న్యూస్ రౌండప్ టాప్ - 20

1.కెసిఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ పై దాడి : అరుణ

Telugu Ap Telangana, Ap, Bandi Sanjay, Cpi Yana, Telangana Bjp, Telangana, Gold,

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ పై దాడి జరిగిందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ విమర్శించారు. 

2.గవర్నర్ కు బిజెపి నేతల ఫిర్యాదు

  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వాహనం పలువురు  నేతలు దాడి చేసిన సంఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు తెలంగాణ బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. 

3.ఈటెల భూ ఆక్రమణ ఆరోపణలపై విచారణ ప్రారంభం

Telugu Ap Telangana, Ap, Bandi Sanjay, Cpi Yana, Telangana Bjp, Telangana, Gold,

  హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన భూ ఆక్రమణ ఆరోపణలపై ఈ రోజు విచారణ ప్రారంభమైంది. 

4.తెలంగాణలో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

5.ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telugu Ap Telangana, Ap, Bandi Sanjay, Cpi Yana, Telangana Bjp, Telangana, Gold,

  ఢిల్లీ లోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మద్యం విక్రయాల వ్యాపారం నుండి శాశ్వతంగా తప్పుకుంది. 

6.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

  రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఏజీ బి ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. 

7.సిద్దిపేట కలెక్టర్ గా హనుమంతరావు

Telugu Ap Telangana, Ap, Bandi Sanjay, Cpi Yana, Telangana Bjp, Telangana, Gold,

  సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ గా ఎం హనుమంతరావు బాధ్యతలు అప్పగించారు. 

8.కుప్పం ఎన్నికల ఓట్ల లెక్కింపు పై హైకోర్టులో పిటిషన్

  కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడు నిర్మించాలని కోరుతూ టిడిపి అభ్యర్థులు హైకోర్టును లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

9.తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి పరిహారం

Telugu Ap Telangana, Ap, Bandi Sanjay, Cpi Yana, Telangana Bjp, Telangana, Gold,

  తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.ఈ ఏడాది సెప్టెంబర్ లో వచ్చిన గులాబ్ సైక్లోన్ కారణంగా 34,586 మంది రైతులు పంట నష్ట పోయారు ఆ రైతులు ఖాతాల్లోకి 22 కోట్ల రూపాయల పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. 

10.ఏపీలో ఆపరేషన్ పరివర్తన్

  గంజాయి వ్యవహారంపై గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం తీవ్రంగానే దృష్టిపెట్టింది.ఈ నేపథ్యంలో ని ఆపరేషన్ పరివర్తన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇప్పటివరకు పోలీస్ శాఖ, ఎస్ ఈ బీ  అధికారులు కలిసి 2,228 ఎకరాల్లో గంజాయి పంటలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. 

11.సుప్రీంను ఆశ్రయించిన ఉద్యోగులు

Telugu Ap Telangana, Ap, Bandi Sanjay, Cpi Yana, Telangana Bjp, Telangana, Gold,

  ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.జూలై 14న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్ ఇవ్వలేదని పిటిషన్ ఏపీ ఉద్యోగులు వేశారు.దీనిపై విచారించిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 3 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. 

12.రహదారుల మరమ్మతులపై జగన్ ఆదేశాలు

  రహదారుల మరమ్మతులు పునరుద్ధరణపై క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 

12.  సజ్జల ప్రెస్ మీట్ పెడితే కోర్టుకి వెళ్తా : వర్ల

  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తే తాను కోర్టుకు వెళ్తానని టిడిపి నేత వర్ల రామయ్య అన్నారు. 

13.కంగనా రనౌత్ పై అసదుద్దీన్ విమర్శలు

   భారత స్వాతంత్రం పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. 

14.తెలంగాణ ఆర్టీసీ మరో ఫ్రీ ఆఫర్

Telugu Ap Telangana, Ap, Bandi Sanjay, Cpi Yana, Telangana Bjp, Telangana, Gold,

  తెలంగాణ ఆర్టీసీ మరో ఫ్రీ ఆఫర్ ను ప్రకటించింది.తెలంగాణలోని అయ్యప్ప స్వాముల కోసం కేరళలోని శబరిమలై కి బస్సు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది.శబరిమలకు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకుంటే ఆ బస్సులో ప్రయాణించే వారు ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని అధికారులు తెలిపారు. 

15.అమరావతి కేసుల పై హైకోర్టులో విచారణ

  రాజధాని అమరావతి కేసులపై ఏపీ హైకోర్టు విచారణ కొనసాగుతోంది.  పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. 

16.ఈటెల రాజేందర్ కు గవర్నర్ అభినందనలు

Telugu Ap Telangana, Ap, Bandi Sanjay, Cpi Yana, Telangana Bjp, Telangana, Gold,

  హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను తమిళనాడు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ప్రత్యేకంగా అభినందించినట్లు రాజేందర్ తెలిపారు. 

17.సీపీఐ నారాయణ విమర్శలు

  మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల ఎన్.హెచ్.44 పక్కన వరికుప్పల ను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని బిజెపి టిఆర్ఎస్ ల పై విమర్శలు చేశారు. 

18.18 నుంచి ప్రత్యేక రైళ్లలో తగ్గనున్న చార్జీలు

Telugu Ap Telangana, Ap, Bandi Sanjay, Cpi Yana, Telangana Bjp, Telangana, Gold,

  రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో నైరుతి రైల్వే జోన్ పరిధిలో ఈనెల 18 నుంచి సాధారణ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ప్రత్యేక  చార్జీలను తగ్గించనున్నారు. 

19.12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

  తెలంగాణలో స్థానిక సంస్థల కోట లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువదింది.నేటి నుంచి ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,360   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,360

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube