న్యూస్ రౌండప్ టాప్ 20

1.తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు

Telugu Ap Telangana, Chhattisgarh, Jharkhand, Sai Dharam Tej, Gold, Top, Ys Shar

  నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్న తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.తీన్మార్ మల్లన్న పాదయాత్ర కోసం 20 లక్షలు ఇవ్వాలని కళ్ళు వ్యాపారి గౌడ్ ను డిమాండ్ చేసిన వ్యవహారంలో ఈ కేసు నమోదు అయ్యింది.
 

2.ఫార్మసీ లో ఈ లెర్నింగ్ విధానం

  ఫార్మసీ రంగంలో ఈ లెర్నింగ్ విధానాన్ని విద్యార్థులకు అందించే ఉద్దేశంతో యుకే కు  చెందిన ఇన్ఫ్ ప్లస్ సంస్థ , నెహ్రూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సంయుక్త ఒప్పందం కుదుర్చుకున్నాయి.
 

3.ప్రయాణిస్తున్న కారులో మంటలు

Telugu Ap Telangana, Chhattisgarh, Jharkhand, Sai Dharam Tej, Gold, Top, Ys Shar

  ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన కొడంగల్ మండలం కస్తూరి పల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.ఈ ప్రమాదం అందరు సురక్షితంగా బయటపడ్డారు.
 

4.బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంకల్పయాత్ర 16 వ రోజుకు చేరుకుంది నేడు మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ నుంచి కొల్చారం మండలం రంగం పేట వరకు పాదయాత్ర కొనసాగనుంది.
 

5.కెసిఆర్ కు బండి సంజయ్ లేఖ

Telugu Ap Telangana, Chhattisgarh, Jharkhand, Sai Dharam Tej, Gold, Top, Ys Shar

  తెలంగాణ సీఎం కేసీఆర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
 

6.నేడు తిరుమలగిరిలో షర్మిల దళిత భేరి సభ

  నల్గొండ జిల్లా తిరుమలగిరి లో ఆదివారం వైయస్ షర్మిల ఆధ్వర్యంలో దళిత సభను నిర్వహించనున్నారు.
 

7.విజయ డైరీ ఎండీ పై వేటు

Telugu Ap Telangana, Chhattisgarh, Jharkhand, Sai Dharam Tej, Gold, Top, Ys Shar

  విజయ డైరీ ఎండి శ్రీనివాస రావు పై ప్రభుత్వం వేటు వేసింది.ఆయన్ను తప్పిస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 

8.లోక్ అదాలత్ లు 63 వేల కేసుల పరిష్కారం

  తెలంగాణలో 63345 పెండింగ్ కేసులు శనివారం పరిష్కారం అయినట్లు తెలంగాణ లీగల్ సర్వీసెస్ సభ్య కార్యదర్శి రేణుక తెలిపారు.
 

9.నది బోర్డు చైర్మన్ లకు ఢిల్లీ పిలుపు

Telugu Ap Telangana, Chhattisgarh, Jharkhand, Sai Dharam Tej, Gold, Top, Ys Shar

  కృష్ణ గోదావరి బోర్డు పరిధిలోకి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను తీసుకువెళుతూ గెజిట్ ను కేంద్రం విడుదల చేసింది.నిర్ణీత గడువు ప్రకారం అక్టోబర్ 14 నుంచి అమలు చేసే అంశంపై చర్చించేందుకు రెండు బోర్డు చైర్మన్ లను ఢిల్లీ కి పిలిచింది.
 

10.ఉత్తర తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

  బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
 

11.మూడు రోజులు వేటకు వెళ్ల వద్దు

Telugu Ap Telangana, Chhattisgarh, Jharkhand, Sai Dharam Tej, Gold, Top, Ys Shar

  ఐ ఎన్ డి వాతావరణ సూచన ప్రకారం తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, అది వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో ఉత్తర పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు.ఈ ప్రభావంతో రాగల రెండు రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికార్లు హెచ్చరించారు.
 

12.శంషాబాద్ విమానాశ్రయం విస్తరణకు కేంద్ర మంత్రులు ఓకే

  వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం విస్తరణకు సహకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు.
 

13.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

14.సాయి ధరమ్ తేజ్ కు సర్జరీ పూర్తి

Telugu Ap Telangana, Chhattisgarh, Jharkhand, Sai Dharam Tej, Gold, Top, Ys Shar

  బైక్ ప్రమాదంలో గాయపడిన హీరో సాయి ధరమ్ తేజ్ కు అపోలో ఆస్పత్రిలో సర్జరీ పూర్తయింది.
 

15.వినాయక నిమజ్జనం పై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్

  వినాయక నిమజ్జనం పై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్ వేస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
 

16.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

  రాష్ట్ర విభజన సమయంలో రాజధానులను కోల్పోయిన ఆంధ్ర ప్రదేశ్ తో పాటు, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ లకు పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
 

17.రంగారెడ్డి జిల్లాలో భూకంపం

Telugu Ap Telangana, Chhattisgarh, Jharkhand, Sai Dharam Tej, Gold, Top, Ys Shar

  రంగారెడ్డి జిల్లాలోని తొర్మామిడి , బోనాపురం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారం గ్రామంలో భూమి కంపించడం తో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
 

18.హెచ్ఎండి వెబ్ సైట్ బంద్

  హెచ్ఎండి వెబ్ సైట్ మళ్లీ బంద్ అయ్యింది.దీంతో నాలుగు రోజులు గా వెబ్ సైట్ మళ్లీ బంద్ అయ్యింది.
 

19.యాదాద్రికి కేసీఆర్ 

Telugu Ap Telangana, Chhattisgarh, Jharkhand, Sai Dharam Tej, Gold, Top, Ys Shar

  మంగళవారం యాదాద్రి ఆలయాన్ని పరిశీలించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 43,990   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,990

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube