న్యూస్ రౌండప్ టాప్ 20

1.హుస్సేన్సాగర్లో గణేశ్ నిమజ్జనం కి సుప్రీం కోర్టు ఓకే

Telugu Amarinder Singh, Ap Telangana, Ktr, Mp Vijayasai, Sri Lanka, Gold, Top-La

  హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.దీంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
 

2.నిందితుడు రాజు ఆత్మహత్య

  ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కామాందు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
 

3.రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ స్పందన

Telugu Amarinder Singh, Ap Telangana, Ktr, Mp Vijayasai, Sri Lanka, Gold, Top-La

  ఆరేళ్ళ చిన్నారి హత్య కేసు రాజు ఆనిందితుడుత్మహత్య చేసుకోవడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.చిన్నారిపై అత్యాచారం చేసిన మృగం చనిపోయిందంటూ ట్విట్టర్ లో కేటీఆర్ వ్యాఖ్యానించారు.
 

4.తెలంగాణకు అమిత్ షా

  కేంద్ర హోం మత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు.శుక్రవారం నిర్మల్ లో మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
 

5.తిరుమల సమాచారం

Telugu Amarinder Singh, Ap Telangana, Ktr, Mp Vijayasai, Sri Lanka, Gold, Top-La

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 23,661 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
 

6.దోస్త్ మూడో దశ గడువు పొడగింపు

  డిగ్రీ సీట్ల భర్తీకి సంబంధించి దోస్త్ మూడో దశకు ఆన్లైన్ నమోదు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడగించారు.
 

7.హైకోర్టులో సవాల్ చేస్తా : రఘురామ

Telugu Amarinder Singh, Ap Telangana, Ktr, Mp Vijayasai, Sri Lanka, Gold, Top-La

  అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో తాను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ ను సిబిఐ కోర్టు కొట్టివేయడం తో హైకోర్టులో పిటిషన్ వేస్తానని వైసిపి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
 

8.నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగనుంది.
 

9.టిడిపి కార్యాలయంలో కోడెల రెండవ వర్ధంతి

Telugu Amarinder Singh, Ap Telangana, Ktr, Mp Vijayasai, Sri Lanka, Gold, Top-La

  టిడిపి కేంద్ర కార్యాలయంలో దివంగత నేత శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
 

10.మందడం లో మూడు రాజధానుల పోస్టార్ కలకలం

  రాజధాని గ్రామం మండలం లో మూడు రాజధానుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.3 రాజధానుల రూపశిల్పి అంబేద్కర్ ఆశయ సాధకుడు జగన్ అంటూ మండలంలో పోస్టర్లు వెలిశాయి.
 

11.ఏపీలో జడ్పిటిసి ఎంపిటిసి కౌంటింగ్ కు హైకోర్టు అనుమతి

  ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 

13.ఆఫ్ఘన్ విద్యార్థుల నిరసన

Telugu Amarinder Singh, Ap Telangana, Ktr, Mp Vijayasai, Sri Lanka, Gold, Top-La

  తాలిబన్లతో పాకిస్థాన్ చేతులు కలపడం పై విశాఖలో ఆఫ్ఘన్ విద్యార్థులు నిరసనకు దిగారు.
 

14.  ఏపీ కేబినెట్ భేటీ

  ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది.మొత్తం నలభై అంశాలు అజెండాగా క్యాబినెట్ చర్చించనుంది.
 

15.బిజెపి అధికారంలోకి రాదు

Telugu Amarinder Singh, Ap Telangana, Ktr, Mp Vijayasai, Sri Lanka, Gold, Top-La

  తెలంగాణలో బిజెపి అధికారంలో లేదని ,వచ్చే అవకాశం కూడా లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు జోస్యం చెప్పారు.
 

16.రెండో రోజుకు చేరిన డాక్టర్ల సమ్మె

  తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కృష్ణా జిల్లాలో డాక్టర్లు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది.
 

17.పంజాబ్ లో ఉగ్రవాదుల అరెస్ట్

  పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ఉగ్రవాదుల ను అరెస్టు చేసిన తరువాత, ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ప్రకటించారు.
 

18.నీట్ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రం

  నీట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఆత్మస్థైర్యం కలిగించే దిశగా చెన్నైలో ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రం ఏర్పాటైంది.
 

19.శ్రీలంక కారైక్కాల్ మధ్య నౌకాయానం

Telugu Amarinder Singh, Ap Telangana, Ktr, Mp Vijayasai, Sri Lanka, Gold, Top-La

  శ్రీలంక కారైక్కాల్ మధ్య నౌకాయానం ప్రారంభించే విషయమై పుదుచ్చేరి ముఖ్యమంత్రి తో శ్రీ లంక దేశ ప్రతినిధులు చర్చించారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,330   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,330

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube