న్యూస్ రౌండప్ టాప్ 20

1.పోలీసులపై కోమటిరెడ్డి ఫైర్

Telugu Ap Telangana, Dk Aruna, Mpkomati, Narendra Modi, Pallarajeshwar, Gold, To

  రాష్ట్రంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య ఘటనపై కాంగ్రెస్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.ఆరేళ్ల పసి పాపపై ఒక రాక్షసుడు హత్యాచారం చేయడం దారుణం అన్నారు.నిందితుడిని పట్టిస్తే 10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటించడం హాస్యాస్పదం అని, పోలీసులు ఉన్నది గాడిదలు కాయడానికి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు.
 

2.కెసిఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

  ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.ఉద్యోగ ఖాళీలతో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 

3.రేపు ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణం

Telugu Ap Telangana, Dk Aruna, Mpkomati, Narendra Modi, Pallarajeshwar, Gold, To

  నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రేపు ఉదయం 10 గంటలకు ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

4.నిరుద్యోగుల బిక్షాటన

  కెసిఆర్ బోగస్ నోటిఫికేషన్ ల పేరుతో ఉద్యోగులను మోసం చేస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్ అన్నారు.ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హుజురాబాద్ లో నిరుద్యోగ ఉద్యమకారులు భిక్షాటన చేసి నిరసన తెలియజేశారు.
 

5.మోడల్ టీచర్ల ధర్నా

Telugu Ap Telangana, Dk Aruna, Mpkomati, Narendra Modi, Pallarajeshwar, Gold, To

  తెలంగాణలో మోడల్ పాఠశాల లో గంటల ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత ఏడాది వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
 

6.నేడు లా సెట్ ఫలితాలు విడుదల

  లాసెట్ ఫలితాలను బుధవారం విడుదల చేస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ జి బి రెడ్డి తెలిపారు.
 

7.రఘురామరాజు పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

  నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణా హైకోర్టు కొట్టి వేసింది.ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను సిబిఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో తీర్పు ఈ విధంగా వెలువడింది.
 

8.ఈడి విచారణకు మమైత్ ఖాన్

Telugu Ap Telangana, Dk Aruna, Mpkomati, Narendra Modi, Pallarajeshwar, Gold, To

  డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నేడు ఈడీ అధికారులు ముందు నటి ముమైత్ ఖాన్ హాజరయ్యారు.
 

9.కేటీఆర్ పై డీకే అరుణ విమర్శలు

  తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.వాల్మీకి బోయలను ఎస్టీ లో కలిపిన రాష్ట్ర తీర్మానం కాపీని చూపించాలని, లేదంటే రాజీనామా చేయాలంటూ అరుణ డిమాండ్ చేశారు.
 

10.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Dk Aruna, Mpkomati, Narendra Modi, Pallarajeshwar, Gold, To

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 24,004 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
 

11.నేడు రేపు ఇడుపులపాయలో ఎన్జీటీ బృందం పర్యటన

  జాతీయ హరిత ట్రైబ్యునల్ ( ఎన్ జి టి) ఆదేశాల మేరకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు ఇతరుల బృందం ఈనెల 15 16 తేదీల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనుంది.
 

12.ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల

  ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.ఫలితాలను మంత్రి గౌతమ్ రెడ్డి విడుదల చేశారు.
 

13.నేటి నుంచి కృష్ణా జిల్లాలో డాక్టర్ల సమ్మె

Telugu Ap Telangana, Dk Aruna, Mpkomati, Narendra Modi, Pallarajeshwar, Gold, To

  కృష్ణా జిల్లాలో నేటి నుంచి డాక్టర్ల సమ్మె జరగనుంది.తమ డిమాండ్ల సాధనకు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ విధులను బహిష్కరిస్తున్నారు.బాకీ పడ్డ 5 నెలల జీతాలు, వేతనాల పెంపు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.
 

14.గీతం దూరవిద్య పై యూజీసీ నిషేధం

  గీతం వర్సిటీ నిర్వహిస్తున్న దూరవిద్య ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రెటరీ ప్రొఫెసర్ రజనీస్ జైన్  తెలిపారు.
 

15.  నేటి నుంచి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు

Telugu Ap Telangana, Dk Aruna, Mpkomati, Narendra Modi, Pallarajeshwar, Gold, To

  అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి శనివారం వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు.

16.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 27,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

17.మమతా బెనర్జీ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

  పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆ పత్రాల్లో ఆమెపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసుల గురించి వివరించ లేదని బిజెపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
 

18.సంక్షేమ పథకాలపై కేంద్ర క్యాబినెట్ సమీక్ష

Telugu Ap Telangana, Dk Aruna, Mpkomati, Narendra Modi, Pallarajeshwar, Gold, To

  ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం భేటీ అయి వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు ముఖ్యంగా కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రధానంగా చర్చ జరిగింది.
 

19.భారత ప్రయాణికులపై చైనా ఆంక్షలు కొనసాగింపు

  చైనాలో చదువుతున్న భారత విద్యార్థులను పనిచేస్తున్న ఉద్యోగులను తిరిగి చైనాలోకి అనుమతించడం పై ఆ దేశం ఆంక్షలను కొనసాగిస్తోంది.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,000   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,000    

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube