న్యూస్ రౌండప్ టాప్ 20

1.హైదరాబాదులో కోట్ల విలువైన కార్లు సీజ్

పన్నులు చెల్లించకుండా యదేచ్చగా తిరుగుతున్న విదేశీ కార్లపై రవాణాశాఖ దృష్టిపెట్టిన హైదరాబాద్ లో అక్రమంగా తిరుగుతున్న దాదాపు 11 ఖరీదైన విదేశీ కార్లను సీజ్ చేశారు.
 

2.కెసిఆర్ పై బండి సంజయ్ ఆగ్రహం

Telugu Ap Telangana, Bandi Sanjay, Chirenjeevi, Cm Jagan, Lokesh, Meghalayaconra

  సీఎం కేసీఆర్ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు హుజురాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు.దళిత మందు తో పాటే గిరిజన , బీసీ బంద్ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
 

3.తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

  పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం,  దక్షిణ ఓడిశా, ఉత్తరాంధ్ర ను అనుకుని అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
 

4.10 లక్షలు కాదు 50 లక్షలు ఇవ్వాలి : షర్మిల

Telugu Ap Telangana, Bandi Sanjay, Chirenjeevi, Cm Jagan, Lokesh, Meghalayaconra

  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం పై వైఎస్ షర్మిల స్పందించారు దళితులకు 10 లక్షలు ఇవ్వడం కాదని వారికి 51 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
 

5.రాయలసీమ ఎత్తిపోతల పథకం పై విచారణ

  ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా నీటి వివాదం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే.దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ రోజు విచారణ జరగనుంది.
 

6.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Bandi Sanjay, Chirenjeevi, Cm Jagan, Lokesh, Meghalayaconra

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 21,538 మంది భక్తులు దర్శించుకున్నారు.
 

7.పేద నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

నిరుపేద నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు లాస్య ఇన్ఫోటెక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఓరుగంటి వెంకట్ తెలిపారు.మరిన్ని వివరాలకు 9849577637 , 7330666886 నంబర్లను సంప్రదించాలని కోరారు.
 

8.తెలంగాణలో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 245 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

9.సిబిఐ విచారణకు వైఎస్ ప్రకాష్ రెడ్డి

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది పులివెందులలో జరుగుతున్న విచారణకు వైయస్ ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు.
 

10.రమ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

Telugu Ap Telangana, Bandi Sanjay, Chirenjeevi, Cm Jagan, Lokesh, Meghalayaconra

   గుంటూరు లోని కాకాని రోడ్ లో బిటెక్ విద్యార్థిని రమ్యను ఓ యువకుడు దారుణంగా పొడిచి హత్య చేసిన ఘటనపై పెద్ద దుమారమే రేగుతోంది.తాజాగా రమ్య కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు.
 

11.జగన్ నివాసం ముట్టడికి ప్రయత్నం

  ఏపీ సీఎం జగన్ నివాసం గురించి ఎందుకు అర్బన్ హెల్త్ సెంటర్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ప్రయత్నించగా పోలీసు లు వారు మధ్యలోనే అడ్డుకున్నారు.
 

12.ఏపీలో 21 వరకు రాత్రి కర్ఫ్యూ

  ఏపీలో ఈ నెల 21వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 

12.తాలిబన్ల ప్రకటన

Telugu Ap Telangana, Bandi Sanjay, Chirenjeevi, Cm Jagan, Lokesh, Meghalayaconra

  ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం సంపూర్ణంగా ముగిసింది అంటూ తాలిబన్లు ప్రకటించారు.
 

13.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 32,937 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

14.సీఎం నివాసంపై పెట్రోల్ బాంబు దాడి

Telugu Ap Telangana, Bandi Sanjay, Chirenjeevi, Cm Jagan, Lokesh, Meghalayaconra

  మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు.ఈ దాడుల వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.
 

15.చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ

  మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో బాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు.సినీ పరిశ్రమ సంబంధించిన అనేక సమస్యలపై వీరి మధ్య చర్చకు వచ్చింది.
 

16.నారా లోకేష్ అరెస్ట్

Telugu Ap Telangana, Bandi Sanjay, Chirenjeevi, Cm Jagan, Lokesh, Meghalayaconra

  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్మి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన క్రమంలో వైసిపి టిడిపి శ్రేణులు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ క్రమంలోనే లోకేష్ తో పాటు, మాజీ మంత్రులు కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.
 

17.తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం

  తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన  నిర్ణయం తీసుకున్నారు.వివిధ వర్గాలకు చెందిన  24 మంది బ్రాహ్మణేతరులను వివిధ పుణ్యక్షేత్రాలలో అర్చకులుగా నియమించింది.
 

18.పంజాబ్ సరిహద్దుల్లో పాక్ బెలూన్ లు

Telugu Ap Telangana, Bandi Sanjay, Chirenjeevi, Cm Jagan, Lokesh, Meghalayaconra

  పంజాబ్ సరిహద్దుల్లోని రూప్ నగర్ జిల్లా సనొడా  గ్రామం పంటపొలాల్లో పాక్ బెలూన్లు కలకలం రేపు గా వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు.
 

19.ఒడ్డుకు చేరిన లారీలు

  కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు రీచ్ లో వరద ప్రవాహం లో చిక్కుకుపోయిన ఇసుక లారీలను ఎట్టకేలకు  అధికారులు ఒడ్డు కు తరలించారు.మొత్తం 132 లారీలు, నాలుగు ట్రాక్టర్లు ఈ వరదలో చిక్కుకున్నాయి.
 

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Bandi Sanjay, Chirenjeevi, Cm Jagan, Lokesh, Meghalayaconra

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,980   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,980

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube