1.ఇందిరా శోభన్ కు షర్మిల ఫోన్ ?

వైఎస్ఆర్సిపి నాయకురాలు గా ఉన్న ఇంద్ర శోభన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ షర్మిల ఇందిరా శోభన్ కు ఫోన్ చేసి మాట్లాడి పార్టీలోనే ఉండాల్సింది గా కోరారు.
2.ములుగు జిల్లాలో పెద్ద పులుల సంచారం
ములుగు – భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లోని వెంకటాపురం మండలం ఎదురుగుట్ట వద్ద మూడు పెద్ద పులుల సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది.
3.టీచర్ల రేషనలైజేషన్ కు ప్రత్యేక సాప్ట్ వేర్
ప్రత్యేక సాప్ట్ వేర్ ను ఉపయోగించి ఉపాధ్యాయ సంబంధించిన రేషనలైజేషన్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్న క్రమంలో దీనికోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తున్నారు.
4.సీజేఐ రమణకు వీహెచ్ లేఖ

చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కు మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు లేఖ రాశారు.హజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
5.గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి

మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు.
6.చిన్నపిల్లలకూ కరోనా వ్యాక్సిన్
త్వరలోనే చిన్న పిల్లలకు యాక్షన్ అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
7.ప్రశాంతంగా ముగిసిన ఐసెట్

ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన టీఎస్ ఐసెట్ 2021 ఆన్లైన్ పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ముగిసాయి.
8.ఏఐ, మిషన్ లెర్నింగ్ లో హెచ్సీయూ కోర్సులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లో ఒక సంవత్సరం డెప్లమో కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
9.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 18,086 మంది భక్తులు దర్శించుకున్నారు.
10. కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

సూర్యాపేట జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది.
11.తెలంగాణలో తేలికపాటి వర్షాలు

రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి , ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
12.లా సెట్ కు నేడు హాల్ టికెట్ లు
తెలంగాణలో లాసెట్ రాసే అభ్యర్థులు తమ హాల్ టికెట్ ను శుక్రవారం సాయంత్రం 7 గంటల్లో గా డౌన్లోడ్ చేసుకోవాలని లా సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జి బి రెడ్డి సూచించారు.
13.కర్నూలు లో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలి
కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలని విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ లేవనెత్తారు.
14.బుచ్చయ్య కు బుజ్జగింపులు

టిడిపి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ని బుజ్జగించే పనిలో టీడీపీ హై కమాండ్ ఉంది.
15.గన్నవరం ఎయిర్ పోర్ట్ లో స్పైస్ జెట్ విమానాలు రద్దు
కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం స్పైస్ జెట్ విమానాలు రద్దయ్యాయి.ప్రయాణికుల సంఖ్య బుకింగ్ కానీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
16.ఆన్ లైన్ లో డిగ్రీ ప్రవేశాలు
ఏపీలో ఈ ఏడాది కూడా ఆన్లైన్ లోనే అడ్మిషన్ లు చేపట్టాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
17.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 36,571 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.ఏపీలో నైట్ కర్ఫ్యూ
ఏపీలో కరోనా నేపథ్యంలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
19.భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు

భారత దౌత్య కార్యాలయాలల్లో తాలిబన్లు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.ఆఫ్గాన్ లోని కాందహార్ , హెరాత్ నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,400 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,400