న్యూస్ రౌండప్ టాప్ 20

1.బుద్దా వెంకన్న విడుదల

 స్టేషన్ బెయిల్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న విడుదల అయ్యారు. 

2.జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు

  జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

3.ఉద్యోగ సంఘాల ను చర్చలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం

  కొత్త పీఆర్సీ పై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం ఆపేది లేదంటున్న ప్రభుత్వ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. 

4.ఏపీ ప్రభుత్వం పై వీర్రాజు కామెంట్స్

  ఏపీ ప్రభుత్వం కనీసం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉందంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్స్ చేశారు. 

5.అమిత్ షా కు అన్నా హజారే లేఖ

  మహారాష్ట్ర షుగర్ ఫ్యాక్టరీల అమ్మకాల్లో అవకతవకలు చోటు చేసుకోవడం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ప్రముఖ సామాజిక వేత్త అన్నాహజారే లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. 

6.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,55,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

7.గవర్నర్ తమిళ సై ను కలిసిన బీజేపీ బృందం

  రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళ సై ను బీజేపీ  నేతలు కలిశారు.317 జీవో ను రద్దు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 

8.మేడారం జాతరకు జాతీయ హోదా తేవాలి

  మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకువచ్చి, ప్రత్యేక నిధులు తీసుకురావాలని ఎంపీ బండి సంజయ్  ను ఎమ్మెల్సీ కవిత కోరారు. 

9.పీజీ మెడికల్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

  పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజి హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

10.కర్ణాటకలో భూములకు ఆధార్ తరహా నంబర్ల

  కర్ణాటకలో భూములకు ఆధార్ తరహా నంబర్ ను కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 

11.ఐ ఎన్ యూ ఏ సెక్రెటరీ జనరల్ గా ప్రవీణ్ రావు

  ఇండియన్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అసోసియేషన్ ( ఐ ఎన్ యూ ఏ) సెక్రెటరీ జనరల్ గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు నియమితులయ్యారు. 

12.గిరిజన ఫోటో పోటి వాయిదా

  గిరిజన , సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ‘ తెలంగాణ గిరిజనులు ‘ అనే అంశంపై నిర్వహించ తలపెట్టిన పోటీలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

13.రాష్ట్రంలో 20 కొత్త రక్త నిధి కేంద్రాలు

  తెలంగాణ లో కొత్తగా 20 రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 

14.ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళేది లేదు : పిఆర్సి సాధన సమితి

  ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళేది లేదని పిఆర్సి సాధన సమితి ప్రకటించింది. 

15.వైయస్సార్ ఈ బీసీ నేస్తం నిధులు విడుదల

  వైయస్సార్ ఈ బి సి నేస్తం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. 

16.విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

  గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. 

17.టిడిపి నిజ నిర్ధారణ కమిటీ తో చంద్రబాబు భేటీ

  టిడిపి నిజనిర్ధారణ కమిటీ సభ్యులతో ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. 

18.కరోనా పరిస్థితులపై హై కోర్టు లో విచారణ

  తెలంగాణలో కరోనా పరిస్థితుల పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 

19.నేడు పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

  విశాఖలో పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,900   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,250  

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

AP And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold Rate , TDP Chief Chandrababu, Republic Day Celebrations, AP CM Jagan, Telangana Minister Harish Rao, Professor Jayashankar, AP BJP President Somu Veeraju - Telugu Ap Telangana, Apbjp, Ap Cm Jagan, Republic Day, Tdp Chandrababu, Telanganaharish, Gold, Top

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube