కెట్

  కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ రేపటితో మూతపడనుంది.రేపు బాటసింగారం కి ఫ్రూట్ మార్కెట్ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

5.ఢిల్లీ టూర్ లో కేసీఆర్

Telugu Ap Telangana, Jagan, Srivenkateswara, Telanagana, Gold, Top-Telugu Politi

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లోనే ఉన్నారు.మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండబోతున్నట్టు టిఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. 

6.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 26,249 భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 

7.లక్ష మంది యువకులతో గీతా పారాయణం

Telugu Ap Telangana, Jagan, Srivenkateswara, Telanagana, Gold, Top-Telugu Politi

  డిసెంబర్ 14న గీత జయంతి సందర్భంగా 16 నుంచి 40 సంవత్సరాల వయసున్న లక్ష మంది యువకులతో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో భగవద్గీత పారాయణం ఉంటుందని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. 

8.లీగల్ సర్వీసెస్ వారోత్సవాలు

  అక్టోబర్ 8 నుంచి లీగల్ సర్వీసెస్ వారు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి రాధిక జైస్వాల్ తెలిపారు. 

9.పెరిగిన స్కాలర్షిప్ దరఖాస్తు గడువు

Telugu Ap Telangana, Jagan, Srivenkateswara, Telanagana, Gold, Top-Telugu Politi

  ఎస్సీ, ఎస్టీ, ఈ బీసీ, మైనారిటీ  విద్యార్థులు, వికలాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవాలి అని , 2021- 22 విద్యా సంవత్సరానికి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. 

10.హైకోర్టులో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ వ్యాపారులు పిటిషన్

  గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై పండ్ల వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ నెల 25 నుంచి మార్కెట్ క్లోజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. 

11.ఉద్యోగాల భర్తీకి జగన్ ఆదేశం

Telugu Ap Telangana, Jagan, Srivenkateswara, Telanagana, Gold, Top-Telugu Politi

  అక్టోబరు 1 నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 

12.వెటర్నరీ డిప్లొమా కోర్సులకు నేటి నుంచి వెబ్ ఆప్షన్ లు

  తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రజలు ఈ విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక మత్స్య శాస్త్ర విభాగ డిప్లమో కోర్సులకు దరఖాస్తు చేసిన విద్యార్థులంతా 25 నుంచి వెబ్ ఆప్షన్ లకు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్టర్ అరుణాచలం రవి తెలిపారు. 

13.ఏపీ ఒడిశా కు తుఫాన్ హెచ్చరిక

Telugu Ap Telangana, Jagan, Srivenkateswara, Telanagana, Gold, Top-Telugu Politi

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది అని ఐ ఎండి తెలిపింది. 

14.అక్టోబర్ 20 నుంచి తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్

  అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరగబోతున్న ఈ మేరకు టైం టేబుల్ విడుదలైంది. 

15.అక్టోబర్ 5 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telugu Ap Telangana, Jagan, Srivenkateswara, Telanagana, Gold, Top-Telugu Politi

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 5 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్ తోపాటు మిగతా మంత్రులు పాల్గొన్నారు. 

16.మానవ హక్కుల కమిషన్ను కృష్ణ గురుకుల పిఈటి అభ్యర్థులు

  నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా పిటి ఫలితాలు విడుదల చేయకపోవడంపై తెలంగాణ గురుకుల పిజిటి అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. 

17.అక్టోబర్ 5 వరకు మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లు

Telugu Ap Telangana, Jagan, Srivenkateswara, Telanagana, Gold, Top-Telugu Politi

  తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలను ఆయా కళాశాలలు అక్టోబర్ 5వ తేదీ వరకు తప్పనిసరిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రవేశాలు , రుసుముల నియంత్రణ కమిటీ స్పష్టం చేసింది. 

18.హైకోర్టులో వరవరరావు కు ఊరట

  ఎల్గార్ పరిషద్ కేసులో నిందితుడైన కవి వరవరరావు కు బొంబాయి హైకోర్టులో ఊరట లభించింది.అనారోగ్య కారణాలతో తనకు ఇచ్చిన బెయిలును తొలగించాల్సిందిగా కోరుతూ ఆయన దాఖలు చేసిన వ్యాజ్యం పై విచారణ ను ద్విసభ్య ధర్మాసనం అక్టోబర్ 13 వరకు వాయిదా వేసింది.అక్టోబర్ 14 వరకు తలోజా జైలు అధికారుల వద్ద లొంగిపోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. 

19.ఆరు నుంచి శ్రీ రామాయణ పారాయణ మహోత్సవాలు

Telugu Ap Telangana, Jagan, Srivenkateswara, Telanagana, Gold, Top-Telugu Politi

  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శరన్నవరాత్రోత్చవ ప్రయుక్త విజయదశమి శ్రీ రామాయణ పారాయణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈ ఓ బి శివాజీ , స్థానాచార్యులు కేఈ స్థలశాయి తెలిపారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,240   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,240

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube